Scarlett Wilson
-
‘కల్కి’ టీజర్ విడుదల
-
అంతకుమించిన సంతోషం లేదు
‘‘లోకంలో ఎవరికైనా పని దొరకడమన్నదే గ్రేట్. దానికంటే సంతోషమైన విషయం ఏదీ ఉండదు. నాకు పని కల్పించి, నాతో పని చేయించుకుంటూ సినిమాలు చేస్తున్న నిర్మాతలు, దర్శకులకు కృతజ్ఞతలు’’ అని రాజశేఖర్ అన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా, అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ కథానాయికలుగా చేస్తున్న చిత్రం ‘కల్కి’. శివాని–శివాత్మిక సమర్పణలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. నేడు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి’ సినిమా టీజర్ విడుదల చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘గరుడవేగ’ సినిమా తర్వాత ఆరేడు నెలలు కథ కోసం అన్వేషించి, ఈ కథ ఓకే చేశాం. ‘గరుడవేగ’ కి ప్రవీణ్ సత్తారుతో పని చేసేటప్పుడు ఎంత కొత్తగా ఫీల్ అయ్యానో, ప్రశాంత్ వర్మతోనూ అంతే కొత్తగా ఫీల్ అవుతున్నా’’ అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘శేషు’ తర్వాత రాజశేఖర్‌గారితో నేను చేస్తున్న చిత్రమిది. నేను చిన్న సినిమాలు చేసేటప్పుడు లైట్స్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఓ తమిళ హిట్ సినిమా రీమేక్ రైట్స్ కొని, నన్ను నిర్మాతను చేశారు జీవిత–రాజశేఖర్ దంపతులు’’ అన్నారు. ‘‘అ!’ చిత్రానికి ముందే ‘కల్కి’ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ, కుదరలేదు. ఒక ఫ్రాంచైజీ తరహాలో ఈ సినిమాకు సీక్వెల్స్ చేయాలనుంది. అన్నీ కుదిరితే రాజశేఖర్‌గారి తర్వాతి బర్త్ డేకి ‘కల్కి 2’ మొదలవుతుంది. నా అభిమాన నటుడు రాజశేఖర్‌గారికి ఈ పుట్టిన రోజు కానుకగా నేను ‘యాంగ్రీ స్టార్’ అనే బిరుదు ఇస్తున్నా’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘గరుడవేగ’ కి ముందు మళ్లీ సక్సెస్‌లోకి వస్తామా? లేదా? అనుకున్న రోజులు ఉన్నాయి. మన వెనుక ఎన్ని కోట్లు ఉన్నా కెరీర్‌ని కొనలేం. అటువంటి సమయంలో ‘గరుడవేగ’ వచ్చింది. ఇప్పుడు ‘బాహుబలి’ గురించి మాట్లాడుతున్నప్పుడు ‘గరుడవేగ’ గురించి కూడా మాట్లాడుతుండటంతో సంతోషంగా ఉంది’’ అన్నారు జీవిత. శివానీ, శివాత్మిక, సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రపాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
‘కల్కి’కి జోడిగా అదా, స్కార్లెట్
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్, తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు గ్యాప్ తీసుకున్నాడు. అ! సినిమాతో దర్శకుడు పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయనున్నాడు రాజశేఖర్. కల్కి పేరుతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ మూవీలో రాజశేఖర్‌కు జోడిగా ఇద్దరు అందాల భామలు కనిపించనున్నారట. తెలుగు హార్ట్ ఎటాక్, క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ తో పాటు స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకుంటున్న స్కార్లెట్ విల్సన్ లు హీరోయిన్లుగా నటించనున్నారట. ఈ సినిమాతో రాజశేఖర్ తన ఫాంను కంటిన్యూ చేస్తాడేమో చూడాలి. -
నటుడి చెంపలు వాయించిన 'బాహుబలి' నటి
ముంబయి: తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన సహ నటుడి చెంప చెళ్లుమనిపించారు నటి స్కార్లెట్ విల్సన్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన 'బాహుబలి' పార్ట్ 1లో 'మనోహరీ..' అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో స్కార్లెట్ ఆడిపాడారు. ప్రస్తుతం స్కార్లెట్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'హన్సా-ఏక్-సన్యోగ్'. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం షూటింగ్ జరుగుతోంది. అయితే నటి స్కార్లెట్ తో సహ నటుడు ఉమాకాంత్ రాయ్ అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇలాంటి పనులు చేయవద్దని స్కార్లెట్ హెచ్చరించినా పట్టించుకోని ఉమాకాంత్.. అసభ్యకర సంకేతాలు పంపుతూ ఆమెను తాకాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆమె వెంటనే అతడి చెంప పగలకొట్టింది. ఈ ఘటనపై స్పందించిన మూవీ యూనిట్ ఉమాకాంత్ ను అక్కడి నుంచి పంపేందుకు చూడగా అతడు మరింతగా రెచ్చిపోయాడు. యూనిట్ అతడిని గట్టిగానే వారించి సెట్ నుంచి పక్కకు తీసుకెళ్లారు. -
ప్రభాస్‌కు మహా సిగ్గబ్బా..
హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు మహా సిగ్గు అబ్బా అంటుంది బ్రిటిష్ మోడల్ స్కార్లెట్ విల్సన్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బహుబలి చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. ఆ చిత్రంలో ప్రభాస్‌తో పాటు స్కార్లెట్ విల్సన్, నోరా ఫతేహి, స్నేహా ఉపాధ్యాయలతో ఓ ఐటం సాంగ్ చిత్రీకరించారు. ఆ సాంగ్‌ను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించారు. ఆ సమయంలో ప్రభాస్‌పై స్కార్లెట్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రభాస్ చాలా రిజర్వుడుగా ఉంటాడని, అతడితో మాట కలపడానికి తనకు మూడు రోజుల సమయం పట్టిందని చెప్పింది. అయితే అతడు చాలా భోళాగా ఉంటాడని ప్రశంసించింది. ఓ విధంగా చెప్పాలంటే ప్రభాస్ తెరిచి ఉంచిన పుస్తకమని పొగడ్తలతో ముంచెత్తింది. అతడితో కలసి పని చేయడం ఇదే తొలిసారి అని తెలిపింది. ఈ ఐటం సాంగ్ చిత్రీకరించటానికి ఎనిమిది రోజులు పట్టింది. షూటింగ్ చివరి రోజు అయితే దాదాపు ఓ సన్నివేశం కోసం దాదాపు 20 టేకులు వరకు తీసుకున్నానని... అయితే ఎవరు తనపై ఎవరికి ఫిర్యాదు చేయలేదని స్కార్లెట్ విల్సన్ చెప్పుకొచ్చింది.