Secunderabad taskforce police
-
మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ : నగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయింది. సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం తొమ్మిదిమందిని అరెస్ట్ చేశారు. కూకట్పల్లికి చెందిన రఘువంశీధర్ రెడ్డి, మల్లికార్జునరావు, మహేంద్రహిల్స్ నివాసి అభినవ్ మహేందర్, అలాగే బెంగళూరుకు చెందిన క్రిస్టోఫర్లతో పాటు అరెస్ట్ అయినవారిలో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారు. వీరందర్ని ఇవాళ బంజారాహిల్స్ రోడ్ నంబర్.12లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 300 గ్రాములు కొకైన్, 42 గ్రాముల పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులు వాడిన నిస్సాన్ సన్నీ కారు (AP10BE9509)ను జప్తు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
3వేల పైరసీ సీడీలు స్వాధీనం
హైదరాబాద్: సినిమా విడుదల కావటమే ఆలస్యం.. పైరసీ సీడీలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. సినిమా పూర్తిగా రూపుదిద్దుకోని బయటకు రావలంటే దాని వెనుక ఎందరో కష్టం ఆధారపడి ఉంటుంది. ఈ పైరసీదారులు సినిమా విడుదల కాగానే పైరసీ సీడీలు తయారుచేయడం వాటినీ అంతర్జాలంలోనూ, మార్కెట్లోనూ విడుదల చేస్తున్నారు. సినిమా విడుదలైన మరుసటిరోజే పైరసీ సీడీలు మార్కెట్లో రావటం.. సినిమా పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా సినిమా పైరసీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 వేల పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన తెలుగు, హిందీ సినిమాల సీడీలు కూడా దొరికినట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు.