School Toilet
-
ప్రభుత్వ పాఠశాలల దత్తతకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలి
గచ్చిబౌలి (హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు కార్పొరేట్ సంస్థలు, స్కూళ్లు, పారిశ్రామికవేత్తలు, నాయకులు ముందుకు రావాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గచ్చిబౌలి డివిజన్లోని కేశవ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు చేయూతతో పునర్నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేద పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని సీఎం కేసీఆర్‌లో తపన, ఆరాటం ఉంటుందన్నారు. అలాగే రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌లో, ఆయన తనయుడు హిమాన్షులోను సామాజిక బాధ్యత ఉందన్నారు. తాత నుంచి వచ్చిన సామాజిక దృక్పథం వల్లే హిమాన్షు పేద పిల్లలు చదివే పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. యువత పుట్టినరోజును ఎలా ఎంజాయ్ చేయాలా అని చూస్తారని, హిమాన్షు మాత్రం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. హిమాన్షు సూచనల మేరకు కేశవ్‌నగర్ పాఠశాలకు అవసరమైన టీచర్లను నియమిస్తామన్నారు. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ, హిమాన్షు సామాజిక బాధ్యత చూస్తుంటే.. మీరేం చేస్తారని మౌనంగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టు ఉందన్నారు. నియోజకవర్గంలోని 62 పాఠశాలలను దత్తతకు తీసుకునే విధంగా కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. కేసీఆర్ నాకు స్ఫూర్తి: హిమాన్షు ‘చదువుకున్న వారు సమాజాన్ని, సమస్యలను అర్థం చేసుకుంటారు... పేదరికాన్ని అరికట్టేందుకు కృషి చేస్తారని మా తాత కేసీఆర్ ఇంగ్లిష్‌లో పెద్ద కొటేషన్ చెప్పారు. అదే నాకు స్ఫూర్తినిచ్చింది’ అని కేసీఆర్ మనవడు హిమాన్షురావు పేర్కొన్నారు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కాస్ (క్రియేటివ్ యాక్షన్ సర్వీస్) ప్రెసిడెంట్‌గా మొక్కలు నాటడం తనకు సంతృప్తి ఇవ్వలేదని, కేశవ్‌నగర్ పాఠశాలలో దుర్భర పరిస్థితులను చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు. ఆడపిల్లల టాయిలెట్ ముందు పందుల గుంపు ఉండటం చూసి ఎంతో బాధపడ్డానని చెప్పారు. ఓక్రిడ్జ్ కాస్ ఆధ్వర్యంలో రెండు పెద్ద ఈవెంట్లు నిర్వహించేందుకు పాఠశాల యాజమాన్యం అనుమతివ్వడంతో రూ.40 లక్షల నిధులు సమకూర్చామని, సీఎస్ఆర్, స్నేహితుల ద్వారా సేకరించిన నిధులతో కేశవ్‌నగర్ పాఠశాలను ఆధునికంగా తీర్చిదిద్దామని హిమాన్షు వివరించారు. పాఠశాలను కట్టించామని, భవిష్యత్తులో ఈ బడి నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల మధ్య బర్త్ డే జరుపుకున్నారు. విద్యార్థులు, మంత్రితో కలిసి భోజనం చేశారు. -
సూర్యాపేట: 216 మంది బాలికలకు రెండే.. ఇదీ వరస
సాక్షి, అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి జెడ్పీహెచ్ఎస్లో 216 మంది బాలికలు, 302 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. బాలికలకు 2 మరుగుదొడ్లు ఉన్నాయి. పారిశుధ్య కార్మికు ల్లేక శుభ్రం చేయక జామ్ అయిపోయాయి. తప్పని పరిస్థితిలో బాలికలు వాటినే ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు ఈ మరుగుదొడ్ల వద్దకు వెళ్లడానికి దారి సరిగా లేదు. ఆవరణలో మొలిచిన గడ్డిలో నీళ్లు చేరి మరుగుదొడ్లకు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంది. బాలురకు మరుగుదొడ్లు అసలే లేవు. వీరు నిత్యం విరామ సమయంలో పాఠశాల ఆవరణలోనే మూత్ర విసర్జన చేస్తున్నారు. చదవండి: Covid: యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63 -
ఎస్సీ విద్యార్ధుల చేత టాయిలెట్లు కడిగించిన ప్రధానోపాధ్యాయురాలు
Chennai Police complaint has been registered against Govt School headmistress తిరుపూర్: తమిళనాడులోని తిరుపూర్‌కు చెందని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్ధులచేత బలవంతంగా టాయిలెట్లు శుభ్రం చేయించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విద్యార్ధులు శుక్రవారం చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (సీఈఓ) ఆర్ రమేష్‌కు పిర్యాదు చేయడంతో, ప్రధానోపాద్యాయురాలు సప్పెండ్ అయ్యింది. తమిళనాడులోని తిరుపూర్‌లోని ఇడువై గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు, 400 మంది విద్యార్ధులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయురాలు గీత (45) మూడేళ్లగా ఈ పాఠశాలలో పనిచేస్తుంది. ఐతే 9, 10వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు ఆమెపై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (సీఈవో) ఆర్ రమేష్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయురాలు తమను కులం పేరుతో దుర్భాషలాడిందని, మరుగుదొడ్లు శుభ్రం చేయమని బలవంతం చేసిందని విద్యార్థులు ఆరోపించినట్లు రమేష్ తెలిపారు. పాఠశాలను సందర్శించి విచారణ చేసిన అనంతరం ఆమెను సస్పెండ్ చేసినట్లు, సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు పిర్యాదు చేసినట్లు రమేష్ మీడియాకు తెలిపారు. కాగా ప్రధానోపాధ్యాయురాలుపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (వేధింపుల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్ ప్రత్యేకత అదే.. -
పాఠశాల మరుగుదొడ్డిలో విద్యార్థిని..
అన్నానగర్: కాట్టుమన్నార్ కోవిల్ సమీపంలో బుధవారం పాఠశాల మరుగుదొడ్డిలో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కడలూరు జిల్లా కాట్టుమన్నార్ ఆలయం సమీపం కుమరాట్చి మెయ్యత్తురైకి చెందిన ఏలుమలై (39) ఉప్పు వ్యాపారి. ఇతని రెండో కుమార్తె దుర్గాదేవి (13). అదే ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇంటి సమీపంలోనే పాఠశాల ఉండడంతో కొన్ని రోజులుగా ప్రతిరోజూ ఉదయం దుర్గాదేవి పాఠశాలను గేట్‌ను తెరచిఉంచేది. ఈ ప్రకారం బుధవారం పాఠశాలకు వెళ్లిన ఆమె గేట్, తరగతి గదులు, మరుగుదొడ్లను తెరచింది. తరువాత మరుగుదొడ్డికి వెళ్లిన దుర్గాదేవి అక్కడ చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పాఠశాల ప్రారంభమైన తరువాత విద్యార్థినులు మరుగుదొడ్డి వైపు వెళ్లగా అక్కడ దుర్గాదేవి శవంగా వేలాడుతుండడం చూసి కేకలు వేశారు. దీనిపై ఉపాధ్యాయులు వెంటనే కుమరాట్చి పోలీసులకు, బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలిక తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ముండియంబాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
స్కూల్ టాయిలెట్లో విద్యార్ధి అనుమానస్పద మృతి