breaking news
sarpanch union
-
విద్యుత్ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలి
మంత్రి జూపల్లికి సర్పంచ్ల ఫోరం వినతి సాక్షి, హైదరాబాద్: పాత విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లికి తెలంగాణ సర్పంచ్ల ఫోరం జాతీయ అధ్యక్షుడు యాకుబ్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సోమిరెడ్డి విన్నవించారు. 14వ ఆర్థి క సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే ఇవ్వాలని, భూముల రిజిస్ట్రేషన్‌కు సంబం ధించిన ట్రాన్స్ఫర్ డ్యూటీ మొత్తాన్ని పంచా యతీలకు విడుదల చేయాలని కోరారు. ఆది వారం సచివాలయంలో మంత్రితో భేటీ అయిన ఫోరం నేతలు పంచాయతీల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి అనంతరం మాట్లాడుతూ.. పంచాయ తీలను స్వచ్ఛ్ గ్రామాలుగా మార్చేందుకు ప్రత్యేక చొరవ చూపాలని, 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం కోసం సర్పంచ్‌లు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరా రు. హరితహారాన్ని గ్రామాల్లో పెంపొందిం చాలన్నారు. స్థానిక సంస్థల సమస్యల పరి ష్కారం కోసం ఈ నెల 27న మహాధర్నాకు పిలుపునిచ్చిన రాష్ట్ర సర్పంచ్ల ఐక్య వేదిక, జెడ్పీటీసీల ఫోరం ప్రతినిధులు భేటీకి హాజరు కాలేదు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళ నకు దిగుతామని తెలంగాణ సర్పంచ్ల సంఘం, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబ ర్ ప్రతినిధులు ఇటీవల ప్రకటించారు. -
సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడి అనుమానస్పద మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు కొసనా మధుసూదన్ రావు(40) మృతి అనుమానాస్పదంగా మారింది. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉన్న మధుసూదన్ చేబ్రోలులో ఓ కార్యక్రమానికి హజరైందుకు గురువారం తెల్లవారుజామున గుంటూరు చేరుకున్నారు. అక్కడ నుంచి చేబ్రోలు బయలుదేరిన మధుసూదన్ కాకుమాను మండలం బుడంపాడు వద్ద అనుమానస్పదంగా మృతి చెందాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మృతదేహాన్ని సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్ గా గుర్తించారు. ఆయన ప్రస్తుతం కాకుమాను గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. తొలిత రోడ్డు ప్రమాదంగా భావించారు. కానీ, సంఘటన జరిగిన తీరుపై బంధువులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.