ప్రభాస్కు మహా సిగ్గబ్బా.. | PRABHAS IS SO SHY! | Sakshi
Sakshi News home page

ప్రభాస్కు మహా సిగ్గబ్బా..

Published Sat, Apr 11 2015 10:22 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

ప్రభాస్కు మహా సిగ్గబ్బా..

ప్రభాస్కు మహా సిగ్గబ్బా..

హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు మహా సిగ్గు అబ్బా అంటుంది బ్రిటిష్ మోడల్ స్కార్లెట్ విల్సన్.  ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బహుబలి చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది.  ఆ చిత్రంలో ప్రభాస్తో పాటు స్కార్లెట్ విల్సన్, నోరా ఫతేహి, స్నేహా ఉపాధ్యాయలతో ఓ ఐటం సాంగ్ చిత్రీకరించారు. ఆ సాంగ్ను  అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించారు. ఆ సమయంలో ప్రభాస్పై స్కార్లెట్  ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ప్రభాస్ చాలా రిజర్వుడుగా ఉంటాడని,  అతడితో  మాట కలపడానికి తనకు మూడు రోజుల సమయం పట్టిందని చెప్పింది. అయితే అతడు చాలా భోళాగా ఉంటాడని ప్రశంసించింది. ఓ విధంగా చెప్పాలంటే ప్రభాస్ తెరిచి ఉంచిన పుస్తకమని పొగడ్తలతో ముంచెత్తింది. అతడితో కలసి పని చేయడం ఇదే తొలిసారి అని తెలిపింది.  ఈ ఐటం సాంగ్ చిత్రీకరించటానికి ఎనిమిది రోజులు పట్టింది. షూటింగ్ చివరి రోజు అయితే దాదాపు ఓ సన్నివేశం కోసం దాదాపు 20 టేకులు వరకు తీసుకున్నానని... అయితే ఎవరు తనపై ఎవరికి ఫిర్యాదు చేయలేదని స్కార్లెట్ విల్సన్ చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement