సా మిల్లులో అగ్నిప్రమాదం
గుంతకల్లు టౌన్ : స్థానిక హనుమాన్ సర్కిల్లోని శ్రీలక్ష్మీ గణేశ్వర సా మిల్లు(రంపపు మిల్లు)లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో వేప, తుమ్మ తదితర రకాల కలప, పలు యంత్రాలు కాలిబూడిదయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే గమనించిన కొందరు వాటిని ఆర్పివేసేందుకు విశ్వప్రయత్నం చేశారు.
సాధ్యం కాకపోవడంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సకాలంలో వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే రూ.1.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందని బాధితుడు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఫైర్ ఆఫీసర్ యోగేశ్వరరెడ్డి తెలిపారు.