ఉత్తమ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి
హిందూపురం టౌన్ : విద్యార్థుల్లో ఉన్న ప్రేరణను ఉపాధ్యాయులు వెలికితీసి ఉత్తమ శాస్త్రవేత్తలుగా తయారు చేయాలని ౖఎస్‌సీఈఆర్‌టీ (హైదరాబాద్) అధికారి లక్ష్మిమిఠల్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని చిన్మయా పాఠశాలలో ప్రేరణ అవార్డులపై ఎంఈఓ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డివిజన్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో ఒకరు లేదా ఇద్దరికి ప్రేరణ అవార్డులు వచ్చిన వారికి రూ.5 వేల చొప్పున నగదు అందించామన్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి మంచి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని చెప్పారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డు అధికారి నాగభూషణం, జిల్లా సైన్స్ సెంటర్ అధికారి ఆనంద్‌భాస్కర్, ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్లు సలీమ్, ప్రసాద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.