sashikumar Mukund
-
ప్రియురాలి ఇంట్లో ప్రియుడి ఆత్మహత్య
సాక్షి, కురబలకోట (చిత్తూరు జిల్లా): ప్రేమ ఓ యువకుడి ప్రాణం తీసింది. ప్రియురాలు ఇంటిలో ప్రియుడు ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ముదివేడు ఎస్ఐ నెట్టికంఠయ్య కథనం మేరకు.. అంగళ్లు గ్రామం చింతయ్యగారి కోటకు చెందిన శశికుమార్ (21), అదే గ్రామంలోని కమతంపల్లెకు చెందిన ఓ బాలిక (17) ఏడాదిగా ప్రేమలో పడ్డారు. అబ్బాయి ఇంటర్ చదివి ఖాళీగా ఉంటున్నాడు. అమ్మాయి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. వీరి ప్రేమ విషయం తెలిసి అమ్మాయి తల్లిదండ్రులు దండించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అమ్మాయి మైనర్ కావడంతో వారు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అప్పటినుంచి అమ్మాయి అతనికి దూరంగా ఉండసాగింది. ఆమె ఎదురుపడినా మాట్లాడకపోవడంతో మనోవ్యధకు గురైన అబ్బాయి ఆదివారం మధ్యాహ్నం నేరుగా అమ్మాయి ఇంటికే వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. తనతో మాట్లాడకపోతే చనిపోతానని హెచ్చరించాడు. ఆమె ఎప్పటిలా మాట్లాడనని చెప్పి ఇంట్లోని మరో గదిలోకి వెళ్లింది. అతను అక్కడే కొక్కీకి ప్రియురాలి పైట చెంగు (స్కార్ప్)తో ఉరి వేసుకున్నాడు. అమ్మాయి వెళ్లి చూసేటప్పటికి అతను మృతి చెంది ఉండడంతో వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. కూలి పనులకు వెళ్లిన వారు వెంటనే ఇంటికి వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా తమ బిడ్డను అమ్మాయి తల్లిదండ్రులే చంపేశారని మృతుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బాయే ఇంట్లో ఉరివేసుకున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నెట్టి కంఠయ్య తెలిపారు. -
ప్రియురాలి ఇంట్లో ప్రియుడు మృతి
-
సెమీస్‌లో ప్రజ్నేశ్
చెన్నై: సొంతగడ్డపై నిలకడగా ఆడుతున్న భారత టెన్నిస్ ఆటగాళ్లు ప్రజ్నేశ్ గుణేశ్వరన్, శశికుమార్ ముకుంద్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ ప్రజ్నేశ్ 6–4, 6–3తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై, శశికుమార్ 6–2, 3–6, 7–6 (7/3)తో బ్రైడెన్ క్లీన్ (బ్రిటన్)పై గెలిచారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో కొరెన్‌టిన్ ముటెట్ (ఫ్రాన్స్)తో శశికుమార్; ఆండ్రూ హారిస్ (ఆస్ట్రేలియా)తో ప్రజ్నేశ్ తలపడతారు. -
భారత్‌కు రెండు స్వర్ణాలు
అపియా (సమోవా) : అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత కుర్రాళ్లు జోరు కొనసాగిస్తున్నారు. గురువారం రెండు స్వర్ణాలతో పాటు ఏడు పతకాలను దక్కించుకున్నారు. ఆర్చర్ ప్రాచీ సింగ్ బాలికల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఆర్చర్‌పై నెగ్గి స్వర్ణం ఖాయం చేసుకుంది. మరోవైపు టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో శశికుమార్ ముకుంద్, ధ్రుతి వేణుగోపాల్ 7-6 (7/4), 6-3 తేడాతో మెకెలాండ్, లమ్స్‌డెన్ (స్కాట్లాండ్)ను ఓడించి స్వర్ణం దక్కించుకున్నారు. ఇక బాక్సర్ గౌరవ్ సోలంకి (52 కేజీలు) రజతంతో సంతృప్తి పడ్డాడు. అలాగే ఆర్చర్ నిశాంత్ (బాలుర రికర్వ్ వ్యక్తిగత), స్క్వాష్ మిక్స్డ్ టీమ్‌లో సెం థిల్ కుమార్, హర్షిత్ జవందాలకు కూడా రజతాలు లభించాయి. బాక్సర్లు లీచోం బన్ భీమ్‌చంద్ సింగ్ (49 కేజీలు), ప్రయాగ్ (64 కేజీలు) కాంస్యాలు దక్కించుకున్నారు. ఓవరాల్‌గా ఇప్పటిదాకా భారత్ 17 పతకాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.