జిల్లాలో మరిన్ని సెల్‌టవర్లు
నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో మరిన్ని సెల్‌టవర్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు నాణ్యమైన సేవలందించేందుకు కృషిచేస్తున్నామని బీఎస్ఎన్ఎల్ జిల్లా టెలికాం జనరల్ మేనేజర్ ఎంఏ సిద్ధిఖీ తెలిపారు. సోమవారం‘న్యూస్‌లైన్’ తో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 2జీ సెల్‌టవర్లు 201 ఉన్నాయని, అదనంగా 2జీ సెల్‌టవర్లు 66 మంజూరైన ట్లు చెప్పారు. డిమాండు, సిగ్నల్ సక్రమంగా లేని ప్రాంతాలు, కనెక్షన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పట్టణ ప్రాంతాలకు 3జీ సేవలు ...
ఇప్పటి వరకు జిల్లా కేంద్రానికే పరిమితమైన 3జీ సేవలు, ఇకపై కామారెడ్డి, బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్ పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తున్నామని చెప్పారు. జిల్లా కేంద్రంలో 3జీ సెల్‌టవర్లు 18 ఉన్నాయని తెలిపారు. కొత్తగా 3జీ సెల్‌టవర్లు 36 మంజురైనట్లు ఆయన తెలిపారు.
రీ కనెక్షన్ మేళాకు అపూర్వ స్పందన ...
జిల్లావ్యాప్తంగా గత నెల 18 నుంచి నిర్వహిస్తున్న బీఎస్ఎన్ఎల్ రీ కనె క్షన్ మేళాకు అపూర్వ స్పందన వచ్చిందని జీఎం తెలిపారు. కార్యక్రమంలో 62 బ్రాడ్‌బాండ్ కనెక్షన్లు, 743 ల్యాండ్‌లైన్ కనెక్షన్లు, 1200 మెబైల్ కనె క్షన్లు ఇవ్వటం జరిగిందన్నారు. సంస్థకు బకాయి పడ్డ వినియోగదారుల నుంచి రూ.6 లక్షలు వసూలు చేయటం జరిగిందన్నారు. రీ కనెక్షన్ మేళాలు ప్రస్తుతం కస్టమర్ కేర్ సెంటర్లలో మరో 15 రోజుల పాటు పొడిగించటం జరిగిందని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీఎం కోరారు.