Sattenapalle Assembly Constituency
-
సత్తెనపల్లి రీ పోలింగ్.. మంత్రి అంబటి పిటిషన్‌పై నేడు విచారణ
సాక్షి, అమరావతి: ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి రిగ్గింగ్, దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలని మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు.కాగా, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం నార్నెపాడులో 236, 237 పోలింగ్ కేంద్రాలు, దమ్మాలపాడులోని 253, 254 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నప్పటికీ వారిపై దాడులకు తెగబడ్డారు.ఇక, ఈ ఘటనలపై వెబ్ కెమెరాలను పరిశీలించి రీ పోలింగ్ జరపాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోక పోవడంతో రీ పోలింగ్ జరపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈసీ, సీఈఓ సహా ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. -
‘సీఎం జగన్ పాలనలో పచ్చ బ్యాచ్ ఆటలు సాగవని బాబుకు తెలుసు’
సాక్షి, సత్తెనపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. సీఎం జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని పచ్చ బ్యాచ్‌కు తెలుసు. అందుకే ఇలా దాడికి ప్లాన్ చేశారని మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీఎం జగన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఏరోజు ఏరోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదు. సంక్షేమ పథకాలే సీఎం జగన్‌ను గెలిపిస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదు. అందుకే కూటమిగా వస్తూ కుట్రలు చేస్తున్నాయి. మీరు ముగ్గురు కలిసినా 30 మంది కలిసినా సీఎం జగన్‌ను ఓడించలేరు. సీఎం జగన్‌పై దాడిని ప్రధాని మోదీ కూడా ఖండించారు. కానీ, చంద్రబాబు, పవన్‌లకు మాత్రం వెటకారంగా ఉంది. నాదెండ్ల మనోహార్ కోసం ప్రచారం చేసేందుకు పవన్ వచ్చారు. నాదెండ్లకు ఓటు వేస్తే తెనాలి నాశనమే. ముఖ్యమంత్రి జగన్ గాయంపై పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. పవన్ సినిమా యాక్టర్ కాబట్టి చూసేందుకు వస్తున్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి కనుక ఆయనను చూసేందుకు, కలిసేందుకు వస్తున్నారు. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. పవన్ ఎన్నోసార్లు అనుచితంగా మాట్లాడారు. మళ్లీ వైఎస్సార్సీపీ నేతలు బూతులు తిడతారంటూ ఆరోపిస్తారు. గతంలో పవన్ తాను మాట్లాడిన బూతులు మరచిపోయారా?. దీనికి పవన్ ఏం సమాధానం చెబుతారు?. అధికారం లేకుండా చంద్రబాబు బతకలేడు. టీడీపీ వాళ్లు అశాంతిని సృష్టిస్తారు. వైస్సార్సీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు.