scholarship scam
-
మైనారిటీ స్కాలర్షిప్ పేరిట రూ.144 కోట్ల కుంభకోణం
న్యూఢిల్లీ: మైనారిటీ స్కాలర్షిప్ కార్యక్రమంలో అవకతవకలపై విచారణ చేపట్టిన సీబీఐ ఈ మొత్తం విద్యా సంస్థల్లో 53 శాతం బోగస్ సంస్థలేనని తేల్చింది. మైనారిటీలకు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో కింద యాక్టివ్‌గా ఉన్న విద్యా సంస్థలలో దాదాపు 53 శాతం నకిలీవేనని గుర్తించారు సీబీఐ అధికారులు. గత ఐదేళ్ళలో 18 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 830 సంస్థల్లో భారీగా అవినీతి జరిగినట్లు విచారణలో వెల్లడైందని ఈ కుంభకోణంలో దాదాపుగా రూ.144.83 కోట్లు కొల్లగొట్టినట్లు వెల్లడించింది సీబీఐ. అనుమానిత నిందితుల్లో ఈ 830 సంస్థలకు చెందిన ప్రభుత్వాధికారులు, అనేక PSU బ్యాంకుల అధికారులు ఉన్నారని తెలిపింది సీబీఐ. ఏటా సుమారు 65 లక్షల మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం నుండి ఆయా పథకాల క్రింద మైనారిటీ స్కాలర్షిప్లను పొందుతున్నారు. ముస్లింలు, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారాసీలకు చెందిన ఆరు మైనారిటీ వర్గాల విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించేవారు. Central Bureau of Investigation (CBI) registers case against unknown officials in connection with alleged minority scholarship scam of Rs 144 crores — ANI (@ANI) August 29, 2023 ఇది కూడా చదవండి: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విద్యార్థినులు రక్తంతో లేఖ.. -
తొలి సంతకం చేసిన నరేంద్ర మోదీ
-
తొలి ఫైల్‌పై సంతకం చేసిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: నూతన ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజే కేంద్ర మంత్రిమండలి భేటీ అయ్యి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. కొత్త ప్రభుత్వంలో తొలి మంత్రిమండలి సమావేశం కావడంతో భేటీపై మొదటి నుంచి ఉత్కంఠ నెలకొంది. దానికి అనుగుణంగానే కొన్ని కీలక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుంది. దేశ రక్షణ నిధి నుంచి అమరులైన సైనికుల పిల్లలకు ఇచ్చే ఉపకారవేతనాలను పెంచుతూ.. నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు రెండువేల నుంచి 2500కు, విద్యార్థినులకు 2250 నుంచి 3వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర పారామిలటరీ బలగాలతో పాటు, రాష్ట్రంలో అమలు అయ్యే పోలీసు కుటుంబాలకు కూడా ఈపథకాన్ని వర్తించే విధంగా రూపకల్పన చేశారు. ఏడాదికి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన వారి నుంచి ఇకపై ఎంపిక చేయనున్నారు. మొదటి సమావేశంలోనే బడ్జెట్ ప్రధాని కార్యాలయంలో మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో హోంమంత్రి అమిత్‌షా సహా 24మంది కేబినెట్ మంత్రులు, 9మంది స్వతంత్ర హోదా కల్గిన మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. నూతన ప్రభుత్వంలో జూన్ 17 నుంచి జూలై 26 వరకు పార్లమెంట్ తొలి సమావేశాలు నిర్వహించాలని కేంద్రమంత్రి మండలి నిర్ణయించింది. జూన్ 19న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక చేపట్టనున్నారు. మొదటి సమావేశంలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భేటీలో నిర్ణయించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : తొలి సంతకం చేసిన నరేంద్ర మోదీ ప్రధాని మోదీతో సహా.. కేంద్ర మంత్రులుగా పలువురు గురువారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వారందరికీ శుక్రవారం శాఖలను కేటాయించారు. మంత్రులు ఆయా శాఖల బాధ్యతలను చేపట్టిన మరుక్షణమే ప్రధాని మోదీ అధ్యక్షత కేంద్ర మంత్రిమండలి సమావేశమయింది. దేశాన్ని ఏవిధంగా అభివృద్ధి పథంలో నడిపించాలి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశానికి ముందు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులనందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. -
తీగలాగితే డొంక కదిలింది!
స్కాలర్‌షిప్‌ల స్కాంలో మరో ఇద్దరు అరెస్టు నేడు ఏసీబీ కోర్టులో హాజరుపర్చే అవకాశం శ్రీకాకుళం పాతబస్డాండ్/శ్రీకాకుళం సిటీ: సంచలన సృష్టించిన బీసీ సంక్షేమశాఖలోని విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కుంభకోణంలో ఆరెస్టుల పర్వం కొనసాగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా.. ఏసీబీ అధికారులు ఈ పాపంతో సంబంధం ఉన్నవారిని పక్కా ఆధారాలతో అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న తొమ్మిది మందిని ఈ నెల 19వ తేదీన అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. బుధవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇంకెంత మందికి పాత్ర ఉందనే భయంతో గిరిజన, బీసీ సంక్షేమశాఖల్లోని పలువురు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని ఆరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచిన విషయం విదితమే. తాజాగా పదవీ విరమణ చేసిన బీసీ సంక్షేమాధికారి పీవై సదానందం, గిరిజన సంక్షేమ శాఖలో ఇన్చార్జి డీడీగా పనిచేసి ఎంపీవీ నాయక్‌లను బుధవారం ఆరెస్టు చేసి శ్రీకాకుళంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వీరిని గురువారం కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో ఇప్పటికే బీసీ, గిరిజన సంక్షేమాధికారుతో పాటు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులతో కలిపి తొమ్మిది మందిని ఆరెస్టు చేశారు. వీరిలో విశ్రాంత బీసీ సంక్షేమాధికారి బి.రవిచంద్ర, బైరి చంద్రశేఖర్ (జూనియర్ అసిస్టెంట్), బుడుమూరు బాలరాజు (జూనియర్ అసిస్టెంట్), దుడ్డు పార్వతి (సీనియర్ అసిస్టెంట్) ఉండగా.. గిరిజన సంక్షేమశాఖ ఉద్యోగులైన బోర ఎర్రన్నాయుడు (ఏటీడబ్ల్యూవో, సీతంపేట), శిమ్మ ఝాన్సీరాణి (హెచ్‌డబ్ల్యూవో, ఎస్టీబాలుర హాస్టల్, సారవకోట), గేదెల వెంకటనాయుడు (పాలకొండ, ఎస్టీ బాలుర హాస్టల్ అధికారి), ఓం సాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ముంజు ఉమామహేశ్వరరావు, మరో కంప్యూటర్ ఆపరేటర్ అంపిలి అజయ్‌కుమార్ ఉన్నారు. తాజాగా ఆరెస్టు అయిన పీవీ సదానందం, ఎంపీవీ నాయక్‌లకు కూడా స్కాలర్‌షిప్‌ల కుంభకోణంతో సంబంధం ఉన్నట్టు నిర్ధారణకు వచ్చిన తరువాత వీరిని ఆరెస్టు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర విలేకరులకు తెలిపారు. డీడీ నాయక్‌పై పలు అభియోగాలు! సీతంపేట గిరిజన సంక్షేమశాఖకు రెగ్యులర్ డీడీ లేని సమయంలో రెండేళ్ల క్రితం డీడీ బాధ్యతలు నాయక్‌కి అప్పజెప్పారు. అయితే ఆయనపై నమ్మకం లేని గిరిజన సంఘాలు అప్పట్లో ఆయన్ని డీడీ వి«ధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నాయక్ డీడీగా పనిచేసిన కాలంలో అప్పటి ఏటీడబ్ల్యూవో ఎర్రన్నాయుడుకి రాజకీయ పలుకుబడి ఉండడంతో డీడీ ఆయన కనుసన్నల్లో పనిచేసేవారని, యర్రనాయుడు అవినీతి చర్యలకు వంతపాడే వారనే అభియోగాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే నాయక్ ఉపకార వేతనాల కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయారు. ఈ స్కాలర్ షిప్పుల స్కాం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సంబంధిత వార్డెన్లను, ఏటీడబ్ల్యూవో యర్రనాయుడుని, డీడీ నాయక్‌ని అరెస్టులు చేయాలని గిరిజనులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ నాయకుల పలుకుబడితో ఇప్పటి వరకు తప్పించుకొన్నారు. ఇక ఆ కాలంలో పనిచేసిన డీబీసీ సదానందంపై కూడా పలు అభియోగాలు ఉన్నాయి. అప్పడు జరిగిన పదోన్నతులల్లోనూ, బదిలీల్లోనూ ఆయన అవినీతికి పాల్పడుతున్నారని వార్టెన్లు ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యోగుల సస్పెన్షన్‌కు సిఫారుసు శ్రీకాకుళం పాతబస్టాండ్: బీసీ స్కాలర్‌షిప్‌ల స్కాంలో ఏసీబీ అధికారులు ఆరెస్టు చేసిన బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసేందుకు డీబీసీ కె.శ్రీదేవి ఆ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ కె. ధనుంజయరెడ్డికి వద్దకు బుధవారం తీసుకెళ్లారు. అయితే ఏసీబీ అధికారుల నుంచి వారిపై నివేదికలు రావాల్సిందని, వచ్చిన వెంటనే సస్పెండ్ కోరుతూ సిఫార్సులు అందజేయాలని కలెక్టర్ సూచించారు. -
ఎవరీ అజయ్‌కుమార్?
స్కాలర్‌షిప్పుల వ్యవహారంలో సూత్రధారి ఆయన కారులోనే దొరికిన రూ. 24 లక్షల చెక్కు బీసీ వెల్ఫేర్ పాస్వర్డ్ ట్యాంపరింగ్‌పై అనుమానాలు గిరిజన హాస్టళ్లలో ఉన్నట్టు చూపిస్తూ కొల్లగొట్టిన వైనం జిల్లాలో విద్యార్థుల ఉపకార వేతనాల్లో అక్రమాలకు సూత్రధారిగా అనుమానిస్తున్న అజయ్‌కుమార్ ఎవరు? ఆయనకు గిరిజన సంక్షేమ శాఖలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన గిరిజన సంక్షేమ శాఖ అధికారి సదరు అజయ్‌కుమార్‌కు రూ.24 లక్షల చెక్కు ఎందుకిచ్చారు? ఆ చెక్కుతో ఉన్న బ్యాంకు ఖాతాలోకి బీసీ సంక్షేమ శాఖ నిధులు ఎలా వెళ్లాయి? ఈ వ్యహారంలో సూత్రధారులెవరు.. ఇదీ ప్రస్తుతం జిల్లా అధికారుల్లో మెదులుతున్న ప్రశ్న. శ్రీకాకుళం : జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో చదువుతున్న విద్యార్థులు ఎస్టీ వసతి గృహల్లో ఉంటున్నట్టు చూపిస్తూ రూ.కోట్లు కొట్టేసిన వ్యవహారం బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. వసతి గృహంలో లేని విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనంగా ఏడాదికి రూ.3,500లు చెల్లిస్తోంది. అయితే ఈ విద్యార్థులను వసతి గృహల్లో ఉన్నట్టు చూపించి ఒక్కొక్కరికి పేరుతో రూ.10,500లు వరకు బీసీ సంక్షేమ శాఖ నుంచి గిరిజన సంక్షేమ శాఖ అధికారుల బ్యాంకు ఖాతాలకు బదలాయించారు. ఈ వ్యవహరంలో అజయ్‌కుమార్ అనే వ్యక్తి కీలక పాత్రపోషించడంతో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అధికారి రూ.24 లక్షలు ఆయన పేరుతో చెక్కు అందజేశాడు. గిరిజన సంక్షేమ శాఖ ఉప సంక్షేమాధికారిగా మెళియాపుట్టిలో పనిచేస్తున్న ఆ అధికారి సీతంపేటలో గత నెల 20న చెక్కును అజయ్ కుమార్‌కు ఇచ్చాడు. సీతంపేట నుంచి బయలుదేరిన అజయ్‌కుమార్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో కారులో ఉన్న చెక్కును పాలకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అన్న అంశంపై నిగ్గు తేల్చాలంటూ కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఎస్పీని ఆదేశించారు. విచారణ మొదలు సీతంపేటలో సోమవారం మకాం వేసిన కలెక్టర్ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు సిద్ధమయ్యారు. 2009-10 నుంచి 2015-16 విద్యా సంవత్సరాలకు గాను విద్యార్థుల పేరుతో బీసీ సంక్షేమ శాఖ నుంచి గిరిజన సంక్షేమ శాఖకు బదలాయించిన నిధులు, అందులో జరిగిన అక్రమాలు, 2013-14, 2014-15లో పాస్వర్టు ట్యాంపరింగ్ వ్యవహారాలపై శాఖల వారీగా విచారణ మొదలైయింది. గత ఏడాది డిసెంబర్లో గిరిజన సంక్షేమ శాఖ శ్రీకాకుళం వసతి గృహం వార్డెన్ ఝాన్సీరాణి అకౌంటుకు రూ.32.78 లక్షలు జమా అయితే, ఈనెల 12 వరకు సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయకుండా నిల్వ ఉంచడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించిన కలెక్టర్.. పాలకొండ డీఎస్పీ ఆదినారాయణను విచారణాధికారిగా నియమించారు.