Secret Letter
-
చిన్నమ్మ గదిలో ‘గుట్కా’
సాక్షి, చెన్నై : అత్యంత రహస్యంగా పంపిణీ గుట్కా లేఖలు చిన్నమ్మ శశికళ గదిలో బయట పడడం ఆదాయ పన్ను శాఖ వర్గాల్ని విస్మయంలో పడేసింది. తమ దాడుల్లో బయట పడ్డ ఆ లేఖల్ని కోర్టుకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో గుట్కా, హాన్స్ తదితర మత్తు పదార్థాల విక్రయాలకు నిషేధం విధించిన చాప కింద నీరులా మార్కెట్లో లభిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది రెడ్‌హిల్స్ సమీపంలో మాదక ద్రవ్యాల నిరోధక విభాగం జరిపిన దాడులు చర్చకు దారి తీశాయి. మాధవరావు అనే వ్యక్తి వద్ద లభించిన డైరీ ఆధారంగా ఈ గుట్టుకు సహకరిస్తున్న వారి జాబితా బయట పడడం కలకలం రేపింది. ఇందులో ప్రభుత్వ అధికారులు, ఓ మంత్రి, ఐపీఎస్ బాసులు ఉండడంతో ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలోపడ్డాయి. అలాగే గుట్కా గుట్టు వ్యవహారం నిగ్గు తేల్చాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ ముందు సాగుతూ వస్తున్నది. పిటిషన్ విచారణలో భాగంగా సెంట్రల్ ఎక్సైజ్ వర్గాలు తమ తరఫు నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ పరిస్థితుల్లో ఆదాయపన్ను శాఖ తరఫున సైతం కోర్టుకు ఓ నివేదిక సమర్పించేందుకు తగ్గ కసరత్తులు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకుతగ్గ కొత్త సమాచారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ అధికారులు, పోలీసు బాసుల్లో ఆందోళన బయలుదేరి ఉండడం గమనార్హం. ఇందుకు నిదర్శనం, గతంలో రహస్యంగా ఆదాయపన్ను శాఖ పంపిన లేఖలు పోయెస్‌గార్డెన్‌లోని చిన్నమ్మ శశికళ గదిలో లభించి ఉండడమే. ఆ లేఖలు ఇక్కడికి ఎలా వచ్చాయో..? 2016 ప్రారంభంలో తాము పంపిన లేఖలు, కొన్ని నెలల అనంతరం మాయం కావడాన్ని ఆదాయ పన్ను శాఖ తీవ్రంగానే పరిగణించింది. ప్రభుత్వ అధికారులు ఈ లేఖలు అప్పట్లో సీఎంగా ఉన్న జయలలిత దృష్టిలో పడకుండా జాగ్రత్తలే తీసుకున్నట్టున్నాయి. ఇందుకు తగ్గ పరిణామాలు తాజాగా వెలుగులోకి రావడం చర్చకు దారి తీసింది. ఆదాయ పన్ను శాఖ వర్గాలు తరచూ పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసంలో తనిఖీలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ వేదా నిలయంలోనే చిన్నమ్మ శశికళకు ప్రత్యేక గది ఉంది. ఇందులో తాము పంపిన రహస్య లేఖలు బయట పడడంఆదాయ పన్ను శాఖ వర్గాల్ని విస్మయంలో పడేసినట్టు సమాచారం. ఈ లేఖలు ఇక్కడకు ఎలా వచ్చాయో, గుట్కా గుట్టు పూర్తిగా రట్టు చేయడానికి ఆ విభాగం వర్గాలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈనెల 17వ తేదీన హైకోర్టులో గుట్కా కేసు విచారణకు రానున్న సమయంలో తమ తరఫున ఓ నివేదికను కోర్టు ముందు ఉంచేందుకు ఐటీ వర్గాలు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో పలువురు పోలీసు బాసులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో ఆందోళన బయలు దేరింది. గుట్కాపై లేఖలు గుట్కా వ్యవహారం చిలికి చిలికి అతి పెద్ద స్కాంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాది రూ. 250 కోట్ల మేరకు టర్నోవర్ రహస్యంగా సాగి ఉండడం ఇందుకు నిదర్శనం. ఆదాయ పన్ను శాఖ వర్గాలు ఈ గుట్కా గుట్టును 2016 ప్రారంభంలోనే తేల్చి ఉన్నారు. ఇందులో ఉన్న అధికారులు ఎవ్వరెవ్వరో వివరిస్తూ, అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని రహస్య లేఖల్ని పంపారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్మెహన్ రావు, అప్పటి డీజీపీలకు ఈ రహస్య లేఖలు పంపినట్టు సమాచారం. ఈ లేఖల్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదాయ పన్ను శాఖ సూచించింది. ఢిల్లీలోని ఉన్నతాధికారుల నుంచి సైతం కొన్ని రహస్య సమాచారాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్టు సంకేతాలు ఉన్నాయి. అయితే, ఈ లేఖలపై ఎలాంటి చర్యలు లేవని చెప్పవచ్చు. ఈ సమయంలో అమ్మ అనారోగ్యం బారిన పడడంతో ఆ లేఖ వ్యవహారం కాస్త తెర మరుగు అయిందని చెప్పవచ్చు. ఈ కాలంలో పలుమార్లు ఆదాయ పన్ను శాఖ నుంచి ప్రభుత్వ అధికారులకు సంకేతాలు వచ్చినా, లేఖలు కన్పించడం లేదన్నట్టు సమాధానాలు వెళ్లి ఉన్నాయి. ఆ తదుపరి పరిణామాలతో ఈలేఖలు పూర్తిగా తెర మరుగు అయినా, 2017లో రెడ్ హిల్స్‌లో సాగిన తనిఖీల పర్వంతో గుట్కా బండారం వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే, ప్రభుత్వ అధికారులకు పంపిణీ లేఖలు అప్పట్లో మాయమైనా, ప్రస్తుతం అవి మళ్లీ ఆదాయ పన్ను శాఖకు చేరడం గమనార్హం. -
శశికళ గదిలో జయకు రాసిన సీక్రెట్ లెటర్
సాక్షి, చెన్నై : తమిళనాడులో కలకలం సృష్టించిన గుట్కా స్కాంకు సంబంధించిన రహస్య లేఖ ఒకటి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత నిచ్చెలి శశికళ గదిలో లభించింది. గత నవంబర్(2017)లో ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఇది బయటపడింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టుకు ఐటీ వారు ఇచ్చిన అఫిడవిట్ ఐటీ ప్రిన్సిపల్ డైరెక్టర్ సుసీ బాబు వర్గీస్ పేర్కొన్నారు. గుట్కా స్కాంపై వెంటనే సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని డీఎంకే ఎమ్మెల్యే అంబజగన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఐటీ అధికారులు పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో సోదాలు నిర్వహించగా శశికళ గదిలో ఓ లేఖ లభించింది. వర్గీస్ తెలిపిన ప్రకారం.. ఆ లేఖ ఆగస్టు 11న 2016న నాటి ఐటీ ప్రిన్సిపల్ డైరెక్టర్ ముఖ్యమంత్రి జయలలితకు, నాటి డీజీపీకి లేఖ రాశారు. ఈ కుంభకోణంలో ఓ రాష్ట్ర మంత్రితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు సంబంధాలు కలిగి ఉన్నారని, పోలీసులకు కూడా సంబంధం ఉందని పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వంతో సంబంధం కలిగి ఉన్న పార్టీలన్నింటికి కూడా ముడుపులు పోయినట్లు వెల్లడించారు. వెంటనే దీనిపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. -
వివాదాలతో స్నేహం
