Security bill
-
ఫ్రాన్స్‌లో భద్రతా బిల్లుపై జనాగ్రహం
పారిస్: విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఫొటోలను షేర్ చేయడాన్ని నిషేధిస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం తీసుకొచ్చిన భద్రతా బిల్లుపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇటీవల ఫ్రాన్స్‌లో ఓ నల్ల జాతీయుడిని పోలీసులు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం ప్రభుత్వం భద్రతా బిల్లును తీసుకొచ్చింది. ఇది పార్లమెంట్ దిగువ సభలో ఆమోదం పొందింది. ఇక సెనేట్‌లో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ కొత్త బిల్లు ప్రకారం.. విధుల్లో ఉన్న పోలీసుల ఫోటోలు తీయడం, వాటిని షేర్ చేయడం వంటివి చేస్తే ఏడాది జైలు శిక్ష, 53 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. -
హాంకాంగ్‌పై మరింత పట్టు
బీజింగ్: హాంకాంగ్‌పై మరింత పెత్తనం చెలాయించేందుకు ఉద్దేశించిన వివాదాస్పద జాతీయ భద్రతా బిల్లును చైనా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇవి అమల్లోకి వస్తే హాంకాంగ్ ప్రాదేశిక స్వతంత్ర ప్రతిపత్తి, పౌరులకున్న రాజకీయ స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడతాయని విమర్శకులు అంటున్నారు. ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా హాంకాంగ్‌కున్న పేరు మరుగున పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనా ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రతిపాదనలను నామమాత్రంగా ఉండే పార్లమెంట్(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, ఎన్పీసీ) ఏకగ్రీవంగా ఆమోదించింది. వీటిని హాంకాంగ్ పార్లమెంట్ ఆమోదిస్తే వచ్చే ఆగస్టు కల్లా చట్టరూపం దాల్చుతుంది. ప్రజాస్వామ్య హక్కులు, చైనా నుంచి మరింత స్వతంత్ర ప్రతిపత్తి కోసం గత ఏడాది ప్రజాస్వామ్య వాదులు చేపట్టిన ఆందోళనలతో హాంకాంగ్ అట్టుడికింది. తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేగాయి. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. ఈ పరిణామాలను చైనా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. హాంకాంగ్‌పై మరింత పట్టు సాధించడం ద్వారా వీటికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. -
2న రాష్ట్ర వ్యాప్త బంద్
హిమాయత్‌నగర్: రోడ్డు, రవాణా భద్రతా బిల్లు, ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు నిర సనగా సెప్టెంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటోడ్రైవర్ల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని ఎఐటియుసి భవన్లో సోమవారం బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో లక్ష్మయ్య పాల్గొన్నారు.