breaking news
say no to drugs
-
మత్తు వదిలితేనే భవిత!
ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న అంశాలలో ‘మాదక ద్రవ్యాల తయారీ–అక్రమ రవాణా– క్రయవిక్రయాలు–వినియోగం’ అతి ముఖ్యమైనవి. వీటిని అరికట్టడానికి వివిధ దేశాలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయినా, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. మనకు మిక్కిలి హాని కలిగించే కొన్ని మత్తు పదా ర్థాలను మాదకద్రవ్యాలు (డ్రగ్స్) అని వ్యవహరిస్తారు. ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, కొకైన్, ఎల్ఎస్డీ వంటి మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించి రహస్యంగా వినియోగదారులకు అందిస్తూ డబ్బు సంపాదించడం కొందరికి లాభసాటి వ్యాపారం అయ్యింది. కానీ వాటికి అలవాటుపడిన వారు మాత్రం ఆరోగ్యం కోల్పోయి బికారులవుతున్నారు. తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లల ముందే మత్తు పదార్థాలను వినియోగించడం వల్ల పిల్లలూ వాటికి ఆకర్షితులవుతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేని సున్నిత మనస్కులు వీటిని ఆశ్రయిస్తున్నారు. కనుచూపు మేరలో మత్తు పదార్థాలు అందుబాటులోకి రావడం, పాశ్చాత్య పోకడలు, టీవీ, సోషల్ మీడియాల ప్రభావం వల్ల యువత వీటిబారిన పడుతున్నారు. పలు జాతీయ సర్వేల ప్రకారం... మత్తు పదార్థాలు సేవించేవారిలో ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. శారీరక సమస్యలకు తీవ్రంగా గురవుతారు. ఒత్తిడికి, మానసిక సమస్యలకు గురవుతారు. భార్యల నుండి విడాకులు కోరుతున్నారు. నేరపూరిత ఆలోచనలతో గడుపుతున్నారు. చాలామంది లైంగిక సామర్థ్యం కుంటుపడుతోంది. స్థూలకాయం లాంటి సమస్యలతోనూ బాధ పడుతున్నారు.– డా.బి. హర్షిణిఎమ్డీ (సైకియాట్రీ), మంగళూర్, కర్ణాటక (నేడు అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినం) -
యువత మాత్రమే డ్రగ్స్ ను కట్టడి చెయ్యగలదు
-
కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్: ప్రభాస్
-
సాక్షి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కు అనూహ్య స్పందన
-
ఉద్యమంలా డ్రగ్స్ ను నిర్మూలిద్దాం
-
డ్రగ్స్ లేని సమాజం మన లక్ష్యం.. సాక్షితో అంజాద్ భాషా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
-
ఒక్కసారి బానిసైతే.. మీ లైఫ్ క్లోజ్..
-
డ్రగ్స్ హబ్ గా హైదరాబాద్.. యువతను పీడిస్తున్న మహమ్మారి
-
'మా' అసోసియేషన్ పిలుపునిచ్చినా..!
కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన 'సే నో టు డ్రగ్స్' కార్యక్రమానికి ఇండస్ట్రీ పెద్దలెవరూ హాజరు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్, జీవితలతో మా అసోసియేషన్ లో యాక్టివ్ గా ఉండే ఒకరిద్దరు తప్ప ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీ ఎవరూ పాల్గొనలేదు. మా అసోసియేషన్ పిలుపు నిచ్చినా సినీ వర్గాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని పట్టించుకోలేదు. పలువురు టీవీ కళాకారులు మాత్రం ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితోపాటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సమాజాన్నీ పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమేయాలని పలుపునిచ్చారు.