ముంబై: ఎప్పుడూ వివాదాల్లో ఉండే ముంబై మేయర్ స్నేహల్ అంబేకర్ ఇప్పుడు మరో సరికొత్త వివాదానికి తెర లేపారు. నగరంలోని రోడ్ల పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ముంబై మున్సిపల్ కమిషనర్ అజోయ్ మెహతాకు ఆమె రాసిన రహస్య లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. తాను రాసిన లేఖపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని అంబేకర్.. ఆసలు ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించాలిని కోరారు. ‘ఆ లేఖ రహస్యంగా రాసింది. మరి అది ఎలా బయటికొచ్చింది. దీనిపై దర్యాప్తు జరగాలి’ అని స్నేహాల్ డిమాండ్ చేశారు. కాగా దీనిపై సొంత పార్టీ నుంచే గాక అన్ని వైపుల నుంచి స్నేహాల్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుభవ లేమి వల్లే ఆమె ఇలా వివాదాల్లో చిక్కుకుంటున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. స్నేహాల్ను పదవి నుంచి తప్పించేందుకు సేన నాయకులు ప్రయత్నించినప్పటికీ, ఆమె మేయర్‌గానే కొనసాగుతానని భీష్మించుకుని కూర్చున్నారు. మేయర్ పదవి నిర్వర్తించేంత బలమైన నేత లేకపోవడం, బీజేపీతో సత్సం బంధాలు లేకపోవడంతో సేన ఏం చేయలేకపోతోంది. దూరంగా ఉంటే మంచిది.. కాగా, వివాదాలకు దూరంగా ఉండాలంటూ అంబేకర్‌కు మాతోశ్రీ నుంచి మందలింపు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ఇదే పరిస్థితిని స్నేహాల్ కొనసాగిస్తే.. త్వరలోనే మేయర్ పదవి ఇంకొకరికి అప్పజెప్పాల్సి వస్తుంది’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ‘మేం మేయర్‌ను మార్చాలని అనుకుంటున్నాం. కానీ ఆమెకు ప్రత్యామ్నాయం ఎవరూ కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం కూడా కుదరదు. బీజేపీతో సంబంధాలు అంతంతమాత్రమే. ఈ వివాదాలను ఎత్తి చూపి వారు లబ్ధి పొందాలనుకుం టున్నారు. అందుకే ప్రస్తుతం ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపో తున్నాం. మరో ప్రత్యామ్నాయం లేదు. ఆమెను కొనసాగిం చడమే’ అని ఓ సేన సీనియర్ నేత అన్నారు. బీఎంసీ చరి త్రలో ఏ ఒక్క మేయర్ కూడా ఇన్ని వివాదాల్లో చిక్కుకోలేదు. అది కూడా మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో పే తలెత్తడం గమనార్హం. ఒక వేళ మేయర్‌గా అంబేకర్‌ను కొనసాగించాలని సేన అధినాయకత్వం భావిస్తే.. 2017 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే వరకు ఆమె కొనసాగుతారు. ఇదీ స్నేహాల్ ప్రస్థానం శివసేన నేత సూర్యకాంత్ సతీమణి అయిన స్నేహాల్, 1996లో పార్టీలో చేరారు. 2012లో లోయర్ పరేల్ నుంచి తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ముంబై మేయర్ పదవి ఎస్సీలకు రిజర్వయ్యింది. యామిణి జాదవ్, భారతి బౌడానే కార్పొరేటర్లతో పాటు స్నేహాల్.. మేయర్ పదవికి పోటీ పడగా, అంబేకర్‌ను పదవి వరించింది. ఇవీ వివాదాలు.. నెల రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చి దుమారం రేపారు. తనకు కేటాయించిన ప్రభుత్వ కారుకు ఎర్ర బుగ్గను తొలగించేందుకు నిరాకరించారు. ముంబై నగరానికి తాను ముఖ్యమంత్రి లాంటి దాన్నని వ్యాఖ్యానించారు. దీపావళి సందర్భంగా శివాజీ పార్క్‌లోని తన అధికారిక నివాసంలో బాలీవుడ్ గీతాలకు నృత్యం చేసి మరో మారు వివాదంలో చిక్కుకున్నారు. డెంగీ వ్యాధి వ్యాప్తి గురించి మీడియా ఓవర్ యాక్షన్ చేస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.