చుక్కలు చూపిస్తున్న ‘సుద్దవాగు’
Published Sat, Jul 30 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
ములుగు : నియోజకవర్గంలోని సర్వాయి గ్రామానికి వెళ్లేందుకు సుద్దవాగు దాటాలి. అయితే ఇక్కడి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న ప్రభుత్వం సుద్దవాగుపై 7 మీటర్ల వెడల్పుతో 50 మీటర్ల పొడువుతో బ్రిడ్జి నిర్మాణం కోసం 2015–16లో నాబార్డు 21 కింద రూ. 2.33 కోట్ల నిధులు మంజూరు చేసింది.
అలాగే టెండర్లను కూడా ఆహ్వానించింది. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభం కావడంలేదు. దీంతో వర్షాకాలంలో సుద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సర్వాయి గ్రామానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి.
వర్షం పడితే బయటకు వెళ్లం
వర్షాలు బాగా పడితే సుద్దవాగు పొంగి బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది. వాగు ఉధృతి తగ్గేవరకు ఇంటి వద్దనే ఉంటాం. వాగు లోతుతో ఉండడంతో గ్రామం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేయం.
– పాయం ఊర్మిళ, సర్వాయి
Advertisement
Advertisement