ప్రతిపక్ష నేతే టార్గెట్!
అందుకే సరస్వతి పవర్ మైనింగ్ లీజు రద్దు
రాజకీయ వేధింపులు పదునెక్కుతున్నా యి. ఇన్నాళ్లూ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్ని టార్గెట్ చేసి హత్యాకాండకు తెగబడ్డ తెలుగుదేశం ప్రభుత్వం... ఇపుడు నేరుగా ప్రతిపక్ష నేతపైనే కక్ష సాధింపులకు దిగింది. గుంటూరు జిల్లా లో సరస్వతీ పవర్‌కు చెందిన సిమెంటు ప్లాం టుకు ఇన్నాళ్లూ మోకాళ్లడ్డుతూ వచ్చిన టీడీపీ... ఇపుడు ఏకంగా ఆ సంస్థకిచ్చిన మైనింగ్ లీజుల్నే రద్దు చేసింది. ‘‘లీజు ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి మైనింగ్ కలాపాలు జరపలేదు. భూమి నిరుపయోగంగా ఉంది కనక సెక్షన్ 28(1) కింద లీజు రద్దు చేస్తున్నాం’’ అని గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో భూగర్భ గనుల శాఖ పేర్కొంది. పోనీ... గనుల శాఖ వా దనే నిజమనుకుందాం! నిర్మాణ పనులు జరగాలంటే ప్రభుత్వం సహకరించాలి? అన్నిటికన్నా ముఖ్యంగా నీటి వసతి ఉండాలి!! మరి నీటి కేటాయింపులు చేయాలంటూ 2009లో సంస్థ పెట్టిన దరఖాస్తును ఇప్పటిదాకా ప్రభుత్వం ఎందుకు అనుమతించలేదు? అనుమతులివ్వకుండా సతాయించి పనులు చేపట్టలేదు కాబట్టి లీజు రద్దు చేస్తున్నామంటే అర్థమేంటి? వై.ఎస్.జగన్‌పై కక్ష సాధింపులకు దిగుతున్నట్టు కాదా?
2009 జూన్ నెలలో గుంటూరు జిల్లా తంగెడ, వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లో సరస్వతి పవర్‌కు 613 హెక్టార్లలో(1,515 ఎకరాల్లో) నాటి ప్రభుత్వం సున్నపురాయి మైనింగ్ లీజు మంజూ రు చేసింది.
ఇవన్నీ ప్రైవేటు భూములే. స్థానిక రైతుల నుంచి నాటి మార్కెట్ ధరకన్నా రెండిం తలు ఎక్కువ పెట్టి భూమి రకాన్ని బట్టి ఎకరాకు రూ.3 లక్షల నుంచి 8.5 లక్షల వరకూ చెల్లించా రు. 2009లోనే అటవీ, పర్యావరణ అనుమతుల కోసం సంస్థ కేంద్రానికి దరఖాస్తు చేసింది. మూడేళ్లపాటు నాన్చిన కేంద్రం 2012లో అనుమతులిచ్చింది. అవి పూర్తిగా మెట్టభూములు కావటంతో ప్లాంటు నిర్మాణానికి నీటి అవసరం ఉంటుంది కనక పక్కనే ఉన్న కృష్ణా నది నుంచి నీరు కేటాయించాలని సంస్థ 2009లో దరఖాస్తు చేసింది. అయితే ైవె .ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామా ల నేపథ్యంలో అధికారుల స్థాయిలో అంతా ఆ మోదించినా సీఎం కార్యాలయంలో పెండింగ్‌లో పడిపోయింది. ముఖ్యమైన ఈ అనుమతి రాకపోవటంతో భూగర్భ జలాల ఆధారంగా నిర్మా ణం చేపట్టే సాహసాన్ని సంస్థ చేయలేకపోయిం ది. ఇంతలో స్థానికంగా ఉన్న తెలుగుదేశం నేత లు రైతుల్ని రెచ్చగొట్టి ఆ భూముల్లో పంటలు వేయించారు. అడ్డుకున్న సంస్థ ప్రతినిధులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. ఇప్పడు తెలుగుదేశ ం పార్టీ అధికారంలోకి రావటంతో వేధింపులు తారాస్థాయికి చేరాయి.
అనుమతులివ్వాల్సింది సర్కారు కాదా?
లక్షల రూపాయలు వెచ్చించి కొన్న భూముల్లో కంపెనీ పెట్టాలనుకున్నపుడు స్థానికుల ఉపాధి కోసమైనా ప్రభుత్వం సహకరించాలి కదా? నీరు కేటాయించకుండా, పీసీబీ అనుమతులివ్వకుండా సతాయిస్తే నిర్మాణం మొదలయ్యేదెలా? పెపైచ్చు స్థానిక నేతల ద్వారా రైతుల్ని రెచ్చగొడితే పనులు జరిగేదెలా? ఏం! అప్పట్లో భూములమ్మేసిన రైతులు ఇపుడొచ్చి రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తామంటే ఏ ప్రభుత్వమైనా ఇలాగే ప్రోత్సహిస్తుందా? ఇదెక్కడి తీరు? ఆఖరికి కేంద్ర అటవీ శాఖ అనుమతులిచ్చినా కూడా... ఆ విషయాన్ని కంపెనీ ప్రతినిధులు ప్రతి ప్రభుత్వ విభాగానికీ తెలియజేసినా కూడా గురువారం నాటి జీవోలో అటవీ అనుమతులు కూడా లేవని పేర్కొన్నారంటే అర్థమేంటి? జగన్మోహన్రెడ్డిపై గుడ్డి వ్యతిరేకతతో ముందుకెళుతున్నారని కాదా? చంద్రబాబు భార్య భువనేశ్వరి వ్యాపారాల్లో ఉండగా లేనిది జగన్మోహన్రెడ్డి భార్య ఒక కంపెనీలో డెరైక్టరుగా ఉంటే తప్పా? ఎందుకీ దిగజారుడు రాజకీయాలు?
మరి ఈ సంస్థలు కనపడలేదా బాబూ?
గుంటూరు జిల్లా దాచేపల్లిలో గుజరాత్ అం బుజా సిమెంట్స్‌కు 1999లో 695 ఎకరాల్లో సున్నపురాయి మైనింగ్ లీజు మంజూరు చేస్తూ జీవో నెంబరు-182 జారీ చేశారు. ఆ సంస్థ ఇప్పటికీ పనులు ప్రారంభిస్తే ఒట్టు.
అదే సంస్థకు అదే ప్రాంతంలో 2000లో 1,564 ఎకరాల్లో సున్నపురాయి లీజు మంజూ రు చేశారు. దాని సంగతీ సేమ్ టు సేమ్.
గుంటూరు జిల్లా గురజాలలో సంఘీ ఇండస్ట్రీస్‌కు 2006లో 4,950 ఎకరాల్లో మైనింగ్ లీజు మంజూరు చేశారు. ఆ సంస్థ ఇప్పటికీ పనులు మొదలుపెట్టనే లేదు.
ఆంధ్రా సిమెంట్స్దీ అదే పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే కంపెనీల సంఖ్య కొన్ని పదుల్లో ఉంటుంది. ఈ సంస్థలేవీ లీజులు పొంది దశాబ్దాలు దాటుతున్నా పనులు ఆరంభించనే లేదు. ఆరంభిస్తాయన్న సూచనలూ లేవు. మరి వీటన్నిటినీ పట్టించుకోని ప్రభుత్వం కేవలం జగన్మోహన్రెడ్డి సంస్థలనే ఎందుకు టార్గెట్ చేస్తోంది? రాజకీయంగా తనను ప్రతి అంశంలోనూ ఇరుకున పెడుతున్నందుకా? రుణ మాఫీ నుంచి పింఛన్ల వరకూ ప్రతి అంశంలోనూ ప్రజల తరఫున పోరాడుతున్నందుకా? ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే పద్ధతి ఇదేనా?!