ఆక్సా బ్లేడుతో తల్లి గొంతు కోశాడు
జామి: విజయనగరం జిల్లా జామి గ్రామంలో గురువారం ఉదయం దారుణం జరిగింది. మతిస్థిమితం లేని కుమారుడు కన్నతల్లిని హతమార్చాడు. పారాబి మాణిక్యం(50) అనే మహిళను ఆమె కుమారుడు సత్తిబాబు గురువారం వేకువజామున నిద్రపోతున్న తల్లిపై దాడి చేసి ఆక్సా బ్లేడుతో గొంతుకోసి చంపేశాడు. సత్తిబాబు కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు.
గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.