రెండో ర్యాంక్‌కు కోహ్లి | Kohli reaches second rank | Sakshi
Sakshi News home page

రెండో ర్యాంక్‌కు కోహ్లి

Published Tue, Nov 18 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

రెండో ర్యాంక్‌కు కోహ్లి

రెండో ర్యాంక్‌కు కోహ్లి

దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కెప్టెన్‌గా భారత్‌కు శ్రీలంకపై 5-0తో సిరీస్ విజయాన్ని అందించిన విరాట్... ఈ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. దీంతో ఒక ర్యాంక్ ఎగబాకి రెండో స్థానానికి చేరాడు. డివిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి ధావన్ ఐదో ర్యాంక్‌లో, ధోని ఏడో స్థానంలో ఉన్నారు.

అలాగే వన్డేలో రెండోసారి డబుల్ సెంచరీ ఘనత సాధించిన రోహిత్ శర్మ... 18 స్థానాలను మెరుగుపరుచుకుని 15వ ర్యాంక్‌కు చేరాడు. బౌలర్ల విభాగంలో భారత్ నుంచి భువనేశ్వర్ ఎనిమిదో ర్యాంక్‌లో, జడేజా పదో స్థానంలో ఉన్నారు.
 
 ‘సూపర్ హీరో’గా విరాట్
 కోహ్లి ఇప్పుడు సూపర్ హీరో అవతారమెత్తనున్నాడు. 3డి యానిమేటెడ్ పాత్రలో కోహ్లి... స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్‌లను మట్టికరిపించేందుకు సిద్ధమవుతున్నాడు. సోమవారం ఈ పాత్ర రూపాన్ని, వెబ్‌సైట్, లోగోను కోహ్లి ఆవిష్కరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement