నిజాంనే మట్టికరిపించిన చరిత్ర తెలంగాణది: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.. 👉పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘సెప్టెంబర్ 17వ తేదీని కొందరు వివాదాస్పదం చేయడం క్షమించరానిది. తెలంగాణ బాసిన సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఆవిష్కృతమైంది. నిజాంనే మట్టికరించిన చరిత్ర తెలంగాణకు ఉందన్న విషయం విస్మరించారు. ఇది తెలంగాణ ప్రజల విజయం.. ఇందులో రాజకీయాలకు తావులేదు. ఒక జాతి తన స్వేచ్చ కోసం, ఆత్మగౌరవం కోసం, రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు. ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో, వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. అందుకే ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం.👉నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ అస్థిత్వం అంటే మా కుటుంబ అస్థిత్వం అని గత పాలకులు భావించారు. టీఎస్‌ను టీజీగా మార్చాం. ఇది అక్షరాల మార్పు కాదు, ప్రజల ఆకాంక్షల తీర్పు. గత పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారు. ఏడు లక్షల కోట్ల అప్పు, ప్రతీనెలా ఆరువేల కోట్ల మేర అసలు, వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి.👉డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వైభవంగా జరపబోతున్నాం. కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం. కేంద్రం నుంచి మన హక్కుగా రావాల్సిన ప్రతీ పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే భేషజాలు లేకుండా నేను స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రులను కలిశాను. 👉హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు. అలాగే, నా స్వార్థం కూడా ఏమీ లేదు. పర్యావరణ పునరుజ్జీవనం కోసమే హైడ్రాను ఏర్పాటు చేశాం. లేక్ సిటీ.. ఫ్లడ్ సిటీగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. కేరళ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదు. భూమాఫియా గాళ్లు పేదలను ముందుపెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్‌కు హైడ్రా గ్యారంటీ. ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా. గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ నివాళులు👉గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు👉తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్👉 రేవంత్‌తో పాటు నివాళులర్పించిన నగర మేయర్, పలువురు కాంగ్రెస్ నేతలు 👉గాంధీ భవన్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ వీహెచ్, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, సహా పలువురు పాల్గొన్నారు. 👉ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ విలీనం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు. కాంగ్రెస్ వల్లనే స్వాతంత్య్రం వచ్చింది. దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యింది. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ. చదువుకున్న అనుకుంటున్న కేటీఆర్‌కి సంస్కారం లేదు. సంస్కారం లేకుండా రాజీవ్ గాంధీ విగ్రహంపై కేటీఆర్ మాట్లాడుతున్నారు. పదేళ్లు తెలంగాణ తల్లి గుర్తుకు రాలేదా?. తెలంగాణ తల్లిని గౌరవించాలని.. సెక్రటేరియట్ గుండెల్లో విగ్రహం పెడుతుంది ప్రభుత్వం. 👉సెప్టెంబర్ 17, 1948 వరకు మన సంస్థానానికి స్వాతంత్ర్యం రాలేదు. దూరదృష్టి ఉన్న నెహ్రూ.. హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను పంపించింది దేశంలో విలీనం చేయించారు. బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తుంది. తెలంగాణ విలీనం జరిగినప్పుడు బీజేపీ పుట్టనే లేదు. స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ పాత్రనే లేదు. ఆనాడు ఉన్న ఇప్పటి బీజేపీ అనుబంధ సంఘాలు బ్రిటిష్‌కి వంతపాడారు. వల్లభాయ్ పటేల్‌కి బీజేపీకి సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. 👉నేడు తెలంగాణవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పాలన దినోత్సవం నిర్వహించనున్నారు. ఇక, సెప్టెంబర్ 17వ తేదీ సందర్భంగా ఇక ప్రతీ సంవత్సరం ప్రజా పాలన దినోత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.👉తెలంగాణలో జాతీయ జెండా ఎగురవేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.👉కాగా, ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. మరోవైపు.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి సీఎం నివాళులు అర్పించనున్నారు.👉ఇక, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారమే అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజా పాలనా దినోత్సవంగా గెజిట్ విడుదల..తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా సెప్టెంబరు 17వ తేదీని ప్రకటిస్తూ సోమవారం గెజిట్ జారీ చేసింది. 1948, సెప్టెంబరు 17న రాచరిక పాలన ముగిసి భారత సమాఖ్యలో భాగమై ప్రజాస్వామిక యుగంలోకి ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలనా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు.#TelanganaNews #PrajaPalana @TelanganaCMO @revanth_anumula @V6News. pic.twitter.com/MlfqUHy8Es— Danasari Seethakka (@meeseethakka) September 17, 2024ఇది కూడా చదవండి: తెలంగాణలో రేషన్.. పరేషాన్!