సత్యసాయి మహా అర్చన యజ్ఞం
పుట్టపర్తి టౌన్ : ఓనం వేడుకలలో భాగంగా కేరళ భక్తులు సోమవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో సత్యసాయి మహా అర్చన యజ్ఞం ఘనంగా జరిగింది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జె.రత్నాకర్రాజు జ్యోతి ప్రజ్వలన చేయగా.. రుత్వికుల వేదమంత్రోచ్ఛారణ నడుమ యజ్ఞక్రతువులు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుల్వంత్ సభా మందిరంలో కేరళ కళాకారిణులు రుద్ర– భద్రలు సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరి నిర్వహించి భక్తులను మైమరిపించారు. కేరళ భక్తులు భక్తిగీతాలు అలపించారు. సాయంత్రం అదే రాష్ట్రంలోని అలపుజ జిల్లాకు చెందిన సత్యసాయి యూత్ సభ్యులు ‘ధర్మో రక్షతి రక్షితః’ పేరుతో నృత్యరూపకం ప్రదర్శించారు.