సెక్టోరియల్ పోస్టులకు 21న ఆన్లైన్ పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్ : సర్వశిక్షాభియాన్ (ఎస్ఎస్ఏ) పరిధిలోని సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టుల భర్తీకి ఈనెల 21న కడపలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి 1 గంట వరకూ ఈ పరీక్ష ఉంటుంది. అయితే పరీక్షా కేంద్రం ఇంకా ఖరారు కాలేదు. రాయలసీమ జిల్లాలు అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు నాలుగు జిల్లాలకు కడపలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 106 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.