Senior Minister
-
నయీమ్ కేసులో మంత్రాంగం!
- సీనియర్ మంత్రిని రంగంలోకి దించిన ‘నయీమ్ ఖాకీలు’ - ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటానని వారికి మంత్రి హామీ సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు తదుపరి చర్యల నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. నయీమ్‌తో లింకులపై మౌఖిక విచారణ, క్రిమినల్ కేసుల నుంచి బయటపడేందుకు ఓ రిటైర్డ్ డీజీపీ ద్వారా ఒత్తిడి తేవాలనుకున్నా అది బెడిసికొట్టడంతో తాజాగా కులంకార్డును తెరపైకి తెచ్చారు. ఈ కేసులో సామాజికవర్గపరంగా కేవలం తమను మాత్రమే టార్గెట్ చేసి మిగతా అధికారులను మైనర్ పనిష్మెంట్లతో సరిపెట్టి కాపాడారని ఆరోపిస్తూ ఓ సీనియర్ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమను గట్టెక్కించాలని ఆరుగురు అధికారులు మంత్రిని కలసి వేడుకున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీజీపీయే టార్గెట్... ఉమ్మడి రాష్ట్రంలో, స్వరాష్ట్రంలోనూ ఇప్పటివరకు తమ వర్గం అధికారులను ఏ ప్రభుత్వం టార్గెట్ చేయలేదని, చేసేందుకు కూడా ప్రయత్నించలేదని ఆరోపణలెదుర్కుంటున్న అధికారులు బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇదే తరుణంలో డీజీపీ అనురాగ్ శర్మపైనే ఫిర్యాదు చేయాలని సీనియర్ మంత్రికి సంబంధిత అధికారులు సూచించారని తెలిసింది. నయీమ్ కేసులో ఎనిమిది నెలల నుంచి చర్యలకు సాహసించని డీజీపీ ఒకేసారి ఇంత మంది అధికారులపై వేటు వేయడం వెనకున్న అసలు నిజాలు బయటకు రావాలని మంత్రి భావిస్తున్నారని తెలిసింది. దీనంతటికీ ప్రధాన కారణంగా ఉన్న డీజీపీ అనురాగ్ శర్మపై నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేయాలని సీనియర్ మంత్రి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సస్పెండ్ అయిన ఐదుగురిలో ముగ్గురు, విచారణ ఎదుర్కోనున్న మరో ముగ్గురు అధికారులు ఒకే సామాజికవర్గం వారు కావడంతో సీఎం వద్దే తేల్చుకుంటానని మంత్రి వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
ఏం ఇప్పుడే నోరు లేస్తోందేం?
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! ఓ సీనియర్ మంత్రి... దర్జాగా కారులో ఇంటికి బయలు దేరారు. ఇంటికి వెళ్లగానే రిలాక్సింగ్ చెయిర్ లో కూర్చుని ఏసీ గాలికి చల్లబడుతున్నారు. ఫోను మోగింది. మంత్రిగారు ఎత్తారు. ‘‘ఏవండీ! మా బామ్మర్దిని ట్రాన్స్ ఫర్ చేయిస్తామన్నారు. ఆరు నెలలు దాటిపోయింది. ఎప్పుడువుతుంది సార్?’’ అవతలి కంఠం ఫోనులో ఆరా తీసింది. మంత్రిగారికి మండుకొచ్చింది. ‘‘పిచ్చ పిచ్చగా ఉందా? అయినప్పుడు అవుతుంది. అయినా ఆ జగన్ మోహన్ రెడ్డిపై కేసులు ఉంటే ఏనాడైనా మాట్లాడావా నువ్వు? ఇప్పుడు గొంతు లేస్తోందేం నీకు?’’ అని ఫోను పెట్టేశారు. పనిమనిషి చల్లటి ద్రాక్షరసం తెచ్చి ఇచ్చింది. ద్రాక్షరసం తాగుతూ ఆలోచనలో పడ్డారు. పనిమనిషి ధైర్యం తెచ్చుకుని.. ‘‘అయ్యగారూ... ఏడాది క్రితమే జీతం పెంచుతామన్నారు. ఈ నెల అయినా...?’’ అని దయనీయంగా అడిగింది. మంత్రికి మళ్లీ కోపం వచ్చింది. ‘‘ఎప్పుడు పెంచాలో నాకు తెలుసు. అయినా ఆ జగన్ మోహన్ రెడ్డిపై కేసులు ఎందుకున్నాయని ఎప్పుడైనా అడిగావా నువ్వు? నన్ను అడగడానికి మాత్రం నోరు లేస్తుందా?’’ అని జాడించేశారు. పనిమనిషి బిక్క చచ్చిపోయింది. ఓ గంట సేపు అలాగే కూర్చుని వరండాలోకి వెళ్లారు మంత్రిగారు. చాలా కాలం తర్వాత చూడ్డం చేత పెంపుడు కుక్క ఒక్కసారిగా మొరిగింది. మంత్రి సీరియస్ అయిపోయారు – ‘‘దొంగముండా... పీకల దాకా మాంసం దబ్బుకు తిని నామీదే అరుస్తావా? ఏం ఆ జగన్‌ని చూసి ఎప్పుడైనా మొరిగావా?’’ అని కోపంగా దాని తలని కాలితో తన్నబోయారు. అపార్థం చేసుకున్న కుక్కగారు అమాంతం మంత్రిగారి పిక్క పట్టి కరిచేసింది. మంత్రిగారి అరుపులకు సతీమణిగారు వచ్చారు. అప్పటికే మంత్రిగారి కాలినుండి రక్తం బొట బొటా కారిపోతోంది. మంత్రిగారిని కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు సతీమణిగారు. డాక్టర్ వెంటనే రేబిస్ రాకుండా ఇంజక్షన్లు పొడిచేశారు. మంత్రిగారు కాస్త కుదుట పడ్డారు. మంత్రి చిరునవ్వును చూసి ధైర్యం తెచ్చుకున్న డాక్టర్ ‘‘సార్! మా కార్పొరేట్ ఆసుపత్రికి స్థలం ఇస్తామన్నారు. లాంఛనాలన్నీ పూర్తి చేశాం. ఆపని కొంచెం తొందరగా... చేతులు నులుముకుంటూ నసిగారు. మంత్రి గారికి కోపం నషాళానికి అంటింది. ఆ జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడైనా నిలదీశావా నువ్వు? మమ్మల్ని మాత్రం నిలదీస్తావా?’’ అని అగ్గి ఫైర్ అయిపోయారు. డాక్టర్ మాట పడిపోయింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మంత్రిగారు ఇంటికి వెళ్లి నేరుగా బెడ్ రూమ్‌కి వెళ్లి పడుకున్నారు. అర్ధరాత్రి... నిద్రట్లో మాటలకు భార్యగారికి మెలకువ వచ్చింది. ‘ఏమయ్యా జగన్ మోహన్ రెడ్డిపై అన్ని కేసులు ఉంటే నన్ను విసిగిస్తావెందుకయ్యా’ అని కలవరిస్తున్నారు మంత్రిగారు. మంత్రిగారి భార్య కంగారు పడి ఫ్యామిలీ డాక్టర్‌కి ఫోను చేశారు.అంతా పూసగుచ్చినట్లు డాక్టర్‌కి వివరించారు. డాక్టర్ నవ్వేసి.. ‘‘ఏం ఫరవాలేదమ్మా... ఇది దానంతట అదే తగ్గిపోతుంది. కొద్ది రోజులు పార్టీ మీటింగ్‌లకు వెళ్లద్దని చెప్పండి’’ అని ధైర్యం చెప్పి వెళ్లిపోయారు. ఉదయాన్నే ట్రస్ట్ కార్యాలయం నుండి ఫోను... మంత్రిగారు మూడు నిముషాలు మాట్లాడారు. ఇంతలో భార్యామణి కాఫీ తీసుకుని వచ్చారు. ‘‘ఇంట్లో సరుకులు నిండుకున్నాయి... కిరాణా సామాన్లు తెప్పించమని చెప్పి మూడు రోజులైంది. తెప్పించారు కారు’’ అన్నారు భార్యగారు. మంత్రి కాఫీ గ్లాసును విసిరేసి.. ‘‘ఏం జగన్‌నిæ ఏరోజన్నా ఇలా నిలదీశావా? నీక్కూడా నేను లోకువగా కనిపిస్తున్నానా?’’ అని అరిచేశారు. – నానాయాజీ -
కేంద్ర నిధులతోనే రాజధాని భవనాలు
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి పూర్తిగా కేంద్ర నిధులను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నూతన రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం వెయ్యి కోట్లు, భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులను పూర్తిగా ఖర్చు చేసిన తరువాతనే కేంద్రం తదుపరి నిధులను విడుదల చేయనుంది. ప్రభుత్వ భవనాలు మినహా రాజధానిలో మిగతా నిర్మాణాలన్నీ పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టనున్నట్లు సీనియర్ మంత్రి ఒకరు పేర్కొన్నారు. నూతన రాజధానిలో పలు విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని ఆ మంత్రి పేర్కొన్నారు. ఇలా ఉండగా ప్రభుత్వ భవనాలను 12,28,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో రాజ్‌భవన్ నిర్మాణ విస్తీర్ణం 65 వేల చదరపు మీటర్లుండగా సచివాలయ నిర్మాణ విస్తీర్ణం 15 వేల చదరపు మీటర్లుగా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి సవివరమైన ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ కోసం సీఆర్డీఏ కన్సల్టెంట్లను ఆహ్వానించింది.