sarvai
-
చుక్కలు చూపిస్తున్న ‘సుద్దవాగు’
ములుగు : నియోజకవర్గంలోని సర్వాయి గ్రామానికి వెళ్లేందుకు సుద్దవాగు దాటాలి. అయితే ఇక్కడి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న ప్రభుత్వం సుద్దవాగుపై 7 మీటర్ల వెడల్పుతో 50 మీటర్ల పొడువుతో బ్రిడ్జి నిర్మాణం కోసం 2015–16లో నాబార్డు 21 కింద రూ. 2.33 కోట్ల నిధులు మంజూరు చేసింది. అలాగే టెండర్లను కూడా ఆహ్వానించింది. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభం కావడంలేదు. దీంతో వర్షాకాలంలో సుద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సర్వాయి గ్రామానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. వర్షం పడితే బయటకు వెళ్లం వర్షాలు బాగా పడితే సుద్దవాగు పొంగి బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది. వాగు ఉధృతి తగ్గేవరకు ఇంటి వద్దనే ఉంటాం. వాగు లోతుతో ఉండడంతో గ్రామం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేయం. – పాయం ఊర్మిళ, సర్వాయి -

జైత్రయాత్రను విజయవంతం చేయాలి
నకిరేకల్ : ఆగస్టు 3న నకిరేకల్‌లో జరిగే సర్ధార్ సర్వాయి పాపన్న జైత్రయాత్ర సభను విజయవంతం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజుగౌడ్ పిలుపునిచ్చారు. నకిరేకల్‌లోని శకుంతల ఫంక్షన్హాల్లో జరిగిన జైత్రయాత్ర సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాపన్న జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలన్నారు. ట్యాంక్‌బండ్‌పై, జిల్లా కేంద్రాల్లో పాపన్న విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆగస్టు 2న నల్లగొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి, నల్లగొండలో జైత్రయాత్రలు కొనసాగుతాయన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘ నాయకులు కొప్పు అంజయ్య, పి.అచ్చాలు, బాదిని చెన్నయ్య, రాచకొండ వెంకన్నగౌడ్, రాచకొండ యాదగిరి, రామచంద్రు, నర్సింహ, దోరపల్లి లక్ష్మయ్య, బుచ్చిరాములు, సుధాకర్, సత్తయ్య, ముత్తిరాములు తదితరులు ఉన్నారు.