చంద్రబాబుకు పోస్టులో చీరలు, గాజులు
ఆదిలాబాద్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.
టీఆర్ఎస్ నాయకులు పోస్టు ద్వారా చీర, గాజులను చంద్రబాబుకు పంపి, బాబుకు, టీడీపీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సాజిదొద్ధిన్, బండారి సతీష్, మేకల ఆనంద్, ఆంజనేయులు పాల్గొన్నారు.