సీనియర్ ప్యానెల్ కౌన్సిల్‌గా హరినాథ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తరఫున ఉమ్మడి హైకోర్టులో వాదనలు వినిపించేందుకు సీనియర్ ప్యానెల్ కౌన్సిల్‌గా ఎన్.హరినాథ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారు.
అలాగే హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా బి.జితేందర్, ఎ.సుమంత్, ఆర్.శ్రీధర్, ఎస్.జనార్దన్‌గౌడ్‌లను నియమించారు. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)లో కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా డి.శోభారాణి, సివిల్ కోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో అదనపు ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా కె.హరీశ్‌రెడ్డి నియమితులయ్యారు.