ఢిల్లీలో సీమాంధ్రవాణి వినిపించాం:మురళీకృష్ణ
న్యూఢిల్లీ: ఢిల్లీలో జాతీయ పార్టీల నేతలందరికీ సీమాంధ్ర వాణి వినిపించామని సీమాంధ్ర ఉద్యోగుల సెక్రటేరియట్ కన్వీనర్ మురళీకృష్ణ చెప్పారు. తమ ఢిల్లీ పర్యటన సంతృప్తికరంగా జరిగినట్లు తెలిపారు. జాతీయ నేతలకు సీమాంధ్రుల పరిస్థితులను వివరించినట్లు చెప్పారు.
సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సెప్టెంబర్ 7న హైదరాబాద్లో సభ నిర్వహించి తీరుతామన్నారు. సభలో అన్ని పార్టీల నేతలను పాల్గొనాలని కోరినట్లు తెలిపారు.