'స్కార్పిన్ లీకేజీపై ఆందోళన వద్దు'
న్యూఢిల్లీ: స్కార్పిన్ జలాంతర్గామి సమాచారం బహిర్గతం కావడంపై ఆందోళన పడొద్దని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ వ్యాఖ్యానించారు. లీకైన పత్రాల్లో ఆయుధ వ్యవస్థ వివరాలు లేనందున కంగారు పడొద్దన్నారు. రక్షణ శాఖ వెబ్సైట్ భారత్శక్తి.ఇన్ నిర్వహించిన సెమినార్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
నేవీ తనకిచ్చిన సమాచారంతోనే మాట్లాడుతున్నానని, అత్యంత దుర్భర పరిస్థితులున్నాయని రక్షణ శాఖ భావిస్తుండటం వల్లే ఆందోళనలు పెరిగాయన్నారు. జలాంతర్గామి సమాచారంతో పాటు ఆయుధ వ్యవస్థ వివరాలు కూడా బయటకు పొక్కాయని, వాటికి సంబంధించిన ప్రతులను సోమవారం బహిర్గతం చేస్తామని ‘ది ఆస్ట్రేలియన్’ ప్రకటించింది.