పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని పాతగయక్షేత్రం వద్ద కరెంటు తీగలు తగిలి సత్తిబాబు (33) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. చెత్తను అనధికారికంగా డంపింగ్ చేస్తుండగా పైన ఉన్న కరెంటు తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. సత్తిబాబు స్వగ్రామం మల్లాం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.