Separation guarantee
-
రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం సాకులు చెబుతోంది: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం సాకులు చెబుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, గురుమూర్తి మండిపడ్డారు. ఏపీ భవన్‌లోని గురజాడ హాలులో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టులో రాష్ట్ర వాటాను తగ్గించాలని, విభజన హామీలపై పార్లమెంటులో నిలదీస్తామన్నారు. గట్టిగా ప్రశ్నిస్తాం: ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తామని ప్రకటించిన హామీలను నెరవేర్చాలని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో గట్టిగా ప్రశ్నిస్తామని ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు అన్నారు. రైల్వే పరంగా బడ్జెట్లో రాష్ట్రానికి ఈ సారి రూ. 8500 కోట్లు కేటాయించామని గణాంకాల్లో చెబుతున్నా, వాటిని ఏ విధంగా ఖర్చు చేయబోతోందీ రైల్వే శాఖ సవివరంగా చెప్పాలని కోరుతున్నామని తెలిపారు. రాష్ట్రం వైపు నుంచి భూసేకరణకు మేము డబ్బులివ్వడం లేదని రైల్వే సాకులు చెబుతోందన్నారు. అయితే ఇవన్నీ 2014 కుముందు మంజూరయిన వాటి గురించి కేంద్రం చెబుతోంది తప్ప రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన మార్పులు, రాష్ట్ర ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడడం లేదన్నారు. తిరిగి చర్చలు జరిపి, రాష్ట్ర వాటా విషయంలో మార్పులు చేయాలని తమ విజ్ఞప్తిగా పేర్కొన్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో దీనిపై పార్లమెంటులో గట్టిగానే ప్రశ్నిస్తామన్నారు. జాతీయ రహదారుల విషయంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జాతీయ రహదారిపైకి అరగంటలో చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారని, దీనికనుగుణంగానే ఎక్కువ జాతీయ రహదారులను మంజూరు చేయించుకోగలిగామని, జగన్ గారి ఆశయసాధన కోసం త్వరితంగా ఈ పనులు పూర్తి చేయిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వాటా తగ్గించాలి నడికుడి–శ్రీకాళహస్తి ప్రాధాన్యమైన రైల్వే లైను. కేంద్ర రాష్ట్రాల మధ్య 2014కు మందు కుదిరిన ఒప్పందాన్నే ఇప్పుడూ కొనసాగించాలనడం సరికాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అప్పటి ఆర్థిక స్థితి వేరు ...విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి వేరుగా ఉంది. బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోనే ఇలాంటి ఒప్పందాలను మార్చుకున్న ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. మన రాష్ట్ర వాటా విషయంలో తగ్గించాలన్నది మా విన్నపం. దీనిపై పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా పట్టుబడతామని వివరించారు. మోడల్ బస్టాండుగా తిరుపతి: ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి తిరుపతి తీర్థయాత్రా నగరం కనుక, ఇక్కడి బస్టాండును సమున్నతంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ విజయవాడ వచ్చినప్పుడు, సీఎం జగన్ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనికనుగుణంగా రూ. 500 కోట్లతో మోడల్ బస్టాండుకు వచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఎంపీ గురుమూర్తి అన్నారు. అలానే, తిరుపతిలో రోప్‌వే కు సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ప్రతిపాదించాం. శ్రీకాళహస్తిలోనూ రోప్వేకు ప్రతిపాదనలు తయారు చేశాం. విద్యా పరంగా అభివృద్ధి కోసం.. నైలెట్ సంస్థ ను తిరుపతిలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని, దీనికి సంబంధించి ఒక బృందం కూడా వచ్చి సర్వే చేసింది. అవసరమైన భవనాలనూ గుర్తించి, కేంద్రానికి ప్రతిపాదనలు చేశామని, దీనికి త్వరలో అనుమతులు రానున్నాయని పేర్కొన్నారు. తిరుపతిలో కేంద్ర ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం: ఢిల్లీ వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ గారు- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలిసి తిరుపతిలో కేంద్ర ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆ ఫైలు మహిళా భద్రతా విభాగం డైరెక్టరేట్ వద్ద ఉందని, అదీ సాకారమయ్యే అవకాశముందని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో సైదాపురం మండలంలో రెండు కేంద్రీయ విద్యాలయ భవనాలు శిథిల స్థితిలో ఉన్నాయని , ఇవి నిర్మించి 50 ఏళ్లయిందని చెప్పారు. ఈ పాఠశాలల భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్ స్పష్టమైన హామీ ఇచ్చి, ప్రతిపాదనలు పంపాలని కోరారని చెప్పారు. స్టాప్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలూ చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి తెలిపారు. జాతీయ ఉత్సవ పోర్టల్‌లో తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం బ్రహ్మోత్సవాలు: తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల కేలండర్‌ను జాతీయ ఉత్సవ పోర్టల్‌లో కాని, జాతీయ పర్యాటక కేలండర్లో కాని చూపడం లేదన్నారు. తమ విజ్ఞప్తి మేరకు మొన్ననే ఉత్సవ పోర్టల్‌లో చేర్చారని ఎంపీ గురుమూర్తి చెప్పారు. శ్రీకాళహస్తి, కాణిపాకం బ్రహ్మోత్సవాల వివరాలనూ ఉత్సవ పోర్టల్‌లో చూపాలని కోరామని, వాటినీ ఆ పోర్టల్‌లో చూపుతారని ఆశిస్తున్నామన్నారు. తిరుపతిలో ప్లానిటోరియం ఏర్పాటుకు కేంద్రాన్ని కోరామని, రూ. 13 కోట్లతో ప్లానిటోరియం ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిందని చెప్పారు. దీనికీ బదులిస్తున్నామన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆహార ప్రయోగశాల ఏర్పాటుకు రూ. 10 కోట్లు మంజూరయిందని ఎంపీ గురుమూర్తి చెప్పారు. మహిళా విశ్వవిద్యాలయంలో మరో ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. చదవండి: ఏంటి లోకేశా ఇదీ?.. నరాలు కట్ అయిపోతున్నాయ్..! తిరుపతి స్విమ్స్‌లో కేన్సర్ పరికరాల కొనుగోలు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సామాజిక బాధ్యత పథకం (సీఎస్ఆర్) కింద అవసరమైన పరికరాల కోసం రూ. 22 కోట్లు కేటాయించిందని, ఒప్పందం కూడా కుదుర్చుకున్నామని చెప్పారు. రహదారుల పరంగా చూస్తే రూ. 7వేల కోట్లతో జాతీయ రహదారి పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. రూ.560 కోట్లతో క్రిబ్కో యూనిట్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. శ్రీకాళహస్తి–నడికుడికి మరిన్ని కేటాయింపులపై అడుగుతాం శ్రీ కాళహస్తి– నడికుడి రైల్వే పనులకు రూ. 220 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్న అసంతృప్తి ఉందని, దీన్ని వ్యతిరేకిస్తున్నామని, ఎక్కువ నిధుల మంజూరు కోసం ఒత్తిడి చేస్తామని తెలిపారు. కృష్ణపట్నం ప్రాంతంలో కార్గో టెర్మినల్ అనుమతులు తుది దశలో ఉన్నాయని, దీనికీ త్వరగా అనుమతులు ఇస్తే అక్కడ రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ పనులన్నింటి విషయంలో సీఎం జగన్ తమను పరుగులు పెట్టిస్తూ, అభివృద్ధి సాధనకు తమను ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని తెలిపారు. -
విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలి: ఎంపీ మార్గాని భరత్
సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీలు కేంద్రం ఇంకా నెరవేర్చలేదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏపీ కూడా భారతదేశంలో అంతర్భాగమేనన్నారు. పోలవరం నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: ఉద్యోగులకు చంద్రబాబు ఏం ఉద్ధరించారు?: మంత్రి బొత్స ‘‘ప్రత్యేక హోదా రాష్ట్రాలు స్వర్గం అయిపోయాయా? అని చెప్పి చంద్రబాబు ప్రత్యేక హోదాను పలుచన చేశారు. కమీషన్లకు కక్కుర్తిపడి కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని తానే నిర్మిస్తానని సమస్యలు తెచ్చి పెట్టారు. సొంత స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారు. సీఎం వైఎస్ జగన్ వల్లే ప్రత్యేక హోదా డిమాండ్ సజీవంగా ఉంది. రాష్ట్రానికి వస్తున్న నిధులను టీడీపీ అడ్డుకుంటుంది. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి నిధులు వస్తాయా?. కేంద్ర ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాం. సీఎం లేవనెత్తిన అంశాలపై కార్యదర్శిల కమిటీ వేసి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కమిటీ ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నామని’’ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. -
ప్రధానితో సీఎం జగన్ భేటీ ఫలప్రదం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ఫలప్రదమైంది. ఉదయం 10.40 నుంచి 11.25 గంటల వరకు రాజకీయ, న్యాయ, ఆర్థిక అంశాలపై వీరి మధ్య జరిగిన చర్చలు సుహృద్భావ వాతావరణంలో ముగిశాయి. రాష్ట్రంలో పరిస్థితులు, విభజన హామీలు, బకాయిలు, నిధులు, తదితర అన్ని అంశాలపై వైఎస్ జగన్ ప్రస్తావనలకు ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. పూర్తి సానుకూల వాతావరణంలో ఈ సమావేశం జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. ► మంగళవారం ఉదయం ప్రధాన మంత్రి మోదీతో ఆయన అధికారిక నివాసం 7, లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొంత కాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ప్రధానికి వివరించినట్లు సమాచారం. వివిధ చట్టాలను రూపొందించేందుకు అసెంబ్లీలో బిల్లుల ఆమోదం, అనంతర పరిణామాల గురించి కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. ► రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ అమరావతిలో శాసన రాజధానిని కొనసాగిస్తూనే విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడానికి ఎదురవుతున్న అడ్డంకుల గురించి వివరించినట్లు సమాచారం. ► ప్రధానంగా అత్యధికంగా పేద ప్రజలకు లబ్ధి కలిగే అంశాలపై కూడా కొందరు కోర్టులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తూ అడ్డుకోజూడటం, ఏకంగా దర్యాప్తులు కూడా సాగకుండా కుట్రలకు తెరదీయడం గురించి కూడా వివరించినట్లు తెలిసింది. ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పెండింగ్ అంశాలను మరోసారి ప్రధాన మంత్రికి వివరించారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు సహా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై చర్చించారు. ► విభజన హామీలు సంపూర్ణంగా నెరవేర్చాలని, పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించాలని సీఎం కోరారు. విభజన అనంతరం తొలి ఆర్థిక సంవత్సరపు రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు బకాయిలను విడుదల చేయాలన్నారు. అన్ని విషయాలను ఓపికగా విన్న ప్రధాని.. అన్ని విధాలా సహకరిస్తామని వైఎస్ జగన్‌కు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ► ప్రధానితో సమావేశం అనంతరం సీఎం వైఎస్ జగన్ తన అధికారిక నివాసమైన 1, జన్‌పథ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. అంతకు ముందు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున రావు, చీఫ్ జనరల్ మేనేజర్ ఖురానా మర్యాద పూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి విజయవాడకు బయలుదేరారు. సీఎం వెంట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఉన్నారు. (చదవండి: వాటా నీటినే వాడుకుంటాం) -
వైఎస్ హయాంలో సంక్షేమ రాజ్యం
విభజన హామీలను కేంద్రం విస్మరించింది: దిగ్విజయ్ సింగ్ సాక్షి, విశాఖపట్నం: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఇళ్లు, పింఛన్లు, భూములు, రుణాలు, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను విరివిగా అమలు చేశారని ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. గురువారం విశాఖలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జయంతి నేపథ్యంలో ఆయన్ను తలుచుకుంటూ పైవిధంగా స్పందించారు. రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆరోజు టీడీపీతోపాటు ప్రధాన పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్ విభజనకు అంగీకరిస్తూ లేఖలిచ్చాయన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల్ని కేంద్రం అమలు చేయట్లేదని, వెనుకబడిన ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ఇవ్వట్లేదని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆగస్టు 6న రాహుల్‌గాంధీ విశాఖ ఏజెన్సీకి రానున్నారని, బాక్సైట్ ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించనున్నారని ఆయన తెలిపారు. భూసేకరణ, విభజన హామీలు, కాపు రిజర్వేషన్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ముంబైకి చెందిన వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్‌తో 2012లో వేదిక పంచుకోవడంపై జాతీయ మీడియాలో వస్తున్న కథనాల గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. జకీర్ నాయక్ ఆహ్వానం మేరకు 2012లో ముంబై వెళ్లానని, మత సామరస్యానికి కట్టుబడి ఉంటానని ఆరోజు చెప్పిన మాటకు నేటికీ కట్టుబడి ఉన్నానని, తనపై ఎలాంటి విచారణనైనా జరిపించవచ్చని దిగ్విజయ్ అన్నారు. సమావేశంలో పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు.