seemandhra student jac
-
చిరంజీవికి ‘సమైక్య’ సెగ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రి చిరంజీవికి ‘సమైక్య’ సెగ తాకింది. రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ సీమాంధ్ర విద్యార్థి జేఏసీ సోమవారం ఆయన నివాసాన్ని ముట్టడించింది. వేకువజామున మూడు గంటల నుంచి అక్కడే తిష్టవేసి విద్యార్థులు జేఏసీ నేత అడారి కిశోర్ నేతృత్వంలో పళ్లు తోముతూ, షేవింగ్ చేసుకుంటూ, స్నానాలు చేస్తూ నిరసన తెలిపారు. చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆయన నివాసంలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. గేట్లు ఎక్కి, చిరంజీవి బయటకు రావాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల దురుసు ప్రవర్తనకు నిరసనగా చైతన్య అనే విద్యార్థి కిరోసిన్‌ను తలపై పోసుకుని నినాదాలు చేశాడు. కిరోసిన్ అతడి నోట్లోకి, ముక్కులోకి వెళ్లడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా, నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. దుస్తులు వేసుకునేందుకైనా పోలీసులు అవకాశమివ్వలేదు. సీమాంధ్ర మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ జోక్యంతో రాత్రి 8గంటలకు వారిని విడిచిపెట్టారు. -
చిరంజీవి నివాసం ఎదుట సమైక్య నిరసన
-
'అల్లూరి గడ్డపై జన్మించిన మూర్ఖుడు చిరంజీవి'
న్యూఢిల్లీ: మంత్రి పదవిని కాపాడుకోవడానికి చిరంజీవి సమైక్యాంధ్రను తాకట్టు పెట్టాలరని సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు ఆరోపించారు. రెండు వారాల మంత్రి పదవి కోసం ఆయన పాకులాడుతున్నారని మండిపడ్డారు. నీకు పర్యాటకు శాఖ అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాకు రూ. 500 కోట్లకు అమ్ముడు పోయారని ఆరోపించారు. ఇంకా ఎన్ని కోట్లు సందిస్తావు అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. అల్లూరి సీతారామరాజు లాంటి పోరాట యోధుడు జన్మించిన గడ్డపై జన్మించిన మూర్ఖుడివి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పది కోట్ల తెలుగువారికి ద్రోహం చేసిన ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. సొంత జిల్లాలో అడుగు పెడితే ప్రజలు నీ కాళ్లు విరగ్గొడతారంటూ విమర్శించారు. కాగా, ఓ యువకుడు ఒంటిపై కిరోసిన పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
చిరంజీవి నివాసం ఎదుట సమైక్య నిరసన
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి చిరంజీవి నివాసం ఎదుట నిరసనకు దిగారు. రోడ్డుపై స్నానాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకుగాను కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను నిరసిస్తూ సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఇంటిని ముట్టడించారు. -
'విభజనతో మూడు ప్రాంతాలకు నష్టం'
కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తుందని సీమాంధ్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ కిషోర్ బుధవారం న్యూఢిల్లీలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. విభజన వల్ల ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం జంతర్‌మంతర్ వద్ద న్యూఢిల్లీలో చేపట్టిన ధర్నాకు ఆయన తన సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ప్రాంతంలో విద్యార్థి జేఏసీ క్రియాశీలకంగా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇటీవలే ఆ విద్యార్థి జేఏసీ నాయకులు న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలసి విజ్ఞప్తి చేస్తున్న విషయం విదితమే.