‘క్షణికోద్రేక’ వంటకానికే గిరాకీ!
స్వీయ అభినందనకు సావకా శం ప్రతి పరిశ్రమకూ ఉండా ల్సిందే! ఇతరులెవరూ గౌరవిం చడానికి ఉత్సాహం కనబరచ నప్పుడు అది మరింత తప్పసరి అవుతుంది. పురస్కారాలతో ఏటేటా తమను తాము గౌరవిం చుకునే సంప్రదాయానికి పునా దులు హాలీవుడ్ సినిమా పరిశ్ర మలో ఉన్నాయి. 19వ శతాబ్దం చివరినాళ్లలో బ్రహ్మచర్యా న్ని ఒక ఆదర్శంగా ప్రజాబాహుళ్యంలో వ్యాప్తి చేసేందుకు లోక రీతికి భిన్నంగా ఆలోచించే ఓ కోటీశ్వరుడు సృష్టిం చిన హాలీవుడ్ చివరకు ఆ ఆదర్శానికి విరుద్ధంగా నడు చుకున్న సంగతి తెలిసిందే. మంచి ఉద్దేశాలు మంచి ఫలి తాలకే దారితీయవలసిన అవసరం లేదని ఈ దృష్టాంతం స్పష్టం చేస్తున్నది.
హాలీవుడ్ పెరిగి పెద్దదై తారలతో, సెక్స్‌తో, మద్యం తో తనను తాను గౌరవించుకునే దశకు చేరుకున్నాక, సినిమా కళారూపానికి గుర్తింపుగా ఏదైనా ఒక చిహ్నాన్ని రూపొందించి తన ఉనికికి శాశ్వతత్వాన్ని ఆపాదించుకోవా లని యోచన చేసింది. కొంత కాలానికి ఆ యోచన ఫలించి స్త్రీ మూర్తి రూపంలో ఆస్కార్ అవార్డు రూపుతీసుకుంది. ఆస్కార్ శిల్పాకృతికి తరువాతి కాలంలో మరెన్నో నకలు ప్రతులు పుట్టుకొచ్చాయి. శిల్పాలకు పిల్ల శిల్పాలే పుడతా యని సామెత. సినిమా కళ పుట్టే నాటికి ఏ ఒక్క అవార్డు మనుగడలోలేకపోవడం ఎంత నిజమో, ఈ రోజున లెక్క కు మిక్కిలి అవార్డులు తామరతంపరగా పుట్టుకురావడం కూడా అంతే నిజం.
సృజనాత్మకతలో హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోని పాత్రికేయవృత్తి ఇన్నేళ్లు గడచినా, ఉత్తమ వార్తా కర్మాగా రాలకు అవార్డును నెలకొల్పకపోవడం ఆశ్చర్యకరం. పత్రి కలకు అనంతంగా ప్రకటనలను విడుదల చేసి ప్రాచు ర్యంలోకి వచ్చే రాజకీయ నాయకులకు కూడా అవార్డు లేక పోవడం విచిత్రం. జర్నలిజం అవార్డులకు పోటీ చేసేవారి సంఖ్య పరిమితంగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్య మైన రాజకీయ పార్టీలకు డజనుకు మించి పోటీదారులు ఉండే అవకాశం లేదు. వీరిలో అత్యధికులు అధికారిక అభ్యర్థులే అయి ఉంటారు. కాని పోటీ నియమాలు వర్తిం చని ప్రముఖులు కొందరైనా ఉంటారు. అధికారంలో ఉన్న వారికి సన్నిహితుడు కావడం మూలంగానో, ఇంతకు ముందు ఉన్న వృత్తిలో తెచ్చుకున్న పేరు మూలంగానో వారు పోటీలో గెలుపునకు చేరువగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఇంగ్లిష్ భాషను ఔపోసన పట్టిన హాస్యరచయిత పి.జి. ఉడ్‌హౌస్ మాటల్లో చెప్పాలంటే మొదటివారు సంతుష్టులు... రెండోవారు అసంతుష్టులు.
పాత్రికేయులకు, రాజకీయ నేతలకు ఇచ్చే అవార్డు లను ఉత్తమ ఏకవాక్య వ్యాఖ్యకు ఇచ్చే అవార్డుతో ప్రారం భించవచ్చు. క్రమంగా ఈ అవార్డుల సంఖ్యను పెంచుతూ పోవచ్చు: ఉద్దేశించని పరిణామాల సూత్రానికి ఉత్తమ ఉదాహరణ; రాజ్యసభ సీటు అన్వేషణలో ఉత్తమ వృద్ధ ప్రముఖుడు; ఆంగ్లానువాదంలో అర్థం అనర్థమైపోయిన ఉత్తమ హిందీ యాస మాట. ముచ్చటగా మరికొన్ని ఇదే అదనుగా ఉదహరిస్తాను. అవార్డులు ఇవ్వడానికి అనుగు ణమైన సందర్భాలు నా కంటికి చాలా కనిపిస్తున్నాయి: ఇంగ్లిష్ వ్యాకరణానికి, భారతీయ అర్థానికి మధ్య పొసగని ఉత్తమ భాషా ప్రయోగం; ట్విట్టర్‌కు ఉన్న పరిమితులకు లోబడి చేసిన ‘చెత్త’ వక్రీకరణ; పొగడ్తల పుణ్యమా అని కాలుజారి కిందపడిన ఉత్తమ విన్యాసం; మైనారిటీల ఓట్లను దండుకునే పోటీలో మేలిరకం స్వీయ ఓటమి; రేపటినాడు మిత్రుడయ్యే అవకాశం ఉన్న ఈ నాటి శత్రు వును దూషించడంలో సృజనాత్మక అభివ్యక్తి. ఈ అవార్డుల ఉత్సవాలను నిర్వహించడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చే స్పాన్సర్లకు కూడా కొదవ ఉండదు. ఎందుకంటే అవార్డుల బహుకరణ ఘట్టం ప్రేక్షకులకు చాలినంత వినోదాన్ని పంచిపెడుతుంది.
రాజకీయ నాయకులు ఈ అవార్డులు తీసుకునేం దుకు ముందుకువస్తారా అనే సందేహం సంశయవాదు లకు కలిగితే నేను ఆశ్చర్యపోను. అవార్డు గ్రహీత అవా ర్డును తీసుకున్నాక ముక్తసరిగా పలికే పలుకుల్లో పార్టీ అధినాయకినో, సతీమణినో, స్త్రీ అయితే పతిదేవుడినో, జన్మనిచ్చిన తల్లిదండ్రులనో, తనకు ప్రసంగాలు రాసిపెట్టే ఘోస్ట్ రైటర్‌నో, ఓటరు మహాశయులనో లేదా అంతి మంగా ఈ అవార్డు ప్రహసనాన్ని కలలో గని కనిపెట్టిన తెలివైన మిత్రుడినో తలచుకుని కృతజ్ఞతలు చెప్పకపోతే ఆడిటోరియం లోపలా బయటా ఉన్న ప్రేక్షకులు అచ్చెరు వొందకమానరు. సంశయవాదులు ఎప్పుడూ తప్పులో కాలేస్తుంటారు. రాజకీయ నాయకులు వారికన్నా తెలివైన వారు. 90 శాతం టీవీ వీక్షకులు అవార్డు ఎవరికి వచ్చిం దనేది మాత్రం గుర్తుంచుకుంటారు తప్ప ఎలా వచ్చిందో గుర్తుంచుకోరనే సంగతి మన రాజకీయ నాయకులకు బాగా తెలుసు.
అవార్డు తీసుకునేందుకు రాజకీయ నాయకులు బహుశా ఒక షరతు విధించవచ్చు. తమకు అవార్డులు ప్రదానం చేసేవారు సినిమా తారలను పోలిన ప్రముఖులై ఉండాలని, వారు తమ రంగంలో డిమాండ్ కలిగి ఉండా లని, సినిమా తారలే అయితే భారీ చిత్రాలలో అవకాశాలు పొందే వారై ఉండాలని వారు కోరుకుంటారు. ఓ విధంగా ఇది ఆమోదయోగ్యమైన షరతే! అవార్డు ప్రదానానికి ఆహ్వానం పొందే ప్రముఖుల్లో ఒకవేళ అమితాబ్ బచ్చన్ అందుబాటులో లేకుంటే, కత్రినా కైఫ్ తీరికలేకుండా ఉంటే మరెవైరనా పరవాలేదు. కేవలం కళాత్మక, లోబడ్జెట్ సినిమాలకు పరిమితమైన వారి నుంచి అవార్డు పుచ్చుకో వడం ఎవరికీ ఇష్టం ఉండదు. ఎందుకంటే అది నిష్ఫలం. అంతకన్నా ఘోరం మరొకటుంది. అది రాజ్‌బబ్బర్ ముఖాన నవ్వు పులుముకొని శత్రుఘ్నసిన్హాకు అవార్డు ఇవ్వడం, అందుకు ప్రతిగా శత్రుఘ్నసిన్హా రాజ్‌బబ్బర్‌కు అవార్డు ఇవ్వడం. వీరిద్దరూ రాజకీయ నాయకులే కావడం ఇక్కడ గమనార్హం. దిగ్విజయ్‌సింగ్, షకీల్ అహ్మద్ పబ్లిగ్గా ఒకరివీపు ఒకరు పరస్పరం గోక్కున్నా ఎవరికీ ఆసక్తి ఉండదు.
బహుమతులకే బహుమతిని తొందరగా వండే ఉత్తమ వంటకానికి రిజర్వ్ చేయాలి. ఇది అన్ని బహు మతులకన్నా ఉత్తమమైనది. కనురెప్పలు నిదర మత్తులో మూతపడి తెరుచుకునేలోగా ‘రసాలూరే’ మాటల వంట కం వండేవారికి ఈ అవార్డు బహుకరించాలి. పొద్దుపోని మధ్యాహ్నం వేళ తీరిగ్గా నాలుగు వాక్యాలను పేర్చేవారికి కాదు ఈ అవార్డు. స్వాభావికంగా వ్యక్తిగత స్థాయిలో కనబరిచే సామర్థ్యానికి ఈ పరీక్ష. వంటకం రుచిని బట్టి న్యాయమూర్తులు అవార్డు గ్రహీతను ఎంపిక చేయాలి. అది ఆరోగ్యానికి మేలు చేసేదా? చేటు చేసేదా? అనేది వారు పట్టించుకోకూడదు. తమ నలభీములు హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, జ్ఞానాన్ని సమపాళ్లలో జోడించి వండే తక్షణ వంటకం తిని బాధపడేది రాజకీయ నాయకులు తప్ప వేరొకరు కాదు. అటువంటి విలక్షణ ఆహారం దొరికే ఉత్తమ రెస్టారెంటు జర్నలిజమే అంటే అతిశయోక్తి కాదు. రాజకీయ నాయకులపై పాత్రికేయులకు భక్తిప్రపత్తులు ఉండటానికి కారణం ఇదే. తమకు తాముగా చేసుకున్న గాయాలతో రాజకీయ నాయకులు నెత్తురోడే వార్తలకే గిరాకీ అధికం. టీవీ తెరపై ఈ హంగామా అంతా చూస్తూ ప్రేక్షకులు నవ్వే నవ్వు ఉచితమే కాదు, అది ఇతరులకు అంటుకుంటుంది కూడా.
సోషల్ మీడియా హాట్‌కేక్ అంత పాపులర్ కావడం తో దానితో పోటీపడే క్రమంలో ‘ఫాస్ట్‌ఫుడ్’ తయారు చేసే కోరికను అణచుకోలేకపోవడమే తాము విధించుకున్న ఉన్నత ప్రమాణాల నుంచి వంటలరాయుళ్లు జర్రున జారి పోవడానికి కారణం. సోషల్ మీడియా నగ్నత్వం లాం టిది. సూటైనది. అది ఏదీ దాచుకోదు. ఏ వ్యాఖ్య అయినా 140 అక్షరాలకు మించితే అది అసాంఘికమైనదిగా పరి గణించే కాలంలో మనం ఉన్నాం. సంభాషణను ఇవాళ అవగాహన కోసం కాక ఆరోపణకు ఉద్దేశిస్తున్నాం. టీవీ తెరపై సాగే సంభాషణ పర్వం సంక్షిప్తతకు, ఉన్మాదానికి మధ్యన వారధి కడుతున్నది. అంతకన్నా ఎక్కువ ఆశించే వారిని విసుగు అనే చెత్తబుట్టలోకి విసిరేస్తున్నాం. ఇందుకు పాత్రికేయులను తప్పుపట్టి ప్రయోజనం లేదు. వీక్షకుడు కోరుకుంటున్నది ఇదే, పొందుతున్నది కూడా ఇదే. అత్య ధిక ప్రభావం చూపే అతి కురచ వాక్యానికి, ఆ వాక్యం రాసిన వాడికి తప్పనిసరిగా ‘లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు’ ఉండాలి. ఈ అవార్డు కింద ఆస్కార్ వంటి శిల్పా న్ని బహుకరించడం అంత సమంజసంగా ఉండదు. కాబట్టి దానికి బదులు ‘పట్టుకారు’ ఇవ్వడం మంచిది!