సాక్షి, అమరావతి: ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి రిగ్గింగ్, దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలని మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు.
కాగా, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం నార్నెపాడులో 236, 237 పోలింగ్ కేంద్రాలు, దమ్మాలపాడులోని 253, 254 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నప్పటికీ వారిపై దాడులకు తెగబడ్డారు.
ఇక, ఈ ఘటనలపై వెబ్ కెమెరాలను పరిశీలించి రీ పోలింగ్ జరపాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోక పోవడంతో రీ పోలింగ్ జరపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈసీ, సీఈఓ సహా ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment