సాధ్యమైనంత తొందరగా సీలింగ్: సోనోవాల్
గుహవతి: అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఇండో- బంగ్లా బార్డర్ కు యుద్ధ ప్రాతిపదికన సీలింగ్ వేయాలని బార్డర్ సెక్యూరిటీ పోర్స్(బీఎస్ఎఫ్) కు సూచించారు. బీఎస్ఎఫ్ అత్యన్నత స్థాయి అధికారులతో సమావేశమైన సోనోవాల్ అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు త్వరితగతిన కంచె నిర్మించాలని వారికి సూచించారు.
ఇందుకోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకో్వాలని పేర్కొన్నారు. లేజర్ వాల్ నిర్మాణం గురించి ఆలోచించాలని, నదీజలాలు, బార్డర్ వెంబడి భద్రతకు సీలింగ్ చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. బార్డర్ వెంబడి సీలింగ్ అనేది ఎన్నికల్లో తాము హామీ ఇచ్చామని కూడా సోనోవాల్ పేర్కొన్నారు. అస్సాం బంగ్లాదేశ్ తో 42 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది.