సత్తుపల్లి సబ్ జైలు ఖైదీ పరారీ
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ జైలు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. ఊకే ఏసురాజు అనే ఖైదీ శుక్రవారం సాయంత్రం గోడదూకి తప్పించుకున్నాడు. రాత్రి వరకూ వెతికినా ఖైదీ ఆచూకీ తెలియకపోవడంతో జైలు అధికారులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దమ్మపేటకు చెందిన ఊకె ఏసురాజు పలు చోరీ కేసుల్లో నిందితుడు. రెండు నెలల నుంచి సత్తుపల్లి సబ్ జైలులో ఉన్నాడు.