సీఆర్పీఎఫ్ స్థాపరంపై గ్రెనేడ్ దాడి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో మరోసారి గ్రెనేడ్ దాడి జరిగింది. సీఆర్పీఎఫ్ స్థావరంపై తీవ్రవాదులు దాడిచేసినట్టు తెలుస్తోంది. శ్రీనగర్ పట్టణంలోని సేకిదఫర్ లోని పోలీసు బంకర్ దగ్గర ఈ గ్రెనేడ్ పేలుడు సంభవించింది. దీంతో స్థానికంగా ఉద్రిక్తతను రాజేసింది. అయితే ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు. రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.