seetaramaswamy temple
-
సింహాచలం కొండపై నేలకొరిగిన ధ్వజస్తంభం
సాక్షి,విశాఖపట్నం: సింహాచలం కొండపైఉన్న సీతారామ ఆలయంలోని ధ్వజస్తంభం అర్థరాత్రి అకస్మాత్తుగా నేలకొరిగింది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి కర్ర పాడై పోవడంతో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. ఆలయ సాంప్రదాయరీతిలో ధ్వజస్తంభం పునః ప్రతిష్ట చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఉద్యోగి కాలర్ పట్టుకున్న డీఎస్పీ..
భద్రాచలం: విధి నిర్వహణలో ఉన్న ఆలయ సిబ్బందిపై డీఎస్పీ వీరేశ్వరరావు అకారణంగా దాడి చేశారంటూ ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఉద్యోగులు నిరసనకు దిగారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆలయ సిబ్బంది.. డీఎస్పీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలయంలో భక్తులు వెళ్లే మార్గం పక్కనే సిబ్బంది టికెట్లు విక్రయిస్తుండడంతో దారికి అడ్డంగా ఉన్నందుకు ఓ ఉద్యోగి కాలర్ పట్టుకుని డీఎస్పీ కొట్టినట్టు వారు ఆరోపిస్తున్నారు.