
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం స్ధాపించిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆవిర్భావ సభకు అడ్డంగులు తొలిగాయి. ఈ నెల 29న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన టీజేఎస్ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అదే విధంగా సభకు 3 రోజుల్లో అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
టీజేఎస్ పార్టీ ఆవిర్భావ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో గతవారం విచారణ చేపట్టిన న్యాయస్ధానం వివరణ ఇవ్వాలని ప్రభుత్వం/పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో సోమవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు టీజేఎస్ సభకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుపై తెలంగాణ జన సమితి పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment