Senior Resident
-
480 మంది సీనియర్ రెసిడెంట్స్ నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలతోపాటు వచ్చే ఏడాది ప్రారంభించనున్న మరో ఐదు కళాశాలల్లో 480 మంది సీనియర్ రెసిడెంట్స్(ఎస్ఆర్) నియామకానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 23వ తేదీన విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎస్‌ఆర్‌లను ఎంపిక చేయనున్నారు. వైద్య విద్య పీజీలో వచి్చన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్(ఆర్వోఆర్) ఆధారంగా పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. వీరికి రూ.70వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. మొత్తం 21 విభాగాల్లో 480 మంది సీనియర్ రెసిడెంట్స్‌ను నియమించనుండగా, అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 75, అనాటమీలో 49, బయోకెమిస్ట్రీలో 39, జనరల్ మెడిసిన్‌లో 34 ఖాళీలు ఉన్నాయి. -
1,458 ‘సీనియర్ రెసిడెంట్’ల నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్, డెంటల్ బోధనాస్పత్రుల్లో 1,458 సీనియర్ రెసిడెంట్(ఎస్ఆర్) డాక్టర్ల నియామకానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నోటిఫికేషన్ ఇచ్చింది. గత నెలలోనే ఎస్‌ఆర్‌ల నియామకానికి డీఎంఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ నోటిఫికేషన్లో కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ చదివిన వారికి అవకాశం కల్పించారు. ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చదివిన వారికీ అవకాశం కల్పిస్తూ మరో నోటిఫికేషన్ ఇచ్చారు. శనివారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీ రాత్రి 12 గంటల వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వీలుంది. 45 ఏళ్ల లోపు వయసుండి, ఏపీ స్థానికత కలిగి ఉండి పీజీ/డెంటల్ డిగ్రీ చదివి ఏపీ మెడికల్/డెంటల్ కౌన్సిల్లో రిజిస్ట్రార్ వైద్యులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. జ్టి్టp://ఛీఝ్ఛ.్చp.nజీఛి.జీn ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ఎస్ఆర్లుగా సేవలు అందించాల్సి ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.85 వేలు, స్పెషాల్టీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.70 వేలు, సీనియర్ రెసిడెంట్(పీజీ)కు రూ.65 వేల చొప్పున గౌరవ వేతనం ఉంటుంది. పీజీ తుది పరీక్షల్లో వచ్చిన(థియరీ, ప్రాక్టికల్స్)మార్కుల్లో మెరిట్ ప్రామాణికంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపికలు చేపడతారు. అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 144, జనరల్ మెడిసిన్‌లో 101, జనరల్ సర్జరీ విభాగంలో 101 ఖాళీలున్నాయి. పాథాలజీలో 88, అనాటమీలో 85, ఫార్మకాలజీలో 80, గైనకాలజీలో 69, అనస్థీషియాలో 56, పీడియాట్రిక్స్‌లో 56, ఆప్తమాలజీలో 56 ఖాళీలున్నాయి. ఇలా మొత్తంగా 49 విభాగాల్లో 1,458 ఎస్ఆర్ పోస్టులు భర్తీ కానున్నాయి. -
సీనియర్ రెసిడెంట్లకు భారీగా స్టైఫండ్ పెంపు: ఏకే సింఘాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్‌ను రూ. 45 వేల నుంచి 75 వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం తెలిపారు. కాగా రాష్ట్రంలో కరోనా విధుల్లో సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఉన్నారని.. పెంచిన స్టైఫండ్ వీరికి వర్తిస్తుందని తెలిపారు. కాగా రాష్ట్రంలో ఉన్న జూనియర్ డాక్టర్ల డిమాండ్‌పై ప్రభుత్వం చర్చిస్తోందన్నారు. అలాగే రాష్ట్రంలో పీజీ పూర్తి చేసిన 800 మంది డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని వారు కోరారని.. పీజీ వైద్యుల డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని వివరించారు. విదేశాలకు వెళ్లేవారికి మొదటి ప్రాధాన్యత అనంతరం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మాట్లాడుతూ.. '' ఏపీలో తాజా కరోనా కేసుల లెక్కల ప్రకారం పాజిటివిటీ రేట్ 13.02 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో 443 టన్నుల మేర ఆక్సిజన్ వినియోగించాం. 25 లక్షల మందికి పైగా రెండు డోసులు పూర్తయ్యాయి. 50 లక్షల మందికి పైగా మొదటి డోస్ వేయడం పూర్తైంది. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్ధులకు వ్యాక్సినేషన్ మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నాం. విదేశాలకు వెళ్లే వాళ్లు పాస్ పోర్టు నెంబర్ ఇవ్వాలి. గతంలో ఆధార్ నెంబరుతోనే కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకునేవారు. తాజాగా పాస్ పోర్టు నెంబరును కూడా కోవిన్ పోర్టల్‌లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరాం. అని తెలిపారు చదవండి: ఏపీలో కొత్తగా 12,768 కరోనా కేసులు -
ఉద్యోగాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యుబర్క్యులోసిస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యుబర్క్యులోసిస్ - రెస్పిరేటరీ డిసీజెస్, న్యూఢిల్లీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ రెసిడెంట్ విభాగాలు: టీబీ అండ్ చెస్ట్ డిసీజ్ - 4, మైక్రోబయాలజీ-1, ఎనస్థీషియా -1, మాలిక్యులార్ మెడిసిన్ / జెనెటిక్స్- 1, థోరాసిక్ సర్జరీ 1, పాథాలజీ - 1. జూనియర్ రెసిడెంట్-4 అర్హతలు తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. ఎంపిక: సెప్టెంబర్ 16న నిర్వహించనున్న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా. వెబ్సైట్: http://www.nitrd.nic.in స్కాలర్షిప్ ఆక్స్ఫర్డ్- అండర్సన్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూకే 2015 అకడమిక్ సెషన్‌కు సంబంధించి గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్కు దరఖాస్తులు కోరుతోంది. ఆక్స్ఫర్డ్- అండర్సన్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ అర్హతలు: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ విభాగంలో ఫుల్ టైం గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులో చేరినవారు అర్హులు. ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేది: జనవరి 23 వెబ్సైట్: http://www.ox.ac.uk మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు