saroornagar indoor stadium
-
మోదీ ప్రభుత్వంలో ప్రజలపై ఆర్ధిక భారం పెరిగింది
-
సీపీఎం బహిరంగ సభ ప్రారంభం
హైదరాబాద్: వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం కోసం అభ్యుదయ సామాజిక శక్తులన్నీ ఏకం కావాలనే ఆశయంతో సీపీఎం నిర్వహిస్తోన్న బహిరంగ సభ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, జాతీయ నేతలు ప్రకాష్ కారత్, బృందా కారత్, బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, పి.మధు, తెలకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలక్‌పేట టీవీ టవర్ నుంచి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వరకు సీపీఎం కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు. ప్రజలపై ఆర్ధిక భారం పెరిగిందని, వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు. లాల్ సలామ్, జైభీమ్ కలిస్తేనే కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతుందన్నారు. మూడో కూటమి విధానాలు చూసి కీలక నిర్ణయం తీసుకుంటామని వివరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓటమే తమ లక్ష్యమన్నారు. దేశంలో మతోన్మాత రాజకీయాల నుంచి విముక్తి కల్పిస్తామన్నారు.నిజాం, రజాకార్లను ఎదుర్కొన్న మగ్దూం మొహినుద్దీన్ స్పూర్తితో భవిష్యత్ కోసం ముందడుగు వేయాలని సూచించారు. -
కోదండరాంకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం స్ధాపించిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆవిర్భావ సభకు అడ్డంగులు తొలిగాయి. ఈ నెల 29న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన టీజేఎస్ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అదే విధంగా సభకు 3 రోజుల్లో అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీజేఎస్ పార్టీ ఆవిర్భావ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో గతవారం విచారణ చేపట్టిన న్యాయస్ధానం వివరణ ఇవ్వాలని ప్రభుత్వం/పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో సోమవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు టీజేఎస్ సభకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుపై తెలంగాణ జన సమితి పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. -
రేపటినుంచి సౌత్‌జోన్ కబడ్డీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ (సౌత్‌జోన్)కు నగరం మరో సారి వేదికైంది. రేపటినుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఈ టోర్నీ జరగనుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో భారత కబడ్డీ సమాఖ్య ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ టోర్నమెంట్ వివరాలను వెల్లడించారు. సూపర్ నేషనల్స్ కోసం... దేశవ్యాప్తంగా 33 జట్లను నాలుగు పూల్‌లుగా విభజించారు. ఒక్కో పూల్నుంచి నాలుగు జట్లను ఎంపిక చేసి జనవరి 21నుంచి పాట్నాలో సూపర్ నేషనల్స్‌ను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సౌత్ పూల్ విభాగం మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగనున్నాయి. హైదరాబాద్, ఆంధ్ర, అండమాన్ నికోబార్, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. వచ్చే ఆసియా క్రీడల కోసం గాంధీనగర్‌లో జరుగుతున్న భారత జట్టు క్యాంప్‌లో ఉన్న అనేక మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగం కానున్నారు. ‘భారత కబడ్డీ భవిష్యత్తు, ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ టోర్నీని అంతర్జాతీయ స్థాయిలో సింథటిక్ మ్యాట్‌పై నిర్వహిస్తున్నాం’ అని జగదీశ్వర్ యాదవ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఏపీ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు రంగారావు, సంయుక్త కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొన్నారు. మరో వైపు వచ్చే ఏడాది సొంతగడ్డపై జరిగే ఆసియా క్రీడల్లో కబడ్డీలో రాణించాలనే సంకల్పంతో ఉన్న కొరియా జట్టు శిక్షణ, ప్రాక్టీస్ కోసం హైదరాబాద్ రావడం విశేషం.