Scientific Advisor
-
కార్యసాధన
చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని ఒక సామెత ఉంది. అంటే చెప్పిన పని కాక ఎక్కువ చేసి వచ్చాడు అని అర్థం. సందర్భానుసారంగా దీనిని మెచ్చుకోటానికి, తప్పు పట్టటానికి కూడా ఉపయోగిస్తారు. దీనికి పూర్తి వ్యతిరేకం ‘‘పుల్లయ్య వేమవరం’’ – రాకపోకల శ్రమ తప్ప ఏ మాత్రం ప్రయోజనం లేదు అని. ఈ రెండు కూడా యజమాని చేత ఆదేశించబడిన దాసుడు పనిని ఏవిధంగా నిర్వర్తించాడు? అనే దాన్ని తెలిపేవే.‘‘రేపు పుల్లయ్యని వేమవరం పంపాలి’’ అని యజమాని ఇంట్లో వాళ్ళతో చెపుతుంటే విని తెల్లవారే సరికి, వెళ్ళి తిరిగి వచ్చాడు. యజమాని పిలిచి వెళ్ళమని చెప్పే లోపే తాను చేసిన నిర్వాకం చెప్పాడు. వెళ్ళి ఏం చేశావు? అని అడిగితే సమాధానం లేదు. మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది.మరొక వ్యక్తి చెప్పిన పని మాత్రం పూర్తి చేసి రావటం జరిగింది. ఫలానా వారు ఉన్నారో లేదో చూసి రమ్మంటే ఉన్నదీ లేనిదీ కనుక్కుని వచ్చేయటం జరిగింది. లేరు అంటే మళ్ళీ ఎప్పుడు ఉంటారు? అని తెలుసుకుంటే మరొక మారు వెళ్ళవలసిన పని ఉండదు. వేరొక వ్యక్తి యజమాని చెప్పిన పని చేసి, దానికి అనుబంధంగా ఉన్న మరిన్ని వివరాలు సేకరించి తిరిగి వచ్చి, యజమాని అడిగిన ప్రశ్నలకి తగిన సమాధానాలు ఇచ్చి మరొకమారు వెళ్ళవలసిన పని లేకుండా చేయటం జరిగింది. అంటే చూసి రమ్మన్న వ్యక్తి లేకపోతే ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు వస్తారు? అప్పుడు మా యజమాని రావచ్చా? మొదలైన వివరాలు తెలుసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. అక్కడి వారితో మాట్లాడి తమ వివరాలన్నీ చెప్పి వచ్చే తెలివితక్కువ వారూ, అనవసర ప్రసంగం చేసి అతితెలివితో వ్యవహారాన్ని చెడగొట్టేవారూ కూడా ఉంటారు. ఇటువంటి వారితో ప్రమాదం. ఈ నలుగురిలో యజమానికి ప్రీతిపాత్రమైన వారు ఎవరు? తెలుస్తూనే ఉంది కదా! ఇటువంటి కార్యసాధకుడికి నిలువెత్తు ఉదాహరణ హనుమ. ముందు తనంతట తాను సముద్ర లంఘనం చేస్తాను అనలేదు. జాంబవంతుడు ప్రేరేపిస్తే కాదని కూడా అనలేదు. నిజానికి వెళ్ళింది సీతని చూడటానికి.కాని, చూసి రాలేదు. మాట్లాడాడు. అప్పుడు, తరువాత ప్రతిపని చేస్తున్నప్పుడు తాను ఇది చేయవచ్చునా? లేదా? అని వితర్కించి, ఆ పని తాను చేయవలసిన పనిలో భాగం అని నిర్ధారించుకుని మరీ చేశాడు. తన ప్రభువు లక్ష్యం తెలుసు. తాను చేసే ప్రతి పని దానికి సహకరించేదిగా ఉన్నదీ, లేనిదీ విచారించి, అందులో భాగమేనని నిర్ధారించుకుని మరీ చేశాడు. ఆ యా సందర్భాలలో దూత అయిన వాడు ఏమి చేయవచ్చు, ఏమి చేయ కూడదు అని వితర్కించుకుని, అది శాస్త్ర సమ్మతమే అని నిశ్చయించుకున్నాక మాత్రమే చేశాడు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాలయాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ‘‘చూడబడినది నా చేత సీత’’ అని చెప్పగానే ‘‘ఆమె ఎట్లా ఉన్నది? ఏ మన్నది?’’ అని అడిగాడు రాముడు. నేను దూరం నుంచి చూశానే కాని, దగ్గరగా చూడలేదు, మాట్లాడ లేదు అని చెపితే ఏం బాగుంటుంది? లంకా నగరం గురించి, రావణుడి సైన్యం గురించి అడిగినప్పుడు అవి తెలుసుకోమని చెప్ప లేదు కనుక నేను పట్టించుకో లేదు అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్టు కాదు కదా అది!అందుకే సమర్థులు చూసి రమ్మంటే కాల్చి వస్తారు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాల యాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకో గలుగుతారు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
స్థిరమైన నిధులతోనే శాస్త్రీయ ప్రగతి
సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సూపర్ పవర్‌గా ఎదగాలన్న లక్ష్యం అందుకోవాలంటే ఏ దేశమైనా తగినన్ని నిధులు, స్థిరంగా అందుబాటులో ఉంచాలి. మౌలిక పరిశోధనలపైనా దృష్టి పెట్టాలి. కోవిడ్-19 టీకా, కో–విన్, యూపీఐ వంటి డిజిటల్ అప్లికేషన్ల అభివృద్ధి... పెరుగుతున్న భారతీయ సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యానికి అద్దం పడుతున్నాయి. ఈ విజయాలు దీర్ఘకాలం పరిశోధనలపై నిధులు ఖర్చుపెట్టిన ఫలితమే. దశాబ్దాలపాటు నాణ్యమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూండటం, వాటి పోషణకు తగిన నిధులు కేటాయించడం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ పరిశోధన సంస్థల సాంకేతిక సామర్థ్యాన్ని దశాబ్దాలుగా ప్రైవేటు రంగమూ ఉపయోగించుకుంది. హింగోలి మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలోని జిల్లా కేంద్రం. 1948 వరకూ హైదరాబాద్ నిజాం రాజ్యం పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని మిలిటరీ కేంద్రంగానూ వాడుకునేవారు. తాజాగా ఈ జిల్లాకు సరికొత్త గుర్తింపు లభిస్తోంది. అంతర్జాతీయ సైన్స్ ప్రాజెక్టు ‘లేజర్ ఇంటెర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ’ క్లుప్తంగా ‘లిగో’కు కేంద్రంగా ఇది అవతరించనుంది. ఈ మహా భౌతిక శాస్త్ర ప్రయోగ శాల కాస్మిక్ గ్రావిటేషనల్ వేవ్స్‌ను గుర్తించేందుకు ఉద్దేశించింది. ఇలాంటివే అమెరికాలోని హాన్ఫర్డ్, లివింగ్‌స్టోన్ ప్రాంతాల్లో ఉన్నాయి. మరోరెండు ఇటలీ, జపాన్లలో ఉన్నాయి. 2030 నాటికి హింగోలి లోనూ ఈ వేధశాల నిర్మాణం పూర్తయితే ప్రపంచవ్యాప్త నెట్వర్క్ సంపూర్ణమవుతుంది. నాలుగు కిలోమీటర్ల పొడవైన భుజాల్లాంటి నిర్మాణాలు... ఎల్ ఆకారంలోని ఇంటర్ఫెరోమీటర్లతో కూడిన ఈ ప్రయోగశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదా¯Œ లో నేషనల్ టెక్నాలజీ డే సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ఆన్లైన్లో రూ.1,200 కోట్ల విలువైన హింగోలి లిగో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మ కమైన ఈ ప్రాజెక్టును భారత్ చేపట్టడం హర్షణీయమైన విషయమై నప్పటికీ ఇలాంటి భారీ ప్రాజెక్టులు, మౌలిక శాస్త్ర పరిశోధనల విషయంలో భారత్ వైఖరి ఎలా ఉందన్న విషయాన్ని సమీక్షించేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తోంది. ఎంత ‘వేగం’గా సాగుతున్నాయంటే... లిగో ప్రాజెక్టు ఆలోచనలకు బీజం పడ్డది 2009 లోనే. భారతీయ శాస్త్ర పరిశోధన సంస్థలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కలిసికట్టుగా గ్రావిటేషనల్ వేవ్స్‌పై పరిశోధనలు చేస్తూండేవారు. ఆ క్రమంలోనే భారత్‌లో గ్రావిటేషనల్ వేవ్స్ వేధశాల ఏర్పాటు చేయాలన్న ఆలోచన పుట్టింది. రెండేళ్ల తరువాత అమెరికాలోని లిగో పరిశోధనశాల తమ పరిశోధనల్లో భాగం కావాలని భారత శాస్త్రవేత్తలకు ఆహ్వానం పలికింది. ఆ ఏడాదే భారత శాస్త్రవేత్తలు విస్తృత చర్చల తరువాత ఇండియన్ లిగో ఏర్పాటుకు సంబంధించి, భారత అణుశక్తి విభాగానికి ఒక ప్రతిపాదన చేశారు. 2012లో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు పచ్చజెండా ఊపుతూ ఓ కమిటీ నిధులు కేటాయించాల్సిందిగా అభ్యర్థించింది. నాలుగేళ్లు వివిధ ప్రభుత్వ విభాగాలకు చక్కర్లు కొట్టిన ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి 2016లో ‘సూత్రప్రాయ అంగీకారం’ తెలిపింది. ఆ తరువాత సుమారు ఏడేళ్ల నిరీక్షణ తరువాత ఈ ప్రాజె క్టుకు తుది అనుమతులు లభించాయి. దేశంలో సైన్స్ ప్రాజెక్టులు ఎంత ‘వేగంగా’ అమలవుతాయో తెలిపేందుకు ఈ ఉదాహరణ చాలు. హింగోలి ప్రాజెక్టు అమల్లో జరిగిన జాప్యం ఇంకో విషయాన్నీ గుర్తు చేస్తుంది. దేశంలో పరిశోధనల కోసం కేటాయిస్తున్న నిధుల్లో పెరుగుదల లేకపోవడాన్ని ఎత్తి చూపుతుంది. స్థూల జాతీయోత్పత్తిలో పరిశోధనలకు (ఆర్ అండ్ డీ) కేటాయించిన నిధులు దశాబ్ద కాలంగా కేవలం 0.7 శాతం మాత్రమేనని నీతి ఆయోగ్ గత ఏడాది విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఈ మోతాదు బ్రెజిల్ (1.6 శాతం), దక్షిణాఫ్రికా (0.83) కంటే తక్కువ కావడం గమనార్హం. పొరుగు దేశం చైనా తన స్థూల జాతీయోత్పత్తిలో ఏకంగా 2.14 శాతం ‘ఆర్ అండ్ డీ’కి కేటాయిస్తోంది. కేటాయింపులు అత్యల్పంగా ఉంటే పరిశోధనా రంగంలో పురోగతి సాధ్యం కాదని నీతి ఆయోగ్ తన నివేదికలో విస్పష్టంగా తెలిపింది. లక్ష్యాలూ అస్పష్టమే... 2013లో భారత్ తన ‘ద సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్’ పాలసీలో 2020 నాటికల్లా శాస్త్ర పరిశోధనల రంగంలో టాప్–5లోకి చేరాలని సంకల్పం చెప్పుకొంది. తొమ్మిదేళ్ల తరువాత ఇదే పాలసీని ఆధునికీకరించారు. 2030 నాటికి నాణ్యమైన పరిశోధన ఫలితాలు సాధించే టాప్–5 దేశాల్లోకి భారత్ చేరాలన్న అస్పష్ట లక్ష్యం గురించి ఈ విధానంలో పేర్కొన్నారు. పదాలతో గారడీ చేయడం కంటే పరిశోధనలకు స్థిరంగా నిధులు కేటాయించడం మేలన్న విషయం మన విధాన నిర్ణేతలకు అర్థం కావడం లేదు. ఇటీవలి కాలంలో కోవిడ్–19 టీకా తయారీలో సాధించిన విజయం, కో–విన్, యూపీఐ వంటి డిజిటల్ అప్లికేషన్ల అభివృద్ధి... పెరుగుతున్న భారతీయ సాంకే తిక పరిజ్ఞాన సామర్థ్యానికి అద్దం పడుతున్నాయి. ఈ విజయాలు దీర్ఘకాలం పరిశోధనలపై నిధులు ఖర్చుపెట్టిన ఫలితమే అన్నది విస్మరించరాదు. దశాబ్దాలపాటు నాణ్యమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూండటం, వాటి పోషణకు తగిన నిధులు కేటాయించడం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ పరిశోధన సంస్థల సాంకేతిక సామర్థ్యాన్ని దశా బ్దాలుగా ప్రైవేటు రంగమూ ఉపయోగించుకుంది. కోవిడ్ టీకా, జెనెరిక్ మందుల అభివృద్ధినే తీసుకుందాం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలాకాలం క్రితమే మందులు, టీకాల తయారీ, క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అవస రమైన అన్ని ఏర్పాట్లూ చేశాయి. ఈ ఏర్పాట్లు 1970 నుంచి ప్రైవేట్ రంగం ఎదుగుదలకు పునాదిగా నిలిచాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ వంటివి భారత్ బయోటెక్, శాంతా బయోటెక్ వంటి సంస్థలకు తొలినాళ్ల నుంచి అండదండగా నిలిచాయి. ప్రైవేట్ రంగంలోని టీకా తయారీ కంపెనీలకు వందల కోట్ల నిధులు అందించారు కూడా. సుమారు 30 – 40 ఏళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు కోవిడ్ మహమ్మారి దాడి చేసిన వెంటనే అక్కరకు వచ్చాయి. ఐటీ రంగానికీ ఇది వర్తిస్తుంది. కంప్యూటర్ సైన్స్, గణిత, భౌతిక శాస్త్రాల్లో పరిశోధ నల ఫలితంగానే ఐటీ రంగం వృద్ధి చెందింది. అల్గారిథమ్స్, ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్, క్రిప్టోగ్రఫీ నెట్వర్కింగ్ రంగాల్లో జరిగిన మౌలిక పరిశోధనలే కంప్యూటర్లు, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల అభివృద్ధికి కారణ మయ్యాయి. భారతీయ విద్యాసంస్థల్లో కంప్యూటర్ సైన్స్ విద్యా బోధనకు దేశం చాలా ముందుగానే పెట్టుబడులు పెట్టింది. రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలు (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలని ఇప్పుడు పిలుస్తున్నారు), తరువాతి కాలంలో ట్రిపుల్ ఐటీల ఏర్పాటు కూడా ఈ ప్రయత్నాల్లో భాగమే. ప్రభుత్వ రంగంలో పెట్టిన ఈ పెట్టు బడుల ఫలితాలను ప్రైవేట్ రంగమూ పొందింది. ఆ క్రమంలోనే సరి కొత్త డిజిటల్ అప్లికేషన్ల అభివృద్ధికి దారితీసింది. ప్రస్తుత డిజిటల్ విప్లవం వెనుక ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్లు అభివృద్ధి చేసిన ఈ–గవర్నెన్స్, ఇతర డిజిటల్ అప్లికేషన్ల భూమికను విస్మరించలేము. సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సూపర్ పవర్‌గా ఎదగాలన్న లక్ష్యం అందుకోవాలంటే ఏ దేశమైనా తగినన్ని నిధులు, స్థిరంగా అందుబాటులో ఉంచాలి. అదే సమయంలో మౌలిక పరిశోధనలపైనా దృష్టి పెట్టాలి. దిగుమతి చేసుకున్న హార్ట్‌వేర్, విజ్ఞానంతో టెక్నలాజి కల్ అప్లికేషన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టడం వల్ల మనం ఇతరులపై ఆధారపడే స్థితి వస్తుంది. మౌలిక రంగ పరిశోధలు ఎన్నో రకాల ఇతర ప్రయోజనాలు అందిస్తాయి. పారిశ్రామిక, సామాజిక లాభాలూ ఒన గూరుతాయి. సర్వవ్యాప్తమైన డిజిటల్ కెమెరా, మెడికల్ ఇమేజింగ్, ఇంటర్నెట్లన్నీ ఇందుకు ఉదాహరణలు. వాతావరణ మార్పులు, ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి అతి సంక్లిష్టమైన ప్రపంచస్థాయి సమస్యల పరిష్కారానికీ మౌలిక పరిశోధనలే ఆధారం. రేపటి తరం టెక్నాలజీల కోసం ఈ రోజే సైన్స్ పై పెట్టుబడులు పెట్టడం అవశ్యం. దినేశ్.సి శర్మ - వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
డీఆర్డీవో చీఫ్‌గా సమీర్ వి కామత్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(డీడీఆర్‌డీ) సెక్రటరీగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చైర్మన్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా, ప్రస్తుత డీఆర్డీవో చీఫ్ జి.సతీశ్‌రెడ్డిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్రీయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కామత్ డీఆర్డీవోలో నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కామత్, సతీశ్‌రెడ్డిల నియామకాలను కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 60 ఏళ్లు వచ్చే వరకు కామత్ నూతన బాధ్యతల్లో కొనసాగుతారని కూడా వివరించింది. డీఆర్డీవో చీఫ్‌గా జి.సతీశ్‌రెడ్డి రెండేళ్ల పదవీ కాలానికి గాను 2018లో నియమితులయ్యారు. 2020 ఆగస్ట్‌లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. తాజాగా ఆయనకు రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు బాధ్యతలు అప్పగించింది. -
కరోనా థర్డ్ వేవ్ తప్పదు: సంచలన హెచ్చరికలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్ ప్రకంపనలతో ఇప్పటికే దేశం మొత్తం అతలాకుతలమవుతుంటే కేంద్ర ప్రధాన సాంకేతిక సలహాదారుడు డాక్టర్ కే విజయరాఘవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ తప్పదంటూ అత్యున్నత శాస్త్రీయ సలహాదారు బాంబు పేల్చారు. వేవ్ ఎప్పుడొస్తుంది?ఎలా వస్తుందో స్పష్టత లేనప్పటికీ ముప్పు తప్పదన్నారు. అంతేకాదు థర్డ్ వేవ్ నాటికి వైరస్ మరింతగా మారవచ్చని, భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఎక్కువని తెలిపారు. కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్ తయారు చేసుకోవాలని విజయరాఘవన్ సూచించారు. అయితే ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్ బాగా పని చేస్తోందని తెలిపారు. దేశంలో మహమ్మారి అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కోనేందుకు టీకాల పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని విజయరాఘవన్ హెచ్చరించారు. ఈ వైరస్ అధిక స్థాయిలో విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. కాగా ఇప్పటికే కరోనా విజృంభణ రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. గత వారం రోజులుగా 3 లక్షలకు తగ్గకుండా నమోదవుతున్న రోజువారీ కేసులు బుధవారం నాటి గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3.82లక్షల కేసులు నమోదైనాయి. ఒక్క రోజుకు చనిపోతున్న సంఖ్య రికార్డు స్థాయిలో 3,780కి పెరిగింది. ప్రపంచ కేసులలో 46 శాతం భారత్ వాటా ఉందని, గత వారంలో ప్రపంచ మరణాలలో నాలుగింట ఒక వంతుగా ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా విలయం: తండ్రి చితిపై దూకేసిన కుమార్తె Tirupati: కానిస్టేబుల్ సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన -
త్వరలో అడ్వాన్స్డ్ బ్యాటరీ టెక్నాలజీ విధానం
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలు, ఇతరత్రా అవసరాలకు ఉపయోగపడే అత్యాధునిక బ్యాటరీ సాంకేతికతలో స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం త్వరలో ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టనుందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహన రంగం వృద్ధికి దోహదపడే చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే సెల్స్‌ను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర విధానం అవసరమని మంత్రి చెప్పారు. ఆటోమొబైల్ తయారీతో పాటు విద్యుత్ వాహనాల విషయంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారత్ ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాల పరిశోధన, అభివృద్ధి అంశంపై జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కే విజయ రాఘవన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధనానికి సంబంధించిన పరిశోధనలు ఎవరికి వారు విడివిడిగా చేస్తున్నారు. వీటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి అంతా కలిసికట్టుగా పనిచేస్తే అత్యుత్తమ టెక్నాలజీలను అభివృద్ధి చేయొచ్చు. దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నాం. ఆయా టెక్నాలజీల లాభదాయకతపై కూడా దృష్టి పెడతాం. ఇందుకోసం ప్రత్యేక విధానం అవసరం‘ అని మంత్రి చెప్పారు. -
టీకా కోసం ముమ్మర కృషి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అడ్డుకునే టీకాను రూపొందించే పరిశోధనల్లో భారత్‌లో దాదాపు 30 బృందాలు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ విజయరాఘవన్ చెప్పారు. భారీ పరిశ్రమలు, సంస్థలు, సైంటిస్ట్‌లు వేర్వేరుగా పరిశోధనలు నిర్వహిస్తున్నారన్నారు. వీటిలో సుమారు 20 పరిశోధనలు మంచి పురోగతి సాధించాయన్నారు. అవి అక్టోబర్ నాటికి క్లినికల్ ట్రయల్స్ స్థాయికి చేరే చాన్సుంది. టీకాను రూపొందించేందుకు సాధారణంగా కనీసం పదేళ్ల సమయం పడుతుందని, దాదాపు 30 కోట్ల డాలర్ల ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రపంచమంతా ఇప్పుడు వ్యాక్సిన్ రూపకల్పనలో నిమగ్నమయిందని, సంవత్సరంలోపు టీకాను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. -
ఇంటి మాస్క్‌లకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: మాస్క్‌ల కొరతని అధిగమించేందుకూ, నాణ్యమైన మాస్క్‌లను ఇంటిలోనే తయారుచేసుకునేందుకు ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇంట్లోనే అందుబాటులో ఉండే టీ షర్టు, బనియన్, చేతిరుమాళ్ళ లాంటి, వాడిన గుడ్డలతో నాణ్యమైన మాస్క్‌లను తయారుచేయవచ్చునని, ఇవి 70 శాతం ప్రభావవంతంగా పనిచేస్తాయనీ, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ఉపకరిస్తాయని ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు కార్యాలయం మంగళవారం వెల్లడించింది. మాస్క్‌లను నీళ్ళు, సబ్బు, ఆల్కహాల్‌లలో శుభ్రపరిచి, ఎండలో ఆరబెట్టాక వాడాలన్నారు. నూలువస్త్రంతో, రెండు పొరలతో తయారుచేసిన మాస్క్ సూక్ష్మ పదార్థాలను సైతం శరీరంలోకి ప్రవేశించనివ్వదు. ఈ మాస్క్‌లను తయారుచేసే ముందు గుడ్డలను శుభ్రంగా ఉతికి, ఉప్పు కలిపిన నీటిలో ఐదు నిమిషాల పాటు ఉడికించి మాస్క్‌లుగా తయారుచేసుకోవాలి. -
నేటివిటీ మిస్
ఈయన పేరు.. అల్రిచ్ గ్రౌట్.. సైంటిఫిక్ అడ్వయిజర్ నుంచి బెర్లిన్ మేయర్‌గా ఎదిగారు. మెట్రోపొలిస్ సదస్సులో ‘సస్టెయినబుల్ సిటీ’పై ప్రసంగిస్తున్నారు. 28 ఏళ్ల కిందట మధురై నుంచి ఢిల్లీకి వెళ్తూ హైదరాబాద్ విజిట్ చేశారు. అప్పటి, ఇప్పటి సిటీ నేటివిటీ గురించి సిటీప్లస్‌తో పంచుకున్నారు. నాడు పచ్చటి ఉద్యానవనాలు.. విశాలమైన భూభాగం.. ఈ నగరానికే సొంతమైన శిలలతో భలే అందంగా ఉండేది. ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం.. విస్మయం. ఆ ల్యాండ్‌స్కేప్‌లు లేవు. ఆ కొండలూ లేవు. ఎక్కడపడితే అక్కడ అపార్ట్మెంట్లు, ఫ్లైఓవర్స్.. ఇవి విశాల నగరాన్ని మింగేశాయి. అప్పట్లో సిటీలో నో పెప్సీ.. నో కోకాకోలా.. తాజా పండ్లతో తయారు చేసిచ్చే జ్యూస్ భలే రుచిగా ఉండేది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నాకో విచిత్రంగా కనిపించింది. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్ వరకూ ఉన్న రోడ్స్ ఇంకా వండర్. ఈ అభివృద్ధి అహేతుకమైందంటాను. సహజ సంపదను, అందాన్ని హరించిన ఈ డెవలప్మెంట్ అంత మంచిదికాదని నా ఉద్దేశం. సరైన టౌన్‌ప్లాన్ ఉన్నట్టు అనిపించడం లేదు. కంఫర్ట్ ఫస్ట్.. నగరాలు పెరుగుతున్నపుడు కొన్ని తప్పిదాలు సహజం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ పునఃనిర్మాణంలో మా దేశం కూడా ఇలాంటి పొరపాట్లే చేసింది. వాటిలో ఒకటి.. కార్లు వెళ్లడానికి అనువుగా మాత్రమే మేం నగరాలను నిర్మించుకోవడం.. 24 గంటలూ కార్లలో తిరగలేం కదా? అందుకే అలాంటి మోడల్ సిటీస్ అంత సజెస్టబుల్ కాదు. జనాలు ఎక్కడ కంఫర్ట్‌గా ఫీలవుతారో అక్కడే ప్లాన్డ్ సిటీలు నిర్మించుకోవాలి. ఉనికి కాపాడుకోవాలి.. గ్లోబలైజేషన్ తర్వాత అభివృద్ధి వేగవంతమైంది. ఎకాన మీ ప్రెషర్స్ పెరిగాయి. వీటిని సమన్వయం చేస్తూనే నగరాల సహజత్వాన్ని కాపాడుకోవాలి. హైదరాబాద్ విశాలమైన నగరం. దీనికి ఇంకా ఆకాశాన్నంటే మేడలు అవసరం లేదు. చక్కటి సరస్సులు, కొండలు, గ్రీనరీ ఇవే సిటీ వాతావరణాన్ని కాపాడే ఆయుధాలు. అభివృద్ధి పేరుతో వాటిని హరించడం బాధాకరం. పెరుగుతున్న జనాభా, వారి అవసరాల మీద ఎంత దృష్టి పెడతామో.. సిటీ ఉనికి మీద అదే దృష్టి అవసరం. ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా.. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లే. అవీ రోడ్డును ఆనుకుని కనిపిస్తాయి. గాలి వెలుతురు లేని ఇరుకు గదులు.. వాహనాల రణగొణధ్వనులు.. కాలుష్యంలో బతుకీడుస్తున్నారు. సిటీప్లాన్ అంటే కాన్ఫరెన్స్ హాల్స్, మల్టీప్లెక్స్‌లే కాదు.. సామాన్యుడు ప్రశాంతంగా ఉండే ఇల్లు, వాతావరణం ఉండాలి. అలాంటి సిటీల నిర్మాణానికి కావల్సిన సూచనలు, సలహాలు ఫైల్స్‌లో బైండ్ కాకూడదు. ప్రాక్టికల్ ట్రూత్స్గా నిలబడాలి. అప్పుడే ఇలాంటి సదస్సులకు అసలైన అర్థం. అయినా ఆదాబ్ హైదరాబాద్.. హైదరాబాద్ విషయంలో.. మౌలిక సదుపాయాలు ఇన్క్లూడింగ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆర్ గుడ్. కానీ ఈ సిటీ అభివృద్ధి అన్ ఈవెన్‌గా ఉన్నట్టు అనిపించింది. కొన్ని సెంటర్స్‌లో బ్రాడ్ వేస్.. అద్భుతమైన ఇళ్లు.. చక్కటి ల్యాండ్‌స్కేప్స్ ఉన్నాయి. చాలా చోట్ల వీటికి భిన్నమైన పరిస్థితులున్నాయి. ఈవెన్దో ఐ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ హైదరాబాద్ ఫార్మాస్యుటికల్ ఇండస్ట్రీ. అంతేకాదు ఇక్కడి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కూడా ప్రపంచంలోని అవకాశాలను వేగంగా అందిపుచ్చుకుంటుంది. సిటీ గ్రోత్ ఈజ్ ఇంప్రెసివ్.