seeds rates
-
ఉల్లి.. లొల్లి..
సాక్షి, నారాయణఖేడ్: ఉల్లి సాగు చేసే రైతులకు ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేవు. ప్రతీ ఏటా కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి విత్తనాలు ఈ ఏడాదీ ఏడిపిస్తున్నాయి. ఉద్యానవన శాఖ పంపిణీ చేసే సబ్సిడీ విత్తనాలు రెండేళ్లుగా రావడమే లేదు. సబ్సిడీ విత్తనాలు అందక రైతులపై ఆర్థిక భారం తప్పడం లేదు. జిల్లాలో ఉల్లి విత్తనాలు దొరకక పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో దాదాపుగా మూడు వేల ఎకరాల్లో సాగయ్యే ఉల్లి గురించి పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడు. ఉల్లి సాగు చేసే రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. విత్తన సమస్య వారిని నిత్యం వేధిస్తూనే ఉంది. సమస్య ఎలా ఉన్నా ఈ రబీ సీజన్లో ఉల్లి సాగు చేసేందుకు రైతులు రెడీ అయిపోయారు. కొన్ని చోట్ల దుక్కులు దున్నుతుండగా అక్కడక్కడా ఉల్లి నారు కూడా పోశారు. ఉల్లి నారు చల్లడానికి రైతులు జిల్లాలో తీవ్ర విత్తన కొరతను ఎదుర్కొంటున్నారు. చేసిదిలేక పక్కనున్న మహారాష్ట్రలోని పండరిపూర్, సోలాపూర్ ప్రాంతాలకు వెళ్లి ఉల్లి విత్తనాలు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఉద్యాన వనశాఖ అధికారులు సబ్సిడీపై ఉల్లి విత్తనాలు అందించేవారు. కానీ రెండేళ్లుగా సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేయడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లిగడ్డను మార్కెట్‌కు తరలిస్తున్న రైతులు (ఫైల్) గతంలో శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీలో కేజీ విత్తనాలు రూ. 250 నుంచి రూ.350 వరకు ఇచ్చేవారని రైతులు తెలిపారు. దీంతో ఎంతగానో సౌకర్యవంతంగా ఉండేదని పేర్కొంటున్నారు. సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం బంద్ చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్రలో కిలో విత్తనాలను రూ.1250 నుండి 1500 చొప్పున తీసుకువస్తున్నామని పేర్కొంటున్నారు.దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం సాగుకు రెండు కిలోల ఉల్లి విత్తనాలు అవసరం ఉంటాయని రైతులు తెలిపారు. నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ఉల్లి ఎక్కువగా సాగు చేస్తున్నారు. నారాయణఖేడ్, మనూరు, నాగల్గిద్ద, అందోల్ పరిధిలోని వట్పల్లి, రేగోడ్, జహీరాబాద్, రాయికోడ్, కోహీర్, న్యాల్కల్ ప్రాంతాల్లో ఉల్లి సాగవుతుంది. సంగారెడ్డి పరిధిలో కాస్తా తక్కువ ఉల్లిసాగు ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. పండరీపూర్ నుంచి తెచ్చుకుంటున్నాం గతంలో సబ్సిడీపై ఉల్లి విత్తనాలు ఇచ్చేవారు. దాంతో మాకు ఎంతో సౌలత్ ఉండేది. రెండుళ్లుగా సబ్సిడీ విత్తనాలు ఇస్తలేరు. అధికారులను అడిగితే సర్కారు నుండి రావడం లేదని చెప్తున్నారు. చేసేదిలేక పండరిపూర్‌కు వెళ్లి పంచగంగ విత్తనాలు రూ.1500 చొప్పున తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇక్కడ కొనాలంటే రూ. 2 వేలకు కిలో ఇస్తున్నారు. అధికారులు, నాయకులు రైతులకు న్యాయం చేయాలి. రైతులను ఆదుకోకపోతే ఎలా? కిలోకు వెయ్యి మిగిలినా మాకు రెండు కలుపుల ఖర్చు ఎల్లుతుంది. –శివాజిరావు పాటిల్, మాయికోడ్ సబ్సిడీ అంశం మా పరిధిలోది కాదు రైతులకు సబ్సిడీపై మేం రెండేళ్ల క్రితం వరకు ఉల్లితోపాటు ఇతర కూరగాయ విత్తనాలు అందించాం. ప్రస్తుతం ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం లేదు. దీంతో రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించలేకపోతున్న మాట వాస్తవమే. సబ్సిడీపై ఉల్లి విత్తనాలు అందించాలని చాలా మంది రైతులు మాకు విన్నవిస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. –సునీత, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సబ్సిడీ విత్తనాలివ్వాలి ప్రభుత్వం ఉల్లి సాగు చేస్తున్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా సాగుచేస్తున్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇస్తే మాకు కాస్త పెట్టుబడి భారం తగ్గడంతోపాటు ప్రభుత్వం అందించే విత్తనాలపై నమ్మకం ఉంటుంది. ఈ దిశగా అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. –సుభాష్‌రావు, రాణాపూర్ -
ఎర్రజొన్న రైతులపై కాల్పులకు పదేళ్లు
ఆర్మూర్ : ఆర్మూర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎర్రజొన్న రైతులపై పోలీసుల కాల్పుల ఘటన జరిగి నేటితో పదేళ్లు పూర్తయినా నాటి ఘటనను ఈ ప్రాంత ప్రజలు నేటికీ నెమరు వేసుకుంటున్నారు. అయితే నాటి ఎర్రజొన్న రైతులపై పోలీసు కాల్పులకు దారి తీసిన పరిస్థితులు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సరిదిద్దుతూ రైతులకు లాభం చేకూర్చే పనులు చేస్తూ వస్తోంది. ఎర్రజొన్న రైతులకు చెల్లించాల్సిన రూ. పది కోట్ల 83 లక్షలను టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించింది. మరో వైపు ఎర్రజొన్న రైతులను ఆదుకోవడంలో భాగంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది రాష్ట్ర ప్రభుత్వం విత్తన వ్యాపారంలోకి అడుగు పెట్టి ఎర్రజొన్న రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చింది. ఇక నాటి ఉద్యమంలో మిగిలిన డిమాండ్ విత్తన విధానంపై మేధావులతో, రైతు నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఒక్క సమస్యను పరిష్కరిస్తే ఇక ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజొన్న రైతుల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడినట్లే. నాటి ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఆరు రోజుల పాటు ఆమరణ దీక్ష చేసిన ప్రస్తుత ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పోలీసు కాల్పులలో గాయపడిన రైతులను పరామర్శించడానికి వచ్చిన ప్రస్తుత సీఎం కేసీఆర్‌కు సమస్యపై పూర్తి అవగాహన ఉండడంతో పరిష్కార మార్గాలు చూపడంలో సఫలమవుతున్నారు. గతేడాది ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ఉద్యమం బాట పట్టడంలో ఎంపీ కవిత, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌లు సీఎం కేసీఆర్‌తో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా ఎర్రజొన్నల కొనుగోలును ప్రారంభించారు. జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఐదు లక్షల 4 క్వింటాళ్ల ఎర్ర, తెల్ల జొన్నలను కొనుగోలు చేశారు. గిట్టుబాటు క్వింటాలుకు ధరను రూ. 2,300 ప్రకటించడంతో రైతులు పంటను ప్రభుత్వానికి విక్రయించారు. ఏం జరిగిందంటే.. ఆర్మూర్ ప్రాంతంలోని సుమారు 25 వేల రైతు కుటుంబాలు ఎర్రజొన్నలను పండించారు. సీడ్ వ్యాపారులు సిండికేట్‌గా మారి ప్రతి ఏడాది రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేస్తుండడంతో ఈసారి క్వింటాలుకు రూ. 1,540 చెల్లించాలని రైతులు ఉద్యమించారు. ఆ ధర చెల్లించడానికి ఆర్మూర్ మండలం అంకాపూర్‌కు చెందిన గోదావరి హైబ్రీడ్ సీడ్స్ కంపెనీ యజమాని మహిపాల్‌రెడ్డి ముందుకు వచ్చాడు. దీంతో సీడ్ వ్యాపారి డిమాండ్ మేరకు ఈ ప్రాంతంలో పండించే ఎర్రజొన్న విత్తనాలన్నీ మహిపాల్‌రెడ్డికే అమ్మాలని కలెక్టర్ సమక్షంలో రాత పూర్వక ఒప్పందం కుదిర్చారు. రైతులు పండించిన సుమారు 5 లక్షల 11 వేల క్వింటాళ్ల ఎర్రజొన్నలను సీడ్ వ్యాపారి స్వాధీనం చేసుకున్నారు. 2 లక్షల 3 వేల క్వింటాళ్లకు మాత్రమే రూ. 1,540 క్వింటాలు చొప్పున రైతులకు రూ. 32 కోట్లు చెల్లించాడు. అనంతరం ఎర్రజొన్నలు ఢిల్లీ మార్కెట్లో అమ్ముడుపోకపోవడం, వ్యాపారికి బ్యాంకు రుణం రాకపోవడంతో రైతులకు చెల్లించాల్సిన రూ. 46 కోట్లు చెల్లించలేనని చేతులు ఎత్తేశాడు. దీంతో ఆగ్రహించిన రైతులు పలుమార్లు ఉద్యమాలు చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష చేపట్టారు. 2008 జూన్ 16న 44వ, 63వ జాతీయ రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చారు. రైతులు వేల సంఖ్యలో ఆర్మూర్‌కు తరలి రావడంతో ఉద్యమం అదుపు తప్పి హింసాయుతంగా మారింది. ఆందోళనకారుల ఆగ్రహం తారాస్థాయికి చేరడంతో సీడ్ వ్యాపారులు మహిపాల్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి ఇళ్లపై దాడులు చేసి ఇళ్లు తగలబెట్టారు. మూడు ప్రభుత్వ వాహనాలకు నిప్పంటించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రైతులను నియంత్రించడానికి గాలిలో కాల్పులు జరిపారు. కాల్పుల్లో నలుగురు రైతులు గాయపడ్డారు. వేల్పూర్ మండలం పడగల్‌కు చెందిన ఏనుగు శేఖర్‌కు బుల్లెట్ గాయమైంది. ఈ ఘటనతో దిగివచ్చిన ప్రభుత్వం ఏపీ సీడ్స్ కార్పోరేషన్ ద్వారా ఎర్రజొన్నలు కొనుగోలు చేయించడానికి నిర్ణయించి ఉద్యమాన్ని విరమింపజేసింది. సీడ్ వ్యాపారి నుంచి సుమారు మూడు లక్షల క్వింటాళ్ల ఎర్రజొన్నలను స్వాధీనం చేసుకొని క్వింటాలుకు రూ. 1,200 చొప్పున రైతులకు రూ. 35 కోట్లు చెల్లించింది. ఏపీ సీడ్స్ ఎర్రజొన్నలు అమ్మగా వచ్చిన లాభాన్ని రైతులకు తిరిగి చెల్లించాల్సి ఉంది. లేని పక్షంలో సీడ్ వ్యాపారిపై న్యాయ పరమైన చర్యలు తీసుకొని బకాయిలు రాబట్టి రైతులకు 2008 ఆగస్టు నెలాఖరులోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏపీ సీడ్స్ వారు ఎర్రజొన్నలు విక్రయించగా లాభాలు రాకపోవడంతో సుమారు రూ. 10 కోట్ల 83 లక్షలు బకాయిలు అలాగే ఉండిపోయాయి. ఈ బకాయిలను ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు చెల్లించింది. -
సవాళ్ల..సాగు షురూ..!
ఏరువాక సాగరోరన్నా..రైతన్నా అంటూ పాడుకునే రోజులు పోయి...ఈ పోరు బతుకు ఎన్నాళ్లోరన్నా...పుట్టెడు కష్టం తీర్చేదెవరన్నా అని అన్నదాతలు గగ్గోలు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాంప్రదాయ బద్ధంగా ఏరువాక పున్నమినాడు పొలంపనులకు చలోచలో అంటూ అరకలతో వారు ఉరకలు పెడుతున్నా పంట చేతికొచ్చే నాటికి ఎలా ఉంటుందోననే బెంగే రైతులను వెన్నాడుతోంది. అయినా వ్యవసాయి..శ్రమసాయి కాబట్టి బాధలను దిగమింగుకొని మరో సాగు ఉద్యమానికి సిద్దపడుతున్నాడు. ఆశల పంటకు ఉపక్రమిస్తున్నాడు. పాలమూరు : ఏరువాక పౌర్ణమి వచ్చిందంటే పల్లెల్లో ఏటా అన్నదాతలు ఆనందంగా పండుగ జరుపుకునే వా రు.. పంటల పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ఎంతో ఘనంగా నిర్వహించే ఏరువాక ఆనందం ఎక్కడా కనిపించడం లేదు. ప్రతికూల పరిస్థితులతో సతమతమవుతున్న అన్నదాతలను పెనుసవాళ్లతో సమీపిస్తున్న ఖరీఫ్ భయపెడుతోంది. రైతుల ఆశలు అన్ని విధాలా ఆవిరవుతున్నాయి... వారి పట్ల అండగా ఉండాల్సిన పాలకులు.. రైతు సంక్షేమాన్ని విస్మరిస్తుండటంతో ఏరువాక కాస్తా... పోరు వాకగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. పెరిగిన పంటసాగు వ్యయం.. వాతావరణ ప్రతికూల పరిస్థితులు.. పూర్తికాని సాగునీటి ప్రాజెక్టులు వెరసి.. వ్యవసాయానికి ఈ ఏడాది సంకట పరిస్థితులు తెచ్చిపెట్టేలా ఉన్నా యి. పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలే కాకుండా పంటల సాగు వ్యయం కూడా పెరగడంతో పంటల సాగుపై జిల్లా వ్యాప్తంగా రూ.400 కోట్లు అదనపు భా రం పడనుంది. ఇందులో కేవలం ఎరువుల ధరలపైనే రూ.250 కోట్ల వరకు ఖర్చు కానుంది. సాగు వ్యయంతోపా టు, విత్తనాల ధరలు కూడా పెరగడం వల్ల వీటికోసం రూ.150 కోట్ల వరకు వెచ్చించక తప్పదు. పస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏరువాకకు ముందే జిల్లాలోని రైతులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అలా అని ఎండలకు కాదు.. పెరిగిన ఎరువుల ధరలను, సాగు నీటి వనరులు కల్పించకపోవడంతో... గతేడాదితో పోల్చితే ప్రస్తుతం ఎరువుల ధరలు రెట్టింపు కాగా సాగునీటిని ఖరీఫ్ నాటికి అందిస్తామని ప్రకంటిచినప్పటికీ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం పనులు వేగవంతం చేయడంలేదు. వెరసి ఖరీఫ్‌ను రైతులు కన్నీటితోనే ప్రారంభించనున్నారనేది స్పష్టమవుతోంది. సాగునీరు అనుమానమే..? జిల్లాలో సాగునీరందకపోవడం, వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోత కారణంగా పంటసాగుపై రైతాంగం దృష్టి నిలపడంలేదు. రైతులకు మేలు చేస్తామని, వచ్చే ఖరీఫ్ సీజన్‌కల్లా సాగునీటి ని అందిస్తామని పాలకులు ప్రకటించినప్పటికీ అది మూడేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టుల పనులు ఎక్కడా పూర్తికాలేదు. దీంతో ఖరీఫ్‌సాగుకు నీరందే పరిస్థితులు కనబడటంలేదు. మరోవైపు ఇప్పటికే ఎరువుల ధర లు రెట్టింపు కాగా సీజన్ ముగిసే నాటికి ఎంతమేరకు పెరుగుతాయో చెప్పలేమని వ్యవసాయ శాఖ చెబుతోంది. రైతు కష్టం వృథా...! రైతు కష్టం వృథా అవుతోంది. పెట్టిన పెట్టుబడి, తినేందుకు గింజలు దక్కితే చాలని మాత్రమే భావించాల్సి వస్తోంది. పంట పూర్తయ్యే నాలుగు నెలల పాటు రైతుతో పాటు వారి కుటుంబ సభ్యులు పడే శ్రమ ఖర్చు నెలకు రూ.12వేల వంతున పంటకాలంపూర్తయ్యే వరకు రూ.48వేలవుతుంది. ఆ మొత్తం కూడా అందక రైతులు నష్టపోవాల్సి వస్తోంది. పంటల సాగు ఖర్చు ఇలా.. వరిసాగు చేసే రైతు ఎకరాకు పొలాన్ని దున్నుకునేందుకు, ట్రాక్టర్, కూలీ ఖర్చు రూ.4500, ఎరువులు, రసాయనిక మందులకు రూ.4వేలు, విత్తనాలకు రూ.1600 నాట్లు, కలుపులు, ఇతర అవసరాలకు రూ.4వేలు, కోతకు, నూర్పిడి, ఇతర అవసరాలకు రూ.రెండువేలు ఖర్చవుతుంది. వరిపంట దిగుబడి ఎకరాకు 18 క్వింటాళ్లు రావాల్సి ఉండగా, సరాసరిన 10 నుంచి 14 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. ఈ లెక్కన ఎకరాలకు రూ.10 నుంచి రూ.14వేల వరకు ఆదాయం వస్తోంది. పత్తి పంట సాగుకోసం.. ఎకరా భూమిని చదును చేసేందుకు రూ. 3000,విత్తనాల ఖర్చు రూ.వెయ్యి, కూలీ లు, కలుపు తీసేందుకు, పత్తిగింజలు తీసేందుకు,ఇతర అవసరాల కోసం పం ట మొత్తానికి రూ.17 నుంచి రూ.20 వేలు వరకు ఖర్చవుతుంది. ఖర్చులు పోను ఎకరాకు ఆదాయం రూ.45 నుంచి రూ.55వేల వరకు వస్తోంది. వేరుశనగ.. ఎకరా పంటసాగుకు విత్తనాలకు రూ.ఐదువేలు, దున్నేందుకు రూ.3వేలు, కలుపు తీసేందుకు రూ.3వే లు, ఎరువులకు రూ.4వేలు, కోతకు రూ.3వేలు ఖర్చవుతుంది. ఎకరాకు 18 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా, జిల్లా పరిస్థితుల దృష్ట్యా.. సరాసరిన 10 నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది, ఎకరా వేరుశనగ పంటకు వచ్చే ఆదాయం రూ.35వేల నుంచి రూ.42వేల వరకు ఉంటుంది. మొక్కజొన్న సాగుకోసం.. ఎకరా పొలాన్ని దున్నేందుకు రూ.3వేలు, విత్తనాలు రూ.2500, విత్తేందుకు రూ. మూడు వేలు ఖర్చవుతుంది. ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. మొక్కజొన్న పంటకు ఎకరా ఆదాయం రూ.15వేల వరకు వస్తోంది.