sarika suicide case
-
Siricilla Rajaiah: సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట
సాక్షి, వరంగల్: వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట లభించింది. రాజయ్య కోడలు సారిక ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు రాజయ్యను నిర్దోషిగా ప్రకటించింది. సారిక సూసైడ్ కేసులో.. రాజయ్య కొడుకు అనిల్, రాజయ్య, రాజయ్య భార్య మాధవిపైనా కేసు నమోదు అయ్యింది. ప్రధాన నిందితుడిగా సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్, రెండో నిందితుడిగా మాజీ ఎంపీ రాజయ్య, మూడవ నిందితురాలిగా రాజయ్య భార్య మాధవిపై అప్పట్లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేల్చింది వరంగల్ కోర్టు. దీంతో రాజయ్య కుటుంబానికి ఊరట లభించింది. ఇదిలా ఉండగా.. ఎంపీ రాజయ్య కొడుకు అనిల్‌తో సారిక 2002, ఏప్రిల్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. పిల్లలు పుట్టాక భర్త అనిల్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని సారిక ఆరోపణలు దిగింది. మానసికంగా వేధించాడని, అయితే అత్త మామలు సర్ది చెప్పడంతో అతనితో కలిసి ఉంటున్నానని ఆమె వివరించారు. తాను గర్భిణిగా ఉన్నప్పుడు ఆత్మహత్యకు యత్నించానని, అయినప్పటికీ వారిలో మార్పు రాలేదని ఆమె సంచలన ఆరోపణలు సైతం చేశారు. పిల్లల పోషణ కోసం సైతం డబ్బులివ్వడం లేదంటూ ఆమె అప్పట్లో పోరాటానికి దిగారు. సారికపై వేధింపుల కేసు పెండింగ్‌లో ఉండగానే.. 2015, నవంబర్4న ఆనూహ్యంగా సారికి, ముగ్గురు కొడుకులు అభినవ్, కవలలు అయోన్, శ్రీయోన్ మంటల్లో కాలి మృతి చెందారు. ఈ దుర్ఘటనపై సారిక కుటుంబ సభ్యుల అనుమానం మేరకు.. కేసు నమోదు చేసుకుని రాజయ్య కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వరకట్న వేధింపులు, అనిల్ రెండో భార్య సన వల్లే గొడవలు జరిగాయని ఆరోపించింది సారిక కుటుంబం. అయితే పోలీసులు మాత్రం సారిక బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. ఇన్నేళ్ల విచారణ తర్వాత.. కోర్టు రాజయ్య కుటుంబాన్ని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై పైకోర్టును సారిక కుటుంబం ఆశ్రయిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. -
రాజయ్య బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హన్మకొండ: రిమాండ్‌లో ఉన్న మాజీ ఎంపీ రాజయ్యకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. కోడలు సారిక ముగ్గురు మనవళ్ల ఆత్మహత్య కేసులో మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ వరంగల్ సెంట్రల్ జైలులో నవంబర్ 4 నుంచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ ఇవ్వాలంటూ రాజయ్య పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన జిల్లా కోర్టు.. బెయిల్ తిరస్కరించింది. ఇప్పటి వరకు రాజయ్య, అయన భార్య మాధవి మూడు సార్లు , అనిల్ రెండు సార్లు బెయిల్ కోసం అభ్యర్థించగా కోర్టు తిరస్కరించింది. -
'సారిక' కేసులో గుట్టుగా దర్యాప్తు
-
'సారిక' కేసులో గుట్టుగా దర్యాప్తు
హన్మకొండ: సంచలనం సృష్టించిన సిరిసిల్ల సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలు సనను వరంగల్ పోలీసులు రెండు రోజులుగా విచారిస్తున్నారు. శనివారం రాత్రి ఖమ్మం జిల్లాలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రెండు రోజులుగా కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) క్యాంపులో సన నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సారిక, ముగ్గురు పిల్లల ఆత్మహత్య కేసులో మాజీ ఎంపీ రాజయ్య, మాధవితో పాటు సారిక భర్త అనిల్, అతని రెండో భార్య సనను నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై వరకట్న వేధింపులు(498-ఎ), ఆత్మహత్యకు ప్రోత్సహించడం(306) సెక్షన్ కింద కేసు నమోదైంది. సంఘటన జరిగిన రోజే అనిల్, రాజయ్య, మాధవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు జడ్జి ఎదుట హాజరు పరిచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. సంఘటన జరిగిన రోజు నుంచి సిరిసిల్ల అనిల్ రెండో భార్య సన పరారీలో ఉండగా శనివారం వరంగల్ పోలీసులు ఖమ్మం జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజులుగా రహస్య విచారణ సనను అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసు అధికారికంగా ధ్రువీకరించలేదు. సారిక గతంలో చేసిన ఫిర్యాదులోని అంశాల మేరకు... సారిక, అనిల్, సనల మధ్య నెలకొన్న వివాదాలకు సంబంధించిన అంశాలను పోలీసులు సన నుంచి సేకరిస్తున్నట్లు తెలిసింది. అనిల్‌తో జీవనం తన వల్ల కాదని, తనకు న్యాయం చేయాలంటూ కొన్ని నెలల క్రితమే రాజయ్య వద్దకు సన పంచాయతీ తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య రూ.10 లక్షలు చెల్లించాలని ఒప్పందం జరిగినట్లు విచారణలో సన తెలిపినట్లు సమాచారం. ఇప్పటికీ అనుమానాలే.. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మరణాలపై అనుమానాలు వీడటం లేదు. సంఘటన జరిగిన రోజు రాత్రి వాస్తవంగా ఏం జరిగిందనే అంశం మిస్టరీగానే ఉంది. దుర్ఘటనకు ఆస్తి వివాదాలు ఏమైనా కారణమయ్యాయా అనేది తేలాల్సి ఉంది. వంటగ్యాస్ లీకై మంటలు చెలరేగిన తీరుపై స్పష్టత రాలేదు. అదేవిధంగా సంఘటనకు ముందు రోజు రాత్రి ఆహారంలో మత్తు పదార్థాలు ఏమైనా కలిపారా అనే అనుమాలు సైతం వ్యక్తమయ్యాయి. దర్యాప్తులో కీలకమైన ఫోరెన్సిక్ నివేదికలో ఏం తేలనుందనే అంశం చర్చనీయూంశంగా మారింది. సారిక, ముగ్గురు పిల్లల మరణం కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న సనను రెండు రోజులుగా రహస్యంగా విచారిస్తున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు అనిల్, రాజయ్య, మాధవిల విచారణపై దృష్టి సారించాల్సి ఉంది. వీరిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ఇప్పటి వరకు కోర్టులో పిటిషన్ వేయలేదు.