టీడీపీ నేత ఎర్రబెల్లికి అస్వస్థత
ప్రమాదంలేదు: అపోలో వైద్యులు
సికింద్రాబాద్/ పాలకుర్తి (వరంగల్ జిల్లా), న్యూస్‌లైన్: టీడీపీ రాష్ట్ర నేత, వరంగల్ జిల్లా పాలకుర్తి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు అస్వస్థతకు గురయ్యారు. పాలకుర్తిలో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచార ముగింపు ర్యాలీలో పాల్గొనేందుకు పార్టీ కార్యాలయానికి చేరుకున్న దయాకర్‌రావు... కార్యకర్తలతో మాట్లాడుతూనే అకస్మాత్తుగా పడిపోయారు. దీంతో కార్యకర్తలు ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. దయాకర్‌రావు హృద్రోగ సమస్యతో, షుగర్, బీపీ సమస్యలతో బాధపడుతున్నారని అపోలో వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. దయాకర్‌రావు వెంట ఆయన సతీమణి ఉష, కుటుంబ సభ్యులు ఉన్నారు.