the sea
-
వలకు చిక్కని చేప
సాక్షి, అమరావతి బ్యూరో: మత్స్యకారుల ఆశలపై కడలి నీళ్లు చల్లుతోంది. రెండు నెలల నిషేధం అనంతరం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వీరికి ఆశాభంగమే ఎదురవుతోంది. కొన్నాళ్లుగా సాగరంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం వీరిలో అలజడిని రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 15 వరకు 61 రోజుల పాటు మత్స్య సంపద వృద్ధి కోసం చేపల వేటపై నిషేధం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిషేధం ముగిసాక బోట్లలో వేటకెళ్లిన మత్స్యకారులకు పుష్కలంగా చేపలు లభ్యమవుతాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా అరకొర చేపలే పడుతున్నాయి. కొన్నాళ్ల నుంచి సముద్రంలో ప్రతికూల వాతావరణం కొనసాగుతోంది. మూడు, నాలుగు మైళ్ల వేగంతో.. సాగరం లోపల సాధారణంగా ‘వడి’ (నీటి ప్రవాహం) వేగం గంటకు ఒకట్రెండు మైళ్ల వేగం ఉంటుంది. అలాంటి సమయంలో మత్స్యకారుల వలలకు చేపలు ఎక్కువగా చిక్కుతాయి. కానీ ఇటీవల ‘వడి’ మూడు, నాలుగు మైళ్ల వేగంతో ఉంటోంది. ఫలితంగా ఆ వేగానికి వలలు చుట్టుకుపోయి చేపలు చిక్కకుండా పోతున్నాయి. జిల్లాలో 105 మెకనైజ్డ్, 2054 మోటారైజ్డ్ బోట్లు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం మత్స్యకారులు చేపల వేట సాగిస్తుంటారు. వీరిలో కొందరు ట్యూనా చేపలను, మరికొందరు రొయ్యలను వేటాడుతుంటారు. ఒక్కో బోటు సముద్రంలో దాదాపు వారం రోజుల పాటు వేటను కొనసాగిస్తారు. ఇలా సాధారణంగా ఈ సీజనులో నాలుగైదు టన్నుల ట్యూనా చేపలు లభ్యమవుతాయి. వీటి ద్వారా రూ.2 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుంది. కానీ కొన్నాళ్ల నుంచి కనీసం ఒక్క టన్ను చేపలు దొరకడం కూడా గగనమవుతోందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. గతంలో రొయ్యల వేట ద్వారా రూ.2 లక్షలు సమకూరేది. ప్రస్తుతం రూ.లక్ష విలువైన రొయ్యలు కూడా పడటం లేదని చెబుతున్నారు. ఈ ఫొటోలో ఉన్న సైకం ఆంజనేయులు స్వగ్రామం మచిలీ పట్నం మండలం చినకరగ్రహారం. ఇటీవల రూ.30 వేల పెట్టుబడితో తన బోటును కళాసీలతో సముద్రంలో చేపల వేటకు పంపించారు. నాలుగు రోజుల పాటు వేట సాగిస్తే రూ.1,700 విలువైన చేపలు మాత్రమే లభ్యమయ్యాయి. గతంలోనూ వేటకు పంపిన బోటు అరకొర చేపలతోనే తిరిగొచ్చింది. ఇక నష్టాలను భరించలేక తన బోటును రేవులో కట్టేసి వేటను నిలిపివేశారు. 18 ఏళ్లుగా చేపలవేట వృత్తిలో ఉన్న తాను ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆంజనేయులు అంటున్నారు. ఒక్క ఆంజనేయులే కాదు.. సముద్రంలో వేట సాగించే జిల్లాలో పలువురి మత్స్యకారుల పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. నష్టాలే మిగులుతున్నాయి సముంద్రంలో కొన్నాళ్ల నుంచి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ‘వడి’ అధికంగా ఉండడం వల్ల చేపల లభ్యత కష్టతరంగా మారింది. పైగా వలలు దెబ్బతింటున్నాయి. కనీసం పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదు. డీజిల్ ధర అమాంతంగా పెరగడం, చేపలు లభ్యం కాకపోవడంతో నష్టాల పాలవుతున్నాం. ఈ నష్టాలను భరించలేక, మరో గత్యంతరం లేక బోట్లకు హార్బర్‌లోనే ఉంచేయాల్సి వస్తోంది. -శేఖర్, మత్స్యకారుడు, మచిలీపట్నం -
కెరటాల కచేరీ
సమ్‌థింగ్ స్పెషల్ సముద్రం ఒడ్డుకు వెళితే ఎక్కడైనా అలల ఘోషే వినిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక రీతిలో, ఆటు పోట్ల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకో రీతిలో, తుపానుల వంటి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు మరో రీతిలో ఉండే అలల ఘోష ఏ తీరానికి వెళ్లినా దాదాపు ఒకే రీతిలో ఉంటుంది. ఎగసిపడే అలల సవ్వడిలో సరిగమల స్వర మధురిమలను ఆలకించడం దాదాపు అసాధ్యం. అయితే, ఈ అసాధ్యాన్ని క్రొయేషియన్ ఆర్కిటెక్ట్ నికోలా బాసిక్ సుసాధ్యం చేశాడు. జదార్ నగరంలో సముద్రం ఒడ్డున అతగాడు కెరటాల కచేరీ కోసం ఏకంగా శాశ్వత వాద్య పరికరాన్నే నిర్మించాడు. పియోనో మెట్ల తీరులోనే సాగర తీరాన అతడు నిర్మించిన సోపానాలే ఆ వాద్యపరికరం. ఈ మెట్లకు మౌత్ ఆర్గాన్లోని రంధ్రాల మాదిరిగా, స్వరాలకు అనుగుణమైన రంధ్రాలను ఏర్పాటు చేశాడు. రంధ్రాలలో ఆర్గాన్ పైప్స్ ఏర్పాటు చేశాడు. ఎగసిపడే అలలు ఈ మెట్లను తాకి, వాటి రంధ్రాల గుండా నీరు లోపలకు పోయి, అలలు వెనక్కు మళ్లేటప్పుడు ఆ నీరు బయటకు వచ్చేటప్పుడు సుస్వరాలు వినిపిస్తాయి. ఐదు స్థాయుల్లో సప్తస్వరాలు వినిపించేలా ఏర్పాటు చేసిన ఈ సంగీత సోపానాలు క్రొయేషియాకు ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా మారాయి. కెరటాల కచేరీని ఆలకించేందుకు ఇక్కడకు పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఎగబడుతుండటం విశేషం. -
సమస్యల లంగరు
నిజాంపట్నం కోస్తా తీరంలో ఎంతో ప్రాధాన్యమున్న నిజాంపట్నం హార్బర్లో సమస్యలు లంగరేశారుు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి జాడ కనిపించటం లేదు. అటవీ శాఖకు చెందిన 38 ఎకరాల స్థలంలో 1980లో హార్బర్‌ను ఏర్పాటు చేశారు. హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్లేందుకు అనుసంధానంగా ఉన్న మొగ వద్ద ఎప్పటికప్పుడు ఇసుక మేట వేస్తుండటంతో బోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్నిసార్లు నేల తగిలి బోట్లు ధ్వంసమవుతున్నారుు. కొన్ని ఘటనల్లో జాలర్లు గల్లంతయ్యూరు కూడా. అరుునా అధికారులు పట్టించుకోవటం లేదు. జిల్లాలోని లంకేవానిదిబ్బ నుంచి బాపట్ల వరకు సుమారు 22 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. జిల్లాలో దాదాపు 6,812 మత్స్యకార కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారుు. నిజాంపట్నం హార్బర్ నుంచి రోజుకు సుమారు 20 టన్నుల చేపలు ఇతర ప్రాంతాలకు ఎగుమతవుతున్నారుు. జెట్టీ చాలక ఇబ్బందులు హార్బర్లో ప్రస్తుతం ఉన్న జెట్టీ 50 బోట్లను నిలుపుకునేందుకు సరిపోతోంది. ప్రస్తుతం ఇక్కడ లెసైన్స్ ఉన్న బోట్లు సుమారు 150 ఉన్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా కాకినాడ, విశాఖపట్నం, చీరాల, నెల్లూరు, చెన్నై, కోల్‌కతాలకు చెందిన బోట్లు కూడా ఇక్కడికి వస్తుంటాయి. విపత్తుల సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బోట్లను ఇక్కడే నిలుపుదల చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో జెట్టీలో చోటు కోసం బోట్ల యజమానులు బాహాబాహీకి దిగుతున్నారు. జెట్టీకి దూరంగా లంగరేసిన బోట్లు ఈదురు గాలుల ధాటికి సముద్రంలోని కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నారుు. వైఎస్ మరణంతో ఆగిన ఫైలు గతంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణారావు జెట్టీ సమస్యను అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన వై.ఎస్. జెట్టీ విస్తరణ చేపట్టేందుకు అనుమతులిచ్చారు. జెట్టీ నిర్మాణానికి 5 ఎకరాల అటవీ భూమిని కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. వై.ఎస్. మరణానంతరం ఫైలు కదలిక దాదాపు నిలిచిపోరుుంది. ఫలితంగా జెట్టీ విస్తరణ పనులు ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.