sarrow
-
తండ్రి లేడన్న బాధను దిగమింగి..
చిగురుమామిడి(హుస్నాబాద్): కన్నతండ్రి గుండెపోటుతో మృతిచెందగా.. ఆయన లేడన్న బాధను దిగమింగుకుని పదో తరగతి పరీక్ష రాశాడో విద్యార్థి. ఈ హృదయవిదారక సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలకేంద్రంలో కంటతడి పెట్టించింది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పెనుకుల బాలయ్య వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. పదినెలల క్రితం గుండెపోటుకు గురికాగా.. సర్జరీ జరిగింది. రూ.పది లక్షలు ఖర్చు చేసి ప్రాణాన్ని నిలుపుకున్నారు. మూడురోజుల క్రితం బాలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని కుటుంబసభ్యులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లినా.. వారు చికిత్సకు ముందుకు రాలేదు. పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజీఎంకు తరలిస్తుండగా.. బుధవారం అర్ధరాత్రి బాలయ్య(46) చనిపోయాడు. అప్పటివరకు తండ్రివెంటే ఉన్న ఆయన కుమారుడు సాయితేజకు తెల్లవారితే పదో తరగతి పరీక్షలు. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా.. పుట్టెడు దుంఖఃతో పరీక్ష కేంద్రానికి వెళ్లిన సాయితేజ పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని చితికి నిప్పుపెట్టి బోరున విలపించాడు. బాలయ్యకు భార్య తారవ్వ, కూతురు ఉన్నారు. -
చంద్రబాబు తీవ్ర విచారం
విజయవాడ: బిహార్లోని కైముర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు యాత్రికులు మృతిచెందిన విషాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతదేహాలు స్వగ్రామాలకు తరించే ఏర్పాట్లు చేయాలని అన్నారు. -
ఇద్దరు చిన్నారుల మృతిపై చంద్రబాబు విచారం
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా కొసిగి రైల్వే స్టేషన్లో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి స్థానిక అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పుల్లెల శ్రీరామచంద్రుడు మృతికి సంతాపం కవి, పండితుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పుల్లెల శ్రీరామచంద్రుడు మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వాల్మీకి రామాయణం, సహా పలు సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువదించి తెలుగువారికి ఆయన చిరస్మరణీయుడు అయ్యారని సీఎం శ్లాఘించారు.