సర్పంచ్ కు ప్రయాణికుల దేహశుద్ధి
నిజామాబాద్: తనకు దారి ఇవ్వలేదన్న కారణంతో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన సర్పంచ్ కు బస్సులోని ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... మనోహరాబాద్ సర్పంచ్ తిరుపతి రెడ్డికి ఆర్మూర్ లో ఆర్టీసీ డ్రైవర్ ఆయనకు దారి ఇవ్వలేదు. అయితే ఆవేశానికి లోనైన తిరుపతి రెడ్డి సైడ్ ఇవ్వలేదంటూ బస్సును నిలిపివేయించాడు. అంతటితో ఆగకుండా బస్సు డ్రైవర్ పై చేయిచేసుకున్నాడు. ప్రయాణికులు వెంటనే స్పందించి సర్పంచ్ కు దేహశుద్ధి చేశారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.