న్యూజిలాండ్ లో భారీ భూకంపం
వెల్లింగ్టన్: సెంట్రల్ న్యూజిలాండ్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8 గా నమోదైంది. భూకంప ప్రమాద ప్రభావం వెల్లింగ్టన్ లో ట్రాఫిక్ పై తీవ్ర ప్రభావం చూపింది. రాజధానిలోని కొన్ని భవనాల నుంచి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు అందుబాటులోకి రాలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. సౌత్ ఐలాండ్ లోని సెడన్ ప్రాంతంలో భూ ప్రకంపనల ధాటికి బండరాళ్లు జాతీయ రహదారిపై అడ్డంగా పడినట్టు అధికారులు తెలిపారు. ఐతే వెల్లింగ్టన్ ప్రాంతంలో ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు సమాచారాన్ని అందించారు.