'మా' అసోసియేషన్ పిలుపునిచ్చినా..! | No film stars in say no to drugs campaign | Sakshi
Sakshi News home page

'మా' అసోసియేషన్ పిలుపునిచ్చినా..!

Published Sun, Jul 30 2017 10:53 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

'మా' అసోసియేషన్ పిలుపునిచ్చినా..!

'మా' అసోసియేషన్ పిలుపునిచ్చినా..!

కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన 'సే నో టు డ్రగ్స్' కార్యక్రమానికి ఇండస్ట్రీ పెద్దలెవరూ హాజరు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్, జీవితలతో మా అసోసియేషన్ లో యాక్టివ్ గా ఉండే ఒకరిద్దరు తప్ప ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీ ఎవరూ పాల్గొనలేదు. మా అసోసియేషన్ పిలుపు నిచ్చినా సినీ వర్గాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని పట్టించుకోలేదు.

పలువురు టీవీ కళాకారులు మాత్రం ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితోపాటు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సమాజాన్నీ పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమేయాలని పలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement