సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడి అనుమానస్పద మృతి | road accident in guntur district sarpanch union vice president dies | Sakshi
Sakshi News home page

సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడి అనుమానస్పద మృతి

Published Thu, Nov 12 2015 10:28 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

road accident in guntur district sarpanch union vice president dies

గుంటూరు: గుంటూరు జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు కొసనా మధుసూదన్ రావు(40) మృతి అనుమానాస్పదంగా మారింది.

గత రెండు రోజులుగా హైదరాబాద్లో ఉన్న మధుసూదన్ చేబ్రోలులో ఓ కార్యక్రమానికి హజరైందుకు గురువారం తెల్లవారుజామున గుంటూరు చేరుకున్నారు. అక్కడ నుంచి చేబ్రోలు బయలుదేరిన మధుసూదన్ కాకుమాను మండలం బుడంపాడు వద్ద  అనుమానస్పదంగా మృతి చెందాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మృతదేహాన్ని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్ గా గుర్తించారు. ఆయన ప్రస్తుతం కాకుమాను గ్రామ సర్పంచ్గా ఉన్నారు. తొలిత రోడ్డు ప్రమాదంగా భావించారు. కానీ, సంఘటన జరిగిన తీరుపై బంధువులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement