the second rank
-
రెండో ర్యాంక్‌కు కోహ్లి
దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కెప్టెన్‌గా భారత్‌కు శ్రీలంకపై 5-0తో సిరీస్ విజయాన్ని అందించిన విరాట్... ఈ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. దీంతో ఒక ర్యాంక్ ఎగబాకి రెండో స్థానానికి చేరాడు. డివిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి ధావన్ ఐదో ర్యాంక్‌లో, ధోని ఏడో స్థానంలో ఉన్నారు. అలాగే వన్డేలో రెండోసారి డబుల్ సెంచరీ ఘనత సాధించిన రోహిత్ శర్మ... 18 స్థానాలను మెరుగుపరుచుకుని 15వ ర్యాంక్‌కు చేరాడు. బౌలర్ల విభాగంలో భారత్ నుంచి భువనేశ్వర్ ఎనిమిదో ర్యాంక్‌లో, జడేజా పదో స్థానంలో ఉన్నారు. ‘సూపర్ హీరో’గా విరాట్ కోహ్లి ఇప్పుడు సూపర్ హీరో అవతారమెత్తనున్నాడు. 3డి యానిమేటెడ్ పాత్రలో కోహ్లి... స్పైడర్‌మ్యాన్, సూపర్మ్యాన్లను మట్టికరిపించేందుకు సిద్ధమవుతున్నాడు. సోమవారం ఈ పాత్ర రూపాన్ని, వెబ్సైట్, లోగోను కోహ్లి ఆవిష్కరించాడు. -
మళ్లీ రెండో ర్యాంక్‌కు
షరపోవా ఖాతాలో చైనా ఓపెన్ బీజింగ్: ఈ ఏడాది నిలకడగా రాణిస్తోన్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా మళ్లీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో షరపోవా చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఈ రష్యా భామ 6-4, 2-6, 6-3తో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ ఏడాది నాలుగో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న షరపోవా చైనా గడ్డపై తొలిసారి ఓ టోర్నీలో విజేతగా నిలిచింది. ఇప్పటివరకు షరపోవా 14 దేశాల్లో కనీసం ఒక్క టైటిల్ అయినా గెలిచింది. అమెరికాలో అత్యధికంగా తొమ్మిది నెగ్గగా... జపాన్‌లో నాలుగు, ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లలో మూడేసి టైటిల్స్ ఉన్నాయి. విజేతగా నిలిచిన షరపోవాకు 9,35,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 కోట్ల 76 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